Sheikh Hasina: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాపై తాత్కాలిక ప్రభుత్వాధికారి మహమ్మద్ యూనస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హసీనాను తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ కోరే వరకు ఆమె భారత్ లోనే మౌనంగా ఉండాలని తెలిపారు. అంతే కాకుండా ఆమె వ్యాఖ్యలు రెండు దేశాల సంబంధాలపై ప్రతికూలతలు చూపుతాయని అన్నారు. ఈ మేరకు రాజధాని ఢాకాలో తన అధికారిక నివాసంలో యూనస్ మీడియాతో మాట్లాడారు.
షేక్ హసీనా తిరిగి స్వదేశానికి పంపాలని బంగ్లాదేశ్ అడిగే వరకు ఆమె భారత్ లోనే ఉండిపోతే.. కనక మౌనంగా ఆమె ఉండాలని తెలిపారు. భారత్‌లో ఉండి మాట్లాడటం ఇబ్బందికరంగా మారుతుందని అన్నారు. హసీనా బంగ్లాదేశ్‌కు విరుద్ధంగా వ్యవహరిస్తూ మాట్లాడటాన్ని ఎవరూ ఇష్టపడరని పేర్కొన్నారు. బంగ్లాదేశ్ లోని దురాగతాల నుంచి ప్రజలకు న్యాయం అందించేందుకు తాత్కాలిక ప్రభుత్వం కట్టుబడి ఉందని మహమ్మద్ యూనస్ తెలిపారు. న్యాయం జరగకపోతే తిరిగి వెనక్కి తీసుకువస్తామని అన్నారు. ఆమె పాల్పడిన దురాగతాలను అందరి ముందు విచారించాల్సిందేనని ద్వజమెత్తారు.
హిందువులపై దాడులు :
బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై జరుగుతున్న దాడులు రాజకీయంగానే జరుగుతున్నాయని మహమ్మద్ యూనస్ అన్నారు. అందులో మతతత్వం కోణం లేదని తెలిపారు. అంతే కాకుండా భారత్ లో కూడా ఈ అంశాన్ని ఎక్కువ చేసి చూపించారని అసహనం వ్యక్తం చేశారు. హిందువులు రాజకీయంగా మాజీ ప్రధాని షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ కు మద్ధతు ఇచ్చారనే అభిప్రాయం ఉండటం వల్ల కొందరు వారిపై దాడులు చేశారని ఆయన తెలిపారు. అంతే కాకుండా ఇదే విషయాన్నిమోదీకి చెప్పినట్లు యూనస్ వెల్లడించారు.
Also Read: అమెరికాలో మళ్లీ కాల్పులు.. ఈసారి స్కూల్ లో.. నలుగురు మృతి
భారత్ సంబంధాల గురించి కూడా ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. తాము భారత్ సత్సంబంధాలను కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. హసీనా నాయకత్వంలోనే బంగ్లాదేశ్‌లో స్థిరత్వం ఉంటుందననే ధోరణిని భారత్ విడనాడాలనే వ్యాఖ్యలు చేశారు. భారత్ లో ఆశ్రయం పొందుతున్నహసీనా కొన్ని రోజుల క్రితం బంగ్లా పరిణామాలపై తొలిసారి స్పందించారు. తనకు న్యాయం కావాలని ఆమె డిమాండ్ చేశారు.