Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ విచారణ గురువారం సుప్రీం కోర్టులో జరుగుతోంది. జస్టిస్ సూర్యకాంత్‌తో పాటు జస్టిస్ ఉజ్వల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసుపై విచారణ జరుపుతోంది. కేజ్రీవాల్ తరుపు న్యాయవాధి అభిషేక్ మను సుప్రీం కోర్టులో కేజ్రీవాల్ తరపున వాదనలు వినిపించారు. ఆధారాలు లేకుండా సీబీఐ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసిందని ఆరోపించారు. ఇది అరుదైన సంఘటనగా ఆయన అభివర్ణించారు.
కఠినమైన మనీలాండిరింగ్ చట్టం క్రింద ఢిల్లీ సీఎం రెండు సార్లు బెయిల్ పొందారని అన్నారు. కానీ ఆయనను కావాలనే అరెస్టు చేసిందని మండిపడ్డారు. ఈ కేసులో రెండేళ్ల తర్వాత కేజ్రీవాల్ సీబీఐ అరెస్టు చేసిందని అన్నారు. మూడు కోర్టు ఉత్తర్వులు కేజ్రీవాల్ కు అనుకూలంగా ఉన్నాయి. అయినా భీమా అరెస్టు క్రింద సీబీఐ కేజ్రీవాల్‌ను అదుపులోకి తీసుకుందని అన్నారు.
ఈ కేసులో మిగతా నిందితులైన విజయ్ నాయర్, మనీష్ సిసోడియా, బుచ్చిబాబు, సంజయ్ సింగ్ , కవిత విడుదలయ్యారని అన్నారు. అంతే కాకుండా సీబీఐ సెక్షన్ 41, 41ఏ లను పాటింకుండా అర్నేష్ కుమార్, యాంటిల్ తదితర తీర్పులను ఉల్లంఘించి కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసిందని ఆరోపించారు. కేజ్రీవాల్ ఇప్పటి వరకు 2 సార్లు బెయిల్ పొందారని పీఎంఎల్ ఏ సెక్షన్ 45 క్రింద కోర్టు ఒక సారి బెయిల్ ఇచ్చిందని గుర్తు చేశారు. కేజ్రీవాల్ అరెస్టును సమర్థించేందుకు అంతకు మించి దర్యాప్తు సంస్థ కోర్టు ముందు ఎలాంటి ఆధారాలు చూపించలేదని తెలిపారు.
Also Read: ‘ముఖ్యమంత్రులు మహారాజులు కాదు’.. ఉత్తరా ఖండ్ సిఎంపై సుప్రీం ఘాటు వ్యాఖ్యలు!
ఇదిలా ఉంటే మరోవైపు బెయిల్ కోసం మనీష్ సిసోడియా ట్రయల్ కోర్టుకు వెళ్లారు. కానీ కేజ్రీవాల్ ఒక్కసారి కూడా ఆ పని చేయవలేదని ఆయన తెలిపారు. ఇలాంటి కేసుల్లో తాము జోక్యం చేసుకోలేం అని తిరిగి ట్రయల్ కోర్టుకు వెళ్లండి అని సుప్రీం కోర్టు చెప్పిన కేసులు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. కేజ్రీవాల్‌ను సెషన్స్ కోర్టుకు వెళ్లకుండానే హైకోర్టును ఆశ్రయించారని తెలిపారు. అసాధారణమైన కేసుల్లో మాత్రమే హైకోర్టు పరిశీలిస్తుందని తెలిపారు. అంతే కాకుండా సాధారణ కేసుల్లో ముందుగా సెషన్స్ కోర్టును ఆశ్రయించాల్సి ఉంటుందని తెలిపారు. కేజ్రీవాల్ ముందుగా సుప్రీం కోర్టుకు వచ్చారు.