Ukraine vs Russia: రష్యా – ఉక్రెయిన్ యుద్ధం ఇంకా ముగిసేలా కనిపించడం లేదు. అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన శాంతి ప్రయత్నాలు కూడా ఏ మాత్రం ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. రెండు దేశాలు పరస్పరం దాడులు కొనసాగిస్తూనే ఉన్నాయి. తాజాగా మాస్కో నుండి పంపిన డ్రోన్ దాడి కారణంగా ఉక్రెయిన్ నౌకాదళానికి చెందిన అతిపెద్ద రహస్య నిఘా నౌక సిమ్ఫెరోపోల్ మునిగిపోయింది. రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించింది.
ఈ నౌక ఉక్రెయిన్ గత పదేళ్లలో నిర్మించిన అతిపెద్ద నౌక. రేడియో, ఎలక్ట్రానిక్, రాడార్, ఆప్టికల్ నిఘా కార్యకలాపాలకు ఉపయోగపడేలా రూపొందించబడింది. 2019లో నిర్మాణం పూర్తైన ఈ నౌక 2021లో అధికారికంగా నౌకాదళంలో చేరింది. 30 మిల్లీమీటర్ల ఆర్టిలరీ సిస్టమ్‌తో ఇది ఆయుధ సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంది.
Also Read: Realme 15T Smartphone: ఏముంది రా బాబు.. రియల్‌మీ 15T స్టైలిష్ డిజైన్ లీక్
రష్యా ప్రభుత్వ మీడియా ఏజెన్సీ టాస్ తెలిపిన వివరాలు
సముద్ర డ్రోన్ ద్వారా జరిగిన మొదటి విజయవంతమైన దాడి. ఈ దాడి డాన్యూబ్ నది డెల్టా ప్రాంతంలో జరిగింది. ఆ ప్రాంతం ఉక్రెయిన్ ఓడెస్సా ప్రాంతానికి చెందుతుంది. దాడి జరిగినట్లు ఉక్రెయిన్ అధికారులు కూడా ధృవీకరించాయి. అయితే దాడి ఎలా జరిగిందన్న వివరాలు మాత్రం వెల్లడించలేదు. ఈ దాడిలో నౌకలో ఒక సిబ్బంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. మిగతా సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చినట్లు ఉక్రెయిన్ నేవీ ప్రతినిధి దిమిత్రో ప్లేటెన్చుక్ వెల్లడించారు.
కొంతమంది సిబ్బంది కనిపించకుండా పోయారు, వారిని వెతికే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఉక్రెయిన్ నేవీకి ఇది పెద్ద నష్టం అని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఒకవైపు యుద్ధంలో ప్రతిరోజు ఎదురుదాడులు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో, అత్యంత కీలకమైన నిఘా నౌకను కోల్పోవడం ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు వ్యూహాత్మకంగా తీవ్రమైన దెబ్బ అని వారు వ్యాఖ్యానిస్తున్నారు.
🚨⚡️ EPIC STRIKE!
Watch Russia’s high-speed kamikaze sea drone obliterate the Ukrainian Navy’s Simferopol reconnaissance ship at the Danube mouth.
The strike was precise—ship sunk instantly.
Midnight in southern Odesa, dominance is undeniable. 🇷🇺🔥 pic.twitter.com/qPUxwW9pVR
— RussiaNews 🇷🇺 (@mog_russEN) August 28, 2025