Trump Tariffs: ట్రంప్ ఏదైనా డెసిషన్ తీస్కుంటే అదో పెద్ద వివాదాస్పదం కావడం మాత్రమే కాదు.. కోర్టు వరకూ వెళ్తోంది వ్యవహారం. ప్రస్తుతం ట్రంప్ విధిస్తోన్న సుంకాలు చాలా వరకూ చట్ట విరుద్ధమని అమెరికా ఫెడరల్ అప్పీల్స్ కోర్టు తీర్పునిచ్చింది. అధ్యక్షుడు ట్రంప్ తన ఆర్ధిక అధికారాలను అధిగమించి భారీ ఎత్తున టారీఫ్ లను పెంచినట్టు చెబుతోంది.7-4 తేడాతో అప్పీళ్ల కోర్టు న్యాయమూర్తులు ఈ తీర్పు వెలువరించారు. భారీగా విధించిన సుంకాలు.. పలు దేశాలను ప్రభావితం చేశాయని ఈ సందర్భంగా పేర్కొంది కోర్టు.
టారీఫ్ లను చట్ట విరుద్ధమంటూ.. తీర్పు చెప్పిన అమెరికా అప్పీళ్ల కోర్టు
ప్రస్తుతానికి పెంచిన టారీఫ్ లను అక్టోబర్ 15 వరకూ మాత్రమే కొనసాగించడానికి అనుమతిచ్చారు న్యాయమూర్తులు. దీంతో ఈ నిర్ణయాన్ని యూఎస్ సుప్రీం కోర్టులో సవాలు చేసేందుకు అనుమతించింది కోర్టు. అప్పీళ్ల కోర్టు తీర్పుపై ట్రంప్ సుప్రీం కోర్టులో పోరాడనున్నారు.
అప్పీళ్ల కోర్టు తీర్పును తప్పు పడుతోన్న ట్రంప్
అప్పీళ్ల కోర్టు తీర్పును ట్రంప్ తీవ్రంగా తప్పు పడుతున్నారు. ఈమేరకు తన సోషల్ మీడియా ట్రూత్ లో పోస్ట్ చేశారు. విదేశాలపై విధించిన సుంకాలు ప్రస్తుతం అమల్లో ఉన్నాయి. వాణిజ్య భాగస్వాములపై విధించిన సుంకాలను తొలగించాలని.. అప్పీళ్ల కోర్టు పక్షపాతంగా తీర్పు చెప్పిందనీ.. ఈ ప్రక్రియలో చివరకు అమెరికా విజయం సాధిస్తుందని అన్నారాయన.
టారీఫ్‌లను తొలగిస్తే.. విఘాతమేనంటోన్న డొనాల్డ్ ట్రంప్
ఒక వేళ టారీఫ్ లను తొలగిస్తే దేశ చరిత్రలోనే ఒక విపత్తు తలెత్తుతుందని.. ఇది అమెరికా అభివృద్ధికి విఘాతం కలిగిస్తుందని తన ట్రూత్ పోస్టులో రాసుకొచ్చారు ట్రంప్. అమెరికా మరింత బలపడాలి, కానీ ఈ నిర్ణయం దేశాన్ని ఆర్ధికంగా బలహీన పరుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు ట్రంప్.
విదేశీ వాణిజ్య అడ్డంకులను అడ్డుకోడానికి.. అమెరికా ఎట్టి పరిస్థితుల్లో సహించదని స్పష్టం..
వాణిజ్య లోటు పూడ్చడానికి, విదేశీ వాణిజ్య అడ్డంకులను అడ్డుకోడానికి.. అమెరికా ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని స్పష్టం చేశారు ట్రంప్. ఒక వేళ టారీఫ్ లు ఎత్తివేస్తే ఈ నిర్ణయం అమెరికాను నాశనం చేస్తుంది. మన కార్మికులకు సాయం చేయడానికి ఇదొక్కటే సరైన మార్గమని గుర్తు పెట్టుకోవాలని సూచించారు ట్రంప్. మన రైతులను, తయారీదారులను అణచివేసేందుకు మిత్ర దేశాలైనా, శతృ దేశాలైనా మనపై విధించే అనైతిక సుంకాలను అమెరికా ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోదని అన్నారు ట్రంప్. ఒక వేళ ప్రస్తుతం తాను విధిస్తున్న టారీఫ్ లను ఎత్తి వేస్తే ఈ నిర్ణయం అమెరికాను సర్వ నాశనం చేస్తుందని అన్నారు ట్రంప్.
దేశం ఆర్ధికంగా బలపడాలంటే ఈ సుంకాలు మస్ట్ అండ్ షుడ్
మన కార్మికులకు సాయం చేయడానికి ఇదొక్కటే సరైన మార్గమని గుర్తు పెట్టుకోవాలని సూచించారు ట్రంప్. అమెరికా బ్రాండ్ ని ప్రపంచ మార్కెట్లలోకి తీస్కెళ్లే మన కంపనీలకు సపోర్ట్ గా నిలవాలని సూచించారు. కొన్నేళ్లుగా మన నాయకులు టారీఫ్ లను మనకు వ్యతిరేకంగా ఉపయోగించారనీ.. తొలిసారి తాను అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగా టారీఫ్ లను ప్రయోగించానని.. సుప్రీం కోర్టు ఇందుకు మద్ధతుగా నిలవాని కోరారాయన. అప్పుడే అమెరికా బలమై ఆర్ధిక శక్తిగా నిలుస్తుందని అన్నారు ట్రంప్.
Also Read: తహసీల్దార్ నివాసంలో ఏసీబీ సోదాలు.. రూ.5 కోట్ల విలువైన ఆస్తుల గుర్తింపు!
ఇతర దేశాలపై భారీగా సుంకాలు..
ట్రంప్ రెండో సారి అధికారంలోకి వచ్చాక అంతర్జాతీయ అత్యవసర ఆర్ధిక అధికారాల చట్టం- IEEPA ను అమలులోకి తెచ్చారు. దీని ద్వారా ఇతర దేశాలపై భారీగా సుంకాలు విధించారు. మొదట బేస్‌లైన్‌గా 10 శాతం టారిఫ్‌లు విధించారు. ఇక భారత్‌పై తొలుత 26 శాతం టారిఫ్‌లు విధించగా, రష్యా నుంచి భారత్ చమురును తక్కువకు కొని లబ్ధి పొందుతోందని- వాటిని 50 శాతానికి పెంచారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు భారీ ఎదురుదెబ్బ..
టారిఫ్ లు చట్ట విరుద్ధమని ఫెడరల్ అప్పీల్స్ కోర్టు తీర్పు
భారీగా విధించిన సుంకాలు భారత్ సహా పలు దేశాలను ప్రభావితం చేశాయన్న కోర్టు
ఫెడరల్ అప్పీల్స్ కోర్టు తీర్పును యూఎస్ సుప్రీంకోర్టులో సవాల్ చేసేందుకు సిద్ధమైన ట్రంప్ pic.twitter.com/HHD1Qk1AWy
— BIG TV Breaking News (@bigtvtelugu) August 30, 2025