BigTV English

Myanmar’s Junta govt arrested: మయన్మార్‌లో దారుణం.. జీతాలు పెంచినందుకు, యాజమాన్యాన్ని అరెస్ట్ చేసి..

Myanmar’s Junta govt arrested: మయన్మార్‌లో దారుణం.. జీతాలు పెంచినందుకు, యాజమాన్యాన్ని అరెస్ట్ చేసి..

Myanmar’s Junta govt arrested(Latest international news today): మయన్మార్.. ఈ పేరు చెప్పనక్కర్లేదు. సైన్యం పాలనలో అక్కడి ప్రజలు బక్కచిక్కిపోతున్నారు. కనీసం తినడానికి తిండి లేక నానావస్థలు పడుతున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రజలు, అక్కడ ఉండే కంపెనీలు సైన్యం చెప్పినట్టు నడుచుకోవాల్సిందే.. లేదంటే జైలుకే.


తాజాగా తమ వద్ద పని చేసే ఉద్యోగులకు కొన్ని కంపెనీలు జీతాలు పెంచాయి. దాన్ని నేరంగా భావించి పలువురు కంపెనీ అధినేతలను అరెస్ట్ చేసింది సైన్యం. ద టీజ్ మయన్మార్. మయన్మార్ పాలనలో సైన్యం మగ్గిపోతున్నారు. సైన్యం తీసుకొచ్చిన చట్టాల కారణంగా అక్కడి ప్రజలు నరకం అనుభవిస్తున్నా రు.

ప్రస్తుతం ఉద్యోగులకు కొన్ని కంపెనీలు జీతాలు పెంచారన్న కారణంతో కంపెనీల యజమానులను అరెస్టు చేసి జైలుకి పంపించింది మిలటరీ ప్రభుత్వం. అక్కడ ద్రవ్యోల్భణం పెరుగుతున్న వేళ జీతాలు పెంచడం నేరమన్నది అక్కడి సైన్యం మాట. ఆదేశ వ్యాప్తంగా దాదాపు పది కంపెనీ ఓనర్లను జైలుకి పంపించింది. వారికి మూడేళ్లు జైలు శిక్ష విధించడమేకాదు, చివరకు ఆయా కంపెనీలను మూసివేసింది.


నార్మల్‌గా వేతనాలు పెంచడం ఎక్కడైనా చట్ట విరుద్ధం కాదు. ద్రవ్యోల్బణం పెరుగుతున్నవేళ జీతాలు పెంచడం వల్ల దేశంలో అశాంతి నెలకొంటుందని అక్కడి సైన్యం ఆలోచన. ఇదే విషయాన్ని షాపుల ముందు అంటించిన నోటీసుల్లో పేర్కొంది. యజమానులు శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తున్నారని ఆరోపించింది.

ALSO READ: కరేబియన్ దీవులను వణికించిన.. బెరిల్ హరికేన్..

అక్కడ పలుమార్లు ఎన్నికలు జరిగాయి.. ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అయినా అక్కడే అంతా మిలటరీ నేతల కనుసన్నల్లో నడవాల్సిందే. మూడేళ్ల కిందట ఆంగ్‌సాన్ సూకీ ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైంది. ఆ ప్రభుత్వాన్ని కూల్చేసి పగ్గాలు అందుకున్నారు మిలటరీ నేతలు. సైన్యం పాలనలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటోంది. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకాయి. దీంతో అక్కడి ప్రజలు అల్లాడిపోతున్నారు. అయినా మిలటరీ ప్రభుత్వం కళ్లు తెరవలేదు.

Tags

Related News

Pushpa – Trump: ‘పుష్ప’ తరహాలో ఆ దేశానికి ఝలక్ ఇచ్చిన ట్రంప్.. ఇలా తయారయ్యావేంటి మామ!

Nepal Crisis: నేపాల్ ఆర్మీ వార్నింగ్.. విధ్వంసానికి పాల్పడితే కఠిన చర్యలు, కొత్త ప్రధాని ఆయనే?

Nepal Agitation: మనుషులను తగలబెట్టేసేంతగా ‘సోషల్ మీడియా’లో ఏం ఉంది? నిబ్బాల చేతిలో నేపాల్?

Nepal: నేపాల్‌లో ఇది పరిస్థితి.. ఆర్థిక మంత్రిని నడిరోడ్డుపై వెంబడించి.. కొడుతూ, తన్నుతూ.. వీడియో వైరల్

Gen Z Movement: దారుణం.. నేపాల్ మాజీ ప్రధాని భార్యను తగలబెట్టేసిన నిరసనకారులు

US-Pak: పాకిస్తాన్ లో అమెరికా ఖనిజాన్వేషణ.. భారత్ కి చెక్ పెట్టేందుకేనా?

Big Stories

×