BigTV English

Train Accident: రైలు ఢీకొని 5 కి.మీలు ఈడ్చుకుంటూ వచ్చిన మృతదేహం..వీడియో వైరల్

Train Accident: రైలు ఢీకొని 5 కి.మీలు ఈడ్చుకుంటూ వచ్చిన మృతదేహం..వీడియో వైరల్

Warangal to Secbad Train Accident: మేడ్చల్ జిల్లాలోని ఘట్‌కేసర్‌లో రైలుకు వేలాడుతూ వచ్చిన మృతదేహం భయాందోళనకు గురిచేసింది. రైలు పట్టాలు దాటుతున్న ఓ వృద్ధుడిని రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆ వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే ఆ మృతదేహం రైలు ఇంజిన్ ముందు భాగంలో చిక్కుకోవడంతో ప్రమాదం జరిగిన సంఘటన నుంచి ఘట్‌కేసర్ వరకు సుమారు 5 కిలోమీటర్లు అలాగే వేలాడుతూ వచ్చింది.


ఘట్‌కేసర్ ప్రాంతంలో రైల్వే గేట్ పడగా.. రైలుకు మృతదేహం వేలాడుతూ రావడాన్ని చూసిన వాహనదారులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. మృతదేహాన్ని చూసి వెంటనే అధికారులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన రైల్వే పోలీసులు రైలును ఆపి మృతదేహాన్ని బయటకు తీశారు.

బీబీనగర్, ఘట్ కేసర్ రైల్వే స్టేషన్ మధ్య వృద్ధుడు రైలు దాటేందుకు ప్రయత్నం చేశాడని, ఇంతలో వరంగల్ నుంచి వస్తున్న ప్యాసింజర్ రైలు ఢీకొట్టినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో వృద్ధుడు రైలు ముందు భాగానికి చిక్కుకోవడంతో సుమారు 5 కిలోమీటర్ల మేరకు వేలాడుతూ వచ్చిందని తెలిపారు. మృతి చెందిన వృద్ధుడు నీలం రంగు చొక్కాఆరెంజ్ లుంగీ, కుడిచేతికి కడియం ధరించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. కాగా, ప్యాసింజర్ రైలు..వరంగల్ నుంచి సికింద్రాబాద్ వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.


Also Read: తల్లి ముందే కూతురుని కారుతో తొక్కేసిన వీడియో వైరల్..

ఈ ప్రమాదంపై రైల్వే అధికారులు అలర్ట్ జారీ చేశారు. రైలు వస్తున్న సమయంలో తొందరపడి పట్టాలు దాటేందుకు రాకూడదన్నారు. కొన్ని సమయాల్లో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. రైల్వే పట్టాలకు సమీపంలో ఉండే వ్యక్తులు ఇతర మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.

Tags

Related News

Dogs Day Celebrations: ఆ దేశంలో శునకానికి పూజ చేసి.. వేడుకలు చేస్తారు, ఎందుకంటే?

Viral video: బస్సును నడుపుతున్న యువతి.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

Rain Types: బ్లడ్ రెయిన్, యానిమల్ రెయిన్.. ఈ వింతైన వానల గురించి మీకు తెలుసా?

Dog video: పిల్లలపై వీధి కుక్క దాడి.. హీరోలో వచ్చి కాపాడిన పెంపుడు కుక్క.. వీడియో వైరల్

Thief viral video: తాళం బ్రేక్ కాదు.. జస్ట్ ఇలా ఓపెన్! దొంగ ‘పెట్రోల్ ట్రిక్’తో పోలీసులు కూడా షాక్!

Engagement With AI: ఈ అమ్మాయికి ఇదేం పిచ్చి? AIతో ఎంగేజ్మెంట్.. 5 నెలలుగా డేటింగ్, చివరికి అది కూడా?

Big Stories

×