BigTV English

Volkswagen Discounts: భలే ఆఫర్లు.. వోక్స్‌వ్యాగన్ కార్లపై లక్షల్లో డిస్కౌంట్లు!

Volkswagen Discounts: భలే ఆఫర్లు.. వోక్స్‌వ్యాగన్ కార్లపై లక్షల్లో డిస్కౌంట్లు!

Volkswagen Discounts: వోక్స్‌వ్యాగన్ ఇండియా ఈ నెలలో తన రెండు కార్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ఇందులో టైగన్ SUV, Virtus సెడాన్ కార్లు ఉన్నాయి. కంపెనీ టైగన్‌పై రూ. 1.80 లక్షలు, వర్టస్‌పై రూ. 1.45 లక్షల వరకు తగ్గింపును ఇస్తోంది. ఈ SUV 2023, 2024  మోడళ్లపై కంపెనీ వేరువేరుగా డిస్కౌంట్లను అందిస్తోంది. కాబట్టీ మీరు కూడా ఈ నెలలో ఈ SUVని దక్కించుకోవాలంటే ఈ ఆఫర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.


వోక్స్‌వ్యాగన్ టైగన్ MY2024 1.0 TSI మోడల్‌పై కంపెనీ రూ. 1.30 లక్షల వరకు బెనిఫిట్స్ అందిస్తోంది. ఇందులో నగదు తగ్గింపు, ఎక్స్‌ఛేంజ్ బోనస్‌లో పాటు లాయల్టీ బోనస్‌లు ఉన్నాయి. మరోవైపు కంపెనీ MY2024 1.5 TSI మోడల్‌పై రూ. 1 లక్ష వరకు తగ్గింపును అందిస్తోంది. అదనంగా బేస్ 1.0 TSI MT కంఫర్ట్‌లైన్ వేరియంట్ ప్రత్యేక ధర రూ. 10.90 లక్షల (ఎక్స్-షోరూమ్) వద్ద అందుబాటులో ఉంది. కంపెనీ రూ. 20,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 20,000 లాయల్టీ బోనస్‌ను కూడా అందిస్తోంది.

Also Read: మనూరి బండి.. అదరకొట్టిన టీవీఎస్ ఎక్స్‌ఎల్.. ఏంటయ్యా ఆ క్రేజ్!


MY2024 మోడల్‌లతో పోలిస్తే అన్ని MY2023 టైగన్‌లపై కంపెనీ రూ. 50,000 అదనపు నగదు తగ్గింపును ఆఫర్ చేస్తోంది. కంపెనీ MY23 టైగన్ GT 1.5 TSI MT క్రోమ్‌ను రూ. 14.99 లక్షల ప్రత్యేక ధరకు అందిస్తోంది (ఎక్స్-షోరూమ్). దీనికి రూ. 80,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 20,000 లాయల్టీ బోనస్ లభిస్తోంది. టైగన్‌లో 6 ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్‌గా ఉన్నాయి. పాత 2 ఎయిర్‌బ్యాగ్ మోడల్‌ను స్టాక్ నుండి తొలగించడానికి కంపెనీ రూ. 40,000 అదనపు నగదు తగ్గింపును కూడా ఇస్తోంది.

వోక్స్‌వ్యాగన్ ఈ కారుపై కస్టమర్లకు కంపెనీ రూ.1.45 లక్షల వరకు తగ్గింపును ఇస్తోంది. ఈ నెలలో కంపెనీ ఈ కారుపై క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, లాయల్టీ బోనస్ వంటి ప్రయోజనాలను అందిస్తోంది. MY2024 1.0 TSI సెలెక్ట్ చేసిన వేరియంట్‌లకు ఇవి వర్తిస్తాయి. ఇంతలో కంపెనీ ఎంట్రీ-స్పెక్ కంఫర్ట్‌లైన్ 1.0 MTని ప్రత్యేక ధర రూ. 10.90 లక్షలు (ఎక్స్-షోరూమ్)తో విడుదల చేసింది. ఈ కారుపై ఎక్స్ఛేంజ్, లాయల్టీ బోనస్ అందుబాటులో ఉన్నాయి.

Also Read: నిస్సాన్ ఎక్స్-ట్రైల్ SUV వచ్చేస్తోంది.. టీజర్ చూస్తే పూనకాలే!

ఇది కాకుండా Virtus 1.5 TSI వేరియంట్‌లపై కంపెనీ 70,000 రూపాయల ఎక్స్ఛేంజ్ బోనస్, లాయల్టీ బోనస్‌ను కూడా అందిస్తోంది. టైగన్ మాదిరిగానే Virtus  కొన్ని డ్యూయల్-ఎయిర్‌బ్యాగ్ వేరియంట్‌లు కూడా రూ. 40,000 నగదు తగ్గింపును అందిస్తున్నాయి. తద్వారా మిగిలిన స్టాక్ పూర్తిగా క్లియర్ చేయాలని కంపెనీ భావిస్తోంది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 11.56 లక్షలుగా ఉంది.

Tags

Related News

Dmart Offers: డిమార్ట్ సిబ్బంది చెప్పిన సీక్రెట్ టిప్స్.. ఇలా చేస్తే మరింత చౌకగా వస్తువులు కొనేయొచ్చు!

GST Slabs: జీఎస్టీలో సంస్కరణలు.. ఇకపై రెండే స్లాబులు, వాటికి గుడ్ బై

లోన్ క్లియర్ అయ్యిందా..అయితే వెంటనే ఈ డాక్యుమెంట్స్ తీసుకోకపోతే భారీ నష్టం తప్పదు..

బంగారంలో మాత్రమే కాదు ఇకపై ఈ లోహంలో కూడా పుత్తడిని మించిన లాభం రావడం ఖాయం..

ఫ్రీగా క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోవాలని ఉందా..? అయితే ఈ స్టెప్స్ ఫాలో అవండి..

ఇకపై టోల్ గేట్ అడ్డంకులు లేవు…నేటి నుంచి ఫాస్టాగ్ పాస్ అమలు..ఇలా రీచార్జ్ చేయించుకోండి..

Big Stories

×