E-Paper
Advertisement

శవాల గుట్టలు.. శరీర భాగాలు.. పది అంతస్తుల ఎత్తులో బురద ప్రవాహం.. ఎలా ముంచేసిందంటే?

శవాల గుట్టలు.. శరీర భాగాలు.. పది అంతస్తుల ఎత్తులో బురద ప్రవాహం.. ఎలా ముంచేసిందంటే?
Advertisement

కేరళాలోని వయనాడ్‌లో 2024లో ఏం జరిగిందో తెలిసిందే. అంతా నిద్రపోతున్న వేళ.. అకస్మాత్తుగా విరుచుకుపడ్డ వరద.. ఒక ఊరు మొత్తాన్ని కబళించింది. అంతా గాఢ నిద్రలో ఉండటం వల్ల.. ఎవరూ తప్పించుకోలేని పరిస్థితి. అధికారిక లెక్కల ప్రకారం.. 298 మంది చనిపోయారు. ఇంకా వందలాది మంది ఆచూకీ తెలియరాలేదు. వారు కూడా చనిపోయారనే భావిస్తున్నారు. ఇప్పుడు అలాంటిదే.. నేపాల్‌లో కూడా చోటుచేసుకుంది. అయితే, రాత్రి వేళ రాలేదు. పగటి వేళే వచ్చింది. సరిగ్గా 8.30 నుంచి 9 గంటల ప్రాంతంలో వరద ప్రవాహం రాకాసిలా విరుచుకుపడింది. పడగ విప్పిన పాములా అమాంతంగా.. గ్రామాలకు గ్రామాలను మింగేసింది. సుమారు 10 అంతస్తులకు పైగా ఎత్తైన బురద ప్రవాహం.. క్షణాల్లో పరివాహక ప్రాంతాలను ముంచేసి.. తనతో తీసుకుపోయింది. ఇళ్లు కూలిపోయాయ్.. వంతెనలు తెగిపోయాయ్.. బండరాళ్లు కూడా దూది పింజాల్లా కనిపించాయంటే.. ఆ వరద బలం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఎక్కడ చూసినా శవాలు, శరీర భాగాలే..

ఈ భారీ ప్రవాహం.. తప్పిచుకొనే ఛాన్స్ ఇవ్వలేదు. చాలామంది అది మన వరకు రాలేదులే అనుకున్నారు. కానీ, రెప్పపాటులో దిశ మార్చుకుని.. ఊర్లను సైతం తనలో కలిపేసుకుంది ఆ రాకాసి వరద. విపత్తు తర్వాత చూస్తే.. బురదలో కూరుకుపోయిన శవాల గుట్టలు కనిపించాయి. కొన్ని చోట్ల తెగిపడిన కాళ్లు చేతులు.. అబ్బా, ఇక చెప్పలేం. చాలా దారుణమైన పరిస్థితి. ఇది చదువుతుంటేనే మన గుండెలు బరువెక్కుతున్నాయంటే.. ఆ ప్రళయాన్ని ప్రత్యక్షంగా చూసిన, అనుభవించిన ప్రజల పరిస్థితి మరెలా ఉంటుందో ఊహించుకోండి. ఇప్పటివరకు లభ్యమైన శవాలు సుమారు 270. ఇంకా వేలాది మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. వారు బతికే ఉన్నారా? లేదా బురదలోనే సజీవ సమాధి అయ్యారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

ప్రళయ విధ్వంసం.. ఇలా మొదలైంది

Advertisement

మొదట్లో దీన్ని భూకంపంగా భావించారు. చైనాలో ఒక డ్యామ్ బద్దలైందని అనుకున్నారు. కానీ, హిమాలయాల్లో ఏర్పడిన హిమపాతం వల్ల.. ఒక భారీ గ్లేసియార్ విరిగిపడి త్రిశూలి, భోటే కోషి నదుల్లో ‘ఉప్పెన’ సృష్టించింది. ఫలితంగా గట్టు తెగినట్లుగా నీరంతా ఒక్కసారే అంత ఎత్తు నుంచి కిందికి ప్రవహించ సాగింది. సెకన్ల వ్యవధిలో అది పర్వాతాల్లో ఉన్న రాళ్లు, రప్పలు, బండరాళ్లను తొలిచేస్తూ.. పెద్ద బురద ప్రవాహంగా మారింది. డ్యామ్‌లను సైతం కూల్చేస్తూ.. అక్కడి నీటిని కూడా తనలో కలుపుకుంటు.. ఒకటి రెండింతలు ప్రమాదకరంగా మారింది. దాని మార్గంలో ఉన్న 19 వంతెనలు, 40 కిలోమీటర్ల రోడ్లు, 6 జలవిద్యుత్ కేంద్రాలను సైతం ప్రవాహం ధ్వంసం చేసింది. చైనా-నేపాల్ సరిహద్దుల మధ్య ఉన్న గైరోంగ్ పోర్ట్ బోర్డర్ క్రాసింగ్ పూర్తిగా ధ్వంసమైంది. వరద పోటేత్తె సమయంలో అక్కడ సరిహద్దు దాటేందుకు వెళ్లిన వందలాది టూరిస్టులు.. భయంతో పరుగులు పెడుతోన్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతున్నాయి.

Advertisement

Also Read: స్వర్గం లాంటి దేశంలో.. పదే పదే విపత్తులు ఎందుకు? నేపాల్‌ వినాశనానికి దారితీస్తున్న అంశాలివే!

ఆ 288 మంది భారతీయులు ఏమయ్యారు?

విపత్తు సమయానికి నేపాల్‌లో ఉన్న 288 మంది భారతీయుల ఆచూకీ తెలియకపోవడంపై సర్వత్రా ఆందోళన నెలకొంది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాలు ప్రకారం.. సరిహద్దు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన 288 మంది భారతీయుల గురించి తమకు ఎలాంటి సమాచారం అందలేదని పేర్కొన్నారు. వీరిలో చాలామంది కైలాస మానససరోవర్ యాత్రకు వెళ్లినవారు, స్థానికంగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఇతర పర్యాటకులు ఉన్నారని తెలిపారు. బాధితుల వివరాల కోసం విదేశాంగ శాఖ కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసింది. నేపాల్ ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది.

నేపాల్ వరద విధ్వంసం వీడియోలు.. గుండె ధైర్యం ఉంటేనే చూడండి

Tags

Related News

అతిపెద్ద చమురు సంస్థ అరామ్కోపై క్షిపణి దాడి.. హౌతీ దూకుడుతో సౌదీకి వణుకు

తన బొమ్మలకు పని చెప్పిన కిమ్.. క్షిపణులతో డిష్యుం డిష్యుం.. పొరుగు దేశాల్లో కలవరం!

ఫ్లైట్ కోసం ఎదురుచూస్తుంటే.. తలపై పడ్డ బాంబు, ఇండియన్స్‌తో పాటు 13 మంది…

భూమికి సౌర తుఫాను ముప్పు.. ఉపగ్రహాలు- జీపీఎస్ వ్యవస్థల మాటేంటి? రాత్రికి ఆకాశంలో ఏం జరుగుతోంది?

నేపాల్‌లో మరోసారి ఆకస్మిక వరదలు.. సల్లేరి బజార్‌ను ముంచెత్తిన ప్రళయం, అధికారులు హెచ్చరిక జారీ

రియాద్ ఎయిర్‌పోర్టుపై హౌతీల మెరుపుదాడి, 12 మంది మృతి, అలర్టయిన అమెరికా

అమెరికాలో కాల్పుల కలకలం.. గర్భిణి, పిల్లలు సహా 9 మంది మృతి!

కుప్పకూలిన నెట్‌వర్క్‌లు, మూతపడ్డ ఎయిర్‌పోర్ట్.. పనామాలో మహా విపత్తు!

Big Stories

Advertisement
×