Kailash Mansarovar Yatra Break: నేపాల్-టిబెట్ ఫ్లాష్ ఫ్లడ్స్ నేపథ్యంలో కైలాస మానస సరోవర్ యాత్రకు బ్రేక్ పడింది. జలప్రళయం వల్ల నెల రోజులపాటు మానస సరోవరం మార్గం మూసి వేత వేశారు అధికారులు. నేపాల్ మీదుగా జరగాల్సిన మానస సరోవర యాత్రకు రోడ్డు మార్గాలు మూసుకుపోయాయి. గురువారం ఖాట్మాండ్ నుంచి సరోవర్ యాత్రను నిలిపి వేసినట్టు ప్రకటన చేసింది. టూరిస్టులు తమ స్వస్థలాలకు వెళ్లిపోవాలని సూచించారు నేపాల్-టిబెట్ బోర్డర్ అధికారులు.
భారతదేశం నుండి కైలాష్ మానస సరోవర్ యాత్రకు మూడు ముఖ్యమైన మార్గాలు ఉన్నాయి. ఒక మార్గం ఉత్తరాఖండ్‌లోని పిథోరగఢ్ మీదుగా ఉంది. మరొకటి సిక్కింలోని నాథూ లా పాస్ మీదుగా ఉంది. ఈ రెండు మార్గాల్లో ప్రయాణాన్ని భారత ప్రభుత్వం నిర్వహిస్తుంది. నేపాల్ మీదుగా వెళ్లే మరో మార్గం కూడా ఉంది. అక్కడ నుంచి టూరిస్టులు.. టూర్ ఆపరేటర్ల ద్వారా కైలాష్ మానసరోవర్ యాత్రకు ప్రయాణిస్తారు. ఎందుకంటే మిగతా రెండు మార్గాల కంటే ఈ మార్గం రాకపోకలకు సులువుగా ఉంటుంది.
నేపాల్ నుండి కైలాష్ మానసరోవర్ యాత్ర చేసే ప్రయాణం చాలా భిన్నంగా ఉంటుంది. అక్కడి నుంచి ప్రైవేట్ టూర్ ఆపరేటర్లు.. సాధారణంగా యాత్రికులను టిబెట్‌కు తీసుకెళ్తారు. ఆ రూట్లోనే రసువాగఢి-కెరుంగ్ మార్గం ఉంది. ఇందులో కాఠ్మండు – స్యాఫ్రుబేసి – టిమురే – రసువాగఢి -కెరుంగ్/గ్యిరాంగ్ – సాగా – మానసరోవర్ – డార్చెన్ – కైలాష్ ఉంటాయి. ఈ మార్గంలో నేపాల్ వైపు రసువా-చైనా వైపు కెరుంగ్/గ్యిరాంగ్ ఉంటాయి. ఇక్కడే నేపాల్-టిబెట్ సరిహద్దును యాత్రికులు యాత్రకు వెళ్తుంటారు.
నేపాల్ నుండి కైలాష్ మానస సరోవర్ యాత్రకు వెళ్ళే మరో ప్రధాన మార్గం. ఇది పశ్చిమ నేపాల్ ద్వారా వెళ్తుంది. ఈ మార్గంలో కాఠ్మండు-నేపాల్‌గంజ్-సిమికోట్-హిల్సా-యారి సరిహద్దు-పురాంగ్/తక్లకోట్-మానసరోవర్-డార్చెన్-కైలాష్ ఉన్నాయి. ఈ మార్గంలో తొలుత నేపాల్‌లోని నేపాల్‌గంజ్, సిమికోట్ ప్రాంతాలకు విమానంలో ప్రయాణించాలి. అక్కడి నుంచి హెలికాప్టర్ల ద్వారా హిల్సాకు వెళ్తారు. అక్కడి నుండి నేపాల్-టిబెట్ సరిహద్దు దాటి చైనాలోని టిబెట్ ప్రాంతంలోకి ప్రవేశిస్తాయి. ఈ మార్గం టిబెట్‌లోని లాసా మీదుగా వెళ్లాల్సి వుంటుంది.
భోటేకోశి నదికి వచ్చిన జల ప్రళయం కారణంగా కైలాష్ మానసరోవర్ యాత్రను ప్రభావితం చేసింది. ఈ వరద కారణంగా గతంలో ఉన్న రసువాగఢి-కెరుంగ్ మార్గానికి అంతరాయం ఏర్పడింది. ఆకస్మిక వరదల వల్ల సఫ్రుబేసి-తిమురేతో సహా సరిహద్దు ప్రాంతాలను ప్రభావితం చేసింది. రోడ్లు, వంతెనలు దారుణంగా దెబ్బతిన్నాయి. రసువాగఢి మీదుగా జరిగే సరిహద్దు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
సముద్ర మట్టానికి సుమారు 14,000 నుండి 19,500 అడుగుల ఎత్తులో మానస సరోవర్ యాత్ర సాగుతుంది. కష్టతరమైన మార్గాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా అత్యంత ప్రమాదకరమైనదిగా చెబుతారు. ఆ ఎత్తులో ఆక్సిజన్ స్థాయి చాలా తక్కువగా ఉంటుంది. దీనివల్ల శ్వాస తీసుకోవడంలో యాత్రికులు ఇబ్బందులు పడుతుంటారు. తలనొప్పి, కళ్లు తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అంతేకాకుండా కైలాస పర్వతం చుట్టూ సుమారు 52 కిలోమీటర్లు పొడవు ప్రదక్షిణ ఉంటుంది. అది కాలినడకన పూర్తి చేయడానికి మూడు రోజులు పడుతుంది.
ఈ మార్గం రాళ్లతో నిండి ఉంటుంది, అంతేకాదు ఎగుడు దిగుడు, నిటారుగా ఉండటం వల్ల కీళ్లు, పాదాలపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. మధ్యలో డోల్మాలా కనుమ ఎక్కడం అత్యంత కష్టమైనది. నిటారుగా మంచుతో నిండి ఉంటుంది. అయితే దాని దిగువ మార్గం చాలా చల్లగా ఉంటుంది. శరీరంలోని శక్తిని వేగంగా తగ్గిస్తుంది. అక్కడ వాతావరణం క్షణక్షణం మారుతూ ఉంటుంది. బలమైన చల్లని గాలులు, మంచు కురవడం, ఉష్ణోగ్రత అకస్మాత్తుగా గడ్డకట్టే స్థాయికి పడిపోవడం వంటివి ప్రయాణికులకు సవాళ్లను విసురుతాయి.