E-Paper
Advertisement

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 15 మంది శిశువులు మృతి, ఇస్లామాబాద్ ఆసుపత్రిలో ఘోరం

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 15 మంది శిశువులు మృతి, ఇస్లామాబాద్ ఆసుపత్రిలో ఘోరం
Advertisement

Hospital Accident: కారణాలు ఏమైనా కావచ్చు.. ఈ మధ్యకాలం ఆసుపత్రిలో ఆగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్న మహారాష్ట్ర కాగా, నేడు ఇస్లామాబాద్ వంతైంది. ఇస్లామాబాద్‌లోని అతి పెద్ద ఆసుపత్రిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 15 మంది నవజాత శిశువులు మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. అసలు ఆసుపత్రిలో ఏం జరిగింది?

 

ఇస్లామాబాద్ ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం

Advertisement

పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఘోర ప్రమాదం జరిగింది. పాక్‌లోని అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రి పాకిస్తాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్-పిమ్స్‌లోని గైనకాలజీ వార్డులో బుధవారం ఉదయం 7 గంటల సమయంలో ఎయిర్ కండిషనర్ కంప్రెసర్ పేలింది. ఈ ఘటనలో గైనకాలజీ వార్డులో చోటు చేసుకుంది. ఒక్కసారిగా మంటలు ఆసుపత్రిని కమ్మేశాయి.

ఈ ప్రమాదంలో మొత్తం 15 మంది శిశువులు ప్రాణాలు కోల్పోయారు. ఆసుపత్రిలోని ఎంసీహెచ్ వార్డు మూడవ అంతస్తులో జరిగిన ఈ ప్రమాదంలో 14 మంది చిన్నారుల మృతదేహాలు పూర్తిగా కాలిపోయాయి. ఈ విషయాన్ని జిల్లా యంత్రాంగం తెలిపింది. కేవలం ఒక పసికందుని సిబ్బంది కాపాడారు. ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థలో ఏర్పడిన సాంకేతిక లోపం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు.

Advertisement

 

15 మంది శిశువులు మృతి, విచారణ మొదలు

ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక-సహాయక బృందాలు అక్కడికి చేరుకున్నాయి. దాదాపు రెండు గంటల తర్వాత మంటలను అదుపులోకి తెచ్చాయి. మృతుల సంఖ్యపై అంతర్జాతీయ మీడియా సంస్థలు 14 మంది పేర్కొన్నారు. ఆసుపత్రి వర్గాలు 15 మంది శిశువులు మృతి చెందినట్టు పేర్కొన్నాయి.

ఈ ఘటన తర్వాత ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో గందరగోళం నెలకొంది. నవజాత శిశువుల మృతితో కుటుంబ సభ్యులు దుఃఖంలో మునిగిపోయారు. ఈ ఘటనకు గల కారణాలు, నిర్లక్ష్యం ఉందేమోనని తెలుసుకునేందుకు జిల్లా యంత్రాంగం అదనపు డిప్యూటీ కమిషనర్ నేతృత్వంలో ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ అగ్నిప్రమాదానికి అసలు కారణాన్ని కనుగొనడంతోపాటు, ఆసుపత్రి భద్రతా వ్యవస్థలో ఏమైనా లోపాలు ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు చేయనుంది.

ALSO READ: ఇరాన్ పై అమెరికా ఉక్కుపాదం.. ఆర్థికంగా దెబ్బతీసేందుకు ఎత్తులు

Related News

అతిపెద్ద చమురు సంస్థ అరామ్కోపై క్షిపణి దాడి.. హౌతీ దూకుడుతో సౌదీకి వణుకు

తన బొమ్మలకు పని చెప్పిన కిమ్.. క్షిపణులతో డిష్యుం డిష్యుం.. పొరుగు దేశాల్లో కలవరం!

ఫ్లైట్ కోసం ఎదురుచూస్తుంటే.. తలపై పడ్డ బాంబు, ఇండియన్స్‌తో పాటు 13 మంది…

భూమికి సౌర తుఫాను ముప్పు.. ఉపగ్రహాలు- జీపీఎస్ వ్యవస్థల మాటేంటి? రాత్రికి ఆకాశంలో ఏం జరుగుతోంది?

నేపాల్‌లో మరోసారి ఆకస్మిక వరదలు.. సల్లేరి బజార్‌ను ముంచెత్తిన ప్రళయం, అధికారులు హెచ్చరిక జారీ

రియాద్ ఎయిర్‌పోర్టుపై హౌతీల మెరుపుదాడి, 12 మంది మృతి, అలర్టయిన అమెరికా

అమెరికాలో కాల్పుల కలకలం.. గర్భిణి, పిల్లలు సహా 9 మంది మృతి!

కుప్పకూలిన నెట్‌వర్క్‌లు, మూతపడ్డ ఎయిర్‌పోర్ట్.. పనామాలో మహా విపత్తు!

Big Stories

Advertisement
×