Konda Sushmitha: సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా కొండా సుష్మిత చేసిన ఘాటు వ్యాఖ్యలు ఓ పథకం ప్రకారమే జరిగినట్లు స్పష్టమవుతుందనే చర్చ ఇప్పుడు కాంగ్రెస్ లో మొదలైంది. పైగా ‘ప్లాన్ ఏ అయిపోయింది, ప్లాన్ బీలో తన బిడ్డ ఏం చేస్తుందో తెలియదు ’అంటూ సీనియర్ నేత కొండా మురళీ చేసిన వ్యాఖ్యలు ఆ అనుమానానికి బలాన్ని చేకూర్చాయి. దీంతో కాంగ్రెస్ లో పాలిటిక్స్ ఒక్కసారిగా హీటెక్కాయి. పైగా ఆ వెంటనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాసంలో జరిగిన కీలక నేతల భేటీ హస్తం పార్టీలో ఊహించని ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి.
ఇది కేవలం పదవుల కోసం జరుగుతున్న పోరాటమా? లేక పార్టీలో అంతర్గతంగా పెద్ద రాజకీయ మార్పునకు తెరలేస్తున్న సంకేతమా? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. డిప్యూటీ సీఎం భట్టి నివాసంలో ‘పాత’ నేతల కలయిక సస్పెన్స్ గా తెరలేపింది. అంతేగాక ఈ సమావేశానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరుకావడం, అదే సమయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు కూడా అక్కడే ఉండటం పలు రకాలుగా చర్చకు దారి తీసింది.
కొండా కుటుంబం ఆశిస్తున్న రాజకీయం వెనక రెండు స్పష్టమైన వ్యూహాలు ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్లాన్ ఏ లో భాగంగా పరకాల అసెంబ్లీ టికెట్‌తో పాటు కొండా మురళీకి ఎమ్మెల్సీ పదవి సాధించుకోవడమే లక్ష్యంగా అడుగులు వేశారు. ఇందుకు సీఎం రేవంత్ రెడ్డి సుముఖంగా లేనందునే ఆయన వైఖరిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించి, అధిష్టానాన్ని ఒత్తిడిలోకి నెట్టే ప్రయత్నం చేశారు. కానీ దీన్ని సీరియస్ గా తీసుకున్న పార్టీ, ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలకు సిద్ధమైంది. పైగా ఎమ్మెల్యేలంతా కూడా ముక్తకంఠతో చర్యలు తీసుకోవాల్సిందేనని పార్టీ, ప్రభుత్వంపై కూడా ఒత్తిడి తెస్తున్నారు.
Also read: జేబులో పట్టేంత కాంపాక్ట్ డిజైన్! ఫీచర్లు చూస్తే ఫిదా
ఏకంగా ప్రెస్ మీట్ లు పెట్టి మరీ ప్రభుత్వంలోని మంత్రిని రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం గమనార్హం. ఏఐసీసీ కూడా అదే రిపోర్టును అందజేశారు.ఒకవేళ క్రమశిక్షణా చర్యల పేరిట పార్టీ బయటకు పంపితే ప్లాన్ బీ అమలు చేయాలని సుష్మిత ప్రిపేర్ గా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇతర పార్టీల దారులు వెతుక్కోవడంతో పాటు పార్టీలోని ‘పాత కాంగ్రెస్’ నేతల మద్దతును దక్కించుకోవడం ప్లాన్ బీలో భాగంగా డిస్కషన్ మొదలైంది. అంతేగాక సీఎం రేవంత్ శైలిపై అసంతృప్తిగా ఉన్న పాత కాంగ్రెస్ నేతలందరినీ ఒక్కతాటిపైకి తెచ్చేందుకు ఈ ప్లాన్ బీని అమలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.
అయితే సుష్మిత ఒక్కరే ఈ ప్లాన్ లను అమలు చేస్తారా? లేక తన తండ్రి, తల్లిలను కూడా ఇన్వాల్వ్ చేస్తారా? అనేది సస్సెన్స్ గా మారింది. కానీ కొండా మురళీ మాత్రం తాము పార్టీ మారే ప్రస్తక్తే లేదని తేల్చి చెప్పడం విశేషం. ఇలాంటి పరిస్థితుల్లో సుష్మిత మదిలో ఏమున్నది? భవిష్యత్ లో ఏ విధంగా రియాక్ట్ అవుతారనేది హాట్ టాఫిక్ గా మారింది. పార్టీలో కనీసం సభ్యత్వం లేకపోయినా..మంత్రి కూతురుగా చేసిన వ్యాఖ్యలు పార్టీ, ప్రభుత్వంలో సీరియస్ నెస్ ను క్రియేట్ చేశాయి.
Also read: 1871లో మనుషుల్లేని ద్వీపంలోకి 5 ఆవులు.. 137 ఏళ్ల తర్వాత అక్కడ ఉన్నది చూసి.. శాస్త్రవేత్తలే షాక్!
మరోవైపు కొండా మురళీ కుమార్తె కొండా సుష్మిత ఇప్పటికే జనసేన నేతలతో టచ్‌లో ఉన్నారనే వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. దీనికి బలం చేకూరుస్తూ జనసేన తెలంగాణ అధ్యక్షుడు కూడా సుష్మిత తమతో సంప్రదింపుల్లో ఉన్నట్లు బహిరంగంగానే సంకేతాలిచ్చారు. కాంగ్రెస్‌లో సీన్ తిరగబడితే, వెంటనే జనసేన , ఇతర మిత్రపక్షాల వైపు జంప్ అయ్యేలా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారనేది ఈ ప్రచారం సారాంశం.
ఇదిలా ఉండగా, ఒకేసారి రాజగోపాల్ రెడ్డి, కొండా మురళీలు రంగంలోకి దిగడం, వారికి సీనియర్లు తోడవడంతో కాంగ్రెస్ అధిష్టానం తీవ్ర ధర్మసంకటంలో పడింది. కఠిన చర్యలు తీసుకుంటే పాత నేతల తిరుగుబాటు ముప్పు, వదిలేస్తే ప్రభుత్వ ప్రతిష్ట దిగజారే ప్రమాదం ఉన్నది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్లాన్ లు పార్టీలో ఎలాంటి కుదుపులను తీసుకువస్తాయి? ఎవరికి ప్రయోజనం చేకూరుస్తాయి? రాజకీయాల్లో వచ్చే మార్పులు ఏమిటనేది త్వరలోనే తేలనున్నది.
Also read: ఎల్ నినో కంటే జగనే పెద్ద విపత్తు.. మంత్రి అచ్చెన్నాయుడు ఫైర్!