E-Paper
Advertisement

ఓటీటీలోకి షాకింగ్ మర్డర్ మిస్టరీ… భర్తను చంపిందని భార్య అరెస్ట్… క్లైమాక్స్ లో పిచ్చెక్కించే ట్విస్ట్

ఓటీటీలోకి షాకింగ్ మర్డర్ మిస్టరీ… భర్తను చంపిందని భార్య అరెస్ట్… క్లైమాక్స్ లో పిచ్చెక్కించే ట్విస్ట్
Advertisement

Murder Mystery on OTT : ఒక చిన్న పట్టణంలో దారుణమైన హత్య జరుగుతుంది. ఆ హత్య చేసింది తన భర్త భార్యే అని పోలీసులు తేల్చేస్తారు. కానీ కేసు గురించి తెలుసుకోవడానికి వచ్చిన ఓ జర్నలిస్ట్‌కు మాత్రం ఒక్కో వ్యక్తి ఒక్కో కథ చెబుతుంటారు. ఒకరు ఆమెను భర్త హింసించాడంటారు… మరొకరు ఆమెకు అక్రమ సంబంధం ఉందంటారు… ఇంకొకరు వాళ్లిద్దరూ ఎంతో సంతోషంగా ఉండేవాళ్లంటారు. మరి నిజం ఏది? అసలు ఆ భర్తను చంపింది ఎవరు? మూడు భిన్నమైన కథల మధ్య నిజాన్ని వెతికే జర్నలిస్ట్ ప్రయాణమే ‘బోల్ బోల్ రాణి’. మరి ఈ సినిమా స్టోరీ ఏంటి? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? తెలుగులో ఉందా? అనే వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

కథ ఒక చిన్న పట్టణంలో మొదలవుతుంది. అక్కడ జరిగిన ఓ హత్యతో ఊరంతా ఒక్కసారిగా ఉలిక్కిపడుతుంది. ఈ కేసును కవర్ చేయడానికి జర్నలిస్ట్ ఆభాస్ ఆ ఊరికి వస్తాడు. హత్యకు సంబంధించిన వివరాలు తెలుసుకునే కొద్దీ అతనికి మాయ అనే మహిళ పేరు పదే పదే వినిపిస్తుంది. చివరికి తన భర్తను చంపిన కేసులో మాయ అరెస్ట్ అయిందని తెలుస్తుంది. అయితే మాయ గురించి ఆ ఊరిలో ఎవరికీ ఒకే అభిప్రాయం ఉండదు. ఆమె భర్త తనను బంధించి చిత్రహింసలకు గురి చేసేవాడని, అతని వల్ల మాయ చాలా బాధపడేదని రావుడ్య అనే వ్యక్తి చెబుతాడు. అంటే భర్తను చంపడానికి ఆమెకు బలమైన కారణం ఉందన్నమాట.

Advertisement

కానీ ఆభాస్ మరో వ్యక్తిని కలిసినప్పుడు డిఫరెంట్ కథ బయటకు వస్తుంది. గంధాలి చెప్పే ప్రకారం మాయ చాలా ఫాస్ట్‌గా ఉండే అమ్మాయి. భర్తతో కలిసి సంతోషంగా జీవిస్తున్నప్పటికీ, ఆమెకు మరో వ్యక్తితో సంబంధం ఉందని, డ్రగ్స్‌కు కూడా అలవాటు పడిందని చెబుతుంది. మరి ఇక్కడ ఎవరి మాట నిజం? ఇంతలో మరో వ్యక్తి చెప్పే కథ మాత్రం అందరినీ కన్ఫ్యూజ్ చేస్తుంది. మాయ, ఆమె భర్త చాలా సంతోషంగా ఉండే జంట అని, వాళ్ల మధ్య పెద్ద సమస్య ఏమీ లేదని అతను చెబుతాడు. అయితే మాయ గతంలో ప్రేమించిన వ్యక్తి తిరిగి ఆమె జీవితంలోకి వచ్చిన తర్వాతే పరిస్థితులు మారిపోయాయని అంటాడు.

ఇక్కడే సినిమాలో అసలు ట్విస్ట్ మొదలవుతుంది. ఒకే సంఘటనను ముగ్గురు వ్యక్తులు మూడు రకాల కథలు చెబుతున్నారు. ప్రతి కథలోనూ కొన్ని నిజాలు ఉన్నట్టే కనిపిస్తాయి. అదే సమయంలో మరికొన్ని విషయాలు అబద్ధాల్లా అనిపిస్తాయి. ఆభాస్ ఒక్కో వ్యక్తిని ప్రశ్నిస్తూ అసలు నిజాన్ని బయటకు తీసే ప్రయత్నం చేస్తుంటాడు. అయితే ఈ విచారణ మొత్తం సీరియస్‌గా సాగుతుందని అనుకుంటే పొరపాటే. చిన్న పట్టణంలోని వింత మనుషులు, వాళ్ల విచిత్రమైన ప్రవర్తన, ఒక్కో వ్యక్తి చెప్పే అతిశయోక్తి కథలతో క్రైమ్‌కి కామెడీ టచ్ కూడా వస్తుంది.

Advertisement

అందుకే సినిమా ఒకవైపు మర్డర్ మిస్టరీగా ఉత్కంఠ కలిగిస్తూనే, మరోవైపు కొన్ని సన్నివేశాల్లో నవ్విస్తుంది. కానీ ఆభాస్ దర్యాప్తు ముందుకు వెళ్లేకొద్దీ మాయ చుట్టూ ఉన్న రహస్యాలు మరింత పెరుగుతాయి. ఆమె నిజంగా తన భర్తను చంపిందా? లేక ఎవరో చేసిన నేరానికి ఆమెను బలిపశువుగా మార్చారా? ఆమె భర్తతో ఉన్న సంబంధం నిజంగా ఎలా ఉండేది? ఆమె గత ప్రేమికుడి రాకతో అసలు ఏం జరిగింది? ముఖ్యంగా ముగ్గురు వ్యక్తులు చెప్పిన కథల్లో ఏది నిజం? ఒకే హత్యకు ఇంత భిన్నమైన వెర్షన్లు ఎందుకు ఉన్నాయి? మాయ అసలు ఎలాంటి వ్యక్తి? చివరికి ఆభాస్ కనిపెట్టే నిజం ఏంటి? అనేదే సినిమాలో అసలు థ్రిల్.

Also Read : డ్యాన్సర్‌ నుంచి కోట్ల సామ్రాజ్యానికి బాస్‌గా… ఓటీటీలోకి తెలుగులో హై-వోల్టేజ్ డ్రామా

తెలుగులో అందుబాటులో ఉందా ?

‘బోల్ బోల్ రాణి’కి సిడ్ విన్సుర్కర్ దర్శకత్వం వహించారు. సాయి తమ్హాంకర్ మాయగా, సుబోధ్ భావే ఆభాస్‌గా, చిన్మయ్ మాండ్లేకర్ మాయ భర్తగా కీలక పాత్రల్లో నటించారు. సౌరభ్ భావే, హిమాన్షు నింభోర్కర్ కథకు రచయితలుగా వ్యవహరించారు. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఆడియో మరాఠీలో మాత్రమే ఉంది, ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ అందుబాటులో ఉన్నాయి. మర్డర్ మిస్టరీతో పాటు బ్లాక్ కామెడీ, వేర్వేరు వ్యక్తుల వెర్షన్స్, నమ్మలేని కథనాలతో సాగిపోయే ఇన్వెస్టిగేషన్ హైలెట్ గా ఉంటాయి.

Related News

ఇదేం పిచ్చిరా అయ్యా… ప్రియురాలి కోసం పాతాళంలోకి… క్రేజీ మైథలాజికల్ లవ్ స్టోరీ

ఓటీటీలోకి ట్రెండీ యూత్ కామెడీ… ఒకే ఇంట్లో 5 మంది ఫ్రెండ్స్… రూమ్‌మేట్స్ సీక్రెట్స్ బయటపడితే ఇంత రచ్చా?

డ్యాన్సర్‌ నుంచి కోట్ల సామ్రాజ్యానికి బాస్‌గా… ఓటీటీలోకి తెలుగులో హై-వోల్టేజ్ డ్రామా

ఎయిర్‌పోర్ట్‌లో రోజుకో సమస్య… వాటి వెనుక దిమ్మతిరిగే కథలు… ఈ సిరీస్ మిస్ కావొద్దు

ఓటీటీలోకి యశ్ టాక్సిక్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

గుండెను చీల్చీ చూస్తే… టీవీ ప్రత్యక్షం, ఇదెక్కడి థ్రిల్లర్ మామా… మైండ్ బెండింగ్ అనుకో!

పాడుబడిన స్కూల్ లో పారానార్మల్ సీన్స్… సైకాలజిస్ట్‌కు ఎదురైన ఒళ్లు గగుర్పొడిచే షాకింగ్ నిజం

Big Stories

Advertisement
×