E-Paper
Advertisement

నేపాల్‌లో విధ్వంసం తర్వాత.. భారత్ సరిహద్దులో చైనా భారీ డ్యామ్‌, ‘వాటర్ బాంబ్’ అని ఎందుకంటున్నారు?

నేపాల్‌లో విధ్వంసం తర్వాత.. భారత్ సరిహద్దులో చైనా భారీ డ్యామ్‌, ‘వాటర్ బాంబ్’ అని ఎందుకంటున్నారు?
Advertisement

Medog Dam: నేపాల్‌లో జల ప్రళయం అనేక అంశాలను తెరపైకి తెచ్చింది. భారత్ సరిహద్దులో చైనా నిర్మిస్తున్న ప్రాజెక్టుకు ఆ తరహా ముప్పు పొంచి వుందా? భారత్‌పైకి నీటి బాంబును చైనా రెడీ చేస్తుందా? భూకంపాలకు కేంద్రమైన ప్రాంతంలో ప్రాజెక్టు ఎలా నిర్మిస్తోంది? దీనిపై మేధావులు-నిపుణులు పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఇంతకీ చైనా ఎక్కడ ప్రాజెక్టులు నిర్మిస్తోంది?

 

భారత్ సరిహద్దులో చైనా భారీ డ్యామ్‌ నిర్మాణం

Advertisement

అరుణాచల్ ప్రదేశ్ సమీపంలో భారీ నీటి ప్రాజెక్టు నిర్మాణం చేస్తోంది చైనా. దేశంలోకి బ్రహ్మపుత్ర నదిగా మారే యార్లంగ్ త్సాంగ్పో నదిపై 60,000 మెగావాట్ల ఈ ప్రాజెక్టు రెడీ చేస్తోంది. హిమాలయాల నుంచి వచ్చే నీరు నేరుగా దేశంలోని ఈశాన్య రాష్ట్రాలను చేరుకుంది. నేపాల్‌లో సంభవించిన జల ప్రళయం తర్వాత దీనిపై మేధావులు-నిఫుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2033 నాటికి ఆ ప్రాజెక్టుని అందుబాటులోకి తీసుకురావాలని బీజింగ్ పాలకులు ఆలోచన చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు.. చైనా ఆక్రమిత టిబెట్ అటానమస్ రీజియన్‌ లోని మెడోగ్ లేదా మెడాంగ్‌ ప్రాంతంలో ఉంది. భూకంపాలు అధికంగా సంభవించే అవకాశం ఉన్న ప్రాంతం. ఈ ప్రాంతంలో భారీ డ్యామ్‌ నిర్మించడాన్ని నిపుణులు జల బాంబుగా అభివర్ణిస్తున్నారు.

 

ఈ ప్రాజెక్టుని జల బాంబ్ గా చెబుతున్న నిపుణులు

Advertisement

సముద్ర మట్టానికి సుమారు 2 వేల మీటర్ల ఎత్తులో ఉంటుంది. చైనా ప్రభుత్వ ఆధ్వర్యంలోని జియోలాజికల్ సర్వేకు అనుబంధంగా ఉన్న భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు జూలైలో ఈ ప్రాజెక్టుపై అధ్యయనం చేసింది. మెడోగ్ జలవిద్యుత్ కేంద్రం కొన్ని కీలక విషయాలు బయటపెట్టారు. క్రియాశీల ఫాల్ట్ లైన్ పైన ఉందని, ఈ ప్రాంతం సున్నిత సరిహద్దులో ఉందని, నివాసాలను-మౌలిక సదుపాయాలను నిర్మిస్తోందని పేర్కొంది. అక్కడున్న రాళ్లను చీల్చుతున్నట్లుగా గుర్తించారు నిపుణులు. ఇది మంచు యుగం కాలం నుంచి భూకంపాలు చురుగ్గా ఉన్నట్లు అంచనా వేశారు. ఈ బీటలు జల విద్యుత్‌ ప్రాజెక్టు సమీపంలో నిర్మించే డ్యామ్‌లు, రోడ్లు, వంతెనలు, సొరంగాల వంటి మౌలిక సదుపాయాలను దెబ్బతీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మెడోగ్ ఆనకట్ట.. యార్లంగ్ త్సాంగ్పో నది టిబెట్‌లోని నామ్చా బర్వా పర్వతం చుట్టూ ఒక పెద్ద ‘యు’ టర్న్ తీసుకుంటుంది.

 

చైనా నిపుణులు ఏం చెబుతున్నారు?

అంతేకాదు హిమాలయ భూకంప మండలం మధ్యలో అతిపెద్ద ఆనకట్ట నిర్మాణాన్ని కొనసాగించడంలో మూర్ఖత్వంగా చెబుతున్నారు నిపుణులు. భారత్-టిబెట్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న ప్రాజెక్ట్‌ని జల బాంబు ప్రస్తావించారు. భారత ఈశాన్య ప్రాంతాన్ని ముంచివేసి, దిగువనున్న బంగ్లాదేశ్‌లో తీవ్ర విధ్వంసం సృష్టించగలదని చెబుతున్నారు. భారత మాజీ రాయబారి, విదేశీ వ్యవహారాల వ్యాఖ్యాత రాజీవ్ డోగ్రా కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు వల్ల ఈశాన్య ప్రాంతానికి పెద్ద విధ్వంసం వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. నీటి భద్రత, వరదలు, పర్యావరణం, దిగువన నివాసం ఉంటున్న ప్రజల భవిష్యత్తుపై భారత్‌లో ఆందోళనలు లేకపోలేదు.

ALSO READ: స్వర్గం లాంటి దేశంలో.. పదే పదే విపత్తులు ఎందుకు? నేపాల్‌ వినాశనానికి దారితీస్తున్న అంశాలివే!

మోటువో జలవిద్యుత్ కేంద్రంగా పిలువబడే ఈ ప్రాజెక్టుకు సుమారు 167 బిలియన్ డాలర్లు ఖర్చవుతుందని అంచనా. సిడ్నీకి చెందిన లోవీ ఇన్‌స్టిట్యూట్ అనే థింక్ ట్యాంక్ ప్రకారం.. ఈ ప్రాజెక్టు పూర్తయితే ప్రపంచంలో అతి పెద్దైన త్రీ గోర్జెస్ డ్యామ్‌ను అధిగమించి, అతి పెద్ద జలవిద్యుత్ ప్రాజెక్టుగా నిలుస్తుందని అంచనా వేసింది. దాదాపు మూడు రెట్లు ఎక్కువ విద్యుత్తును ఉత్పత్తి చేయగలదని ప్రస్తావించారు. నేపాల్ లాంటి ఘటనల నుంచి చైనా మేలుకుంటుందా? తనకు ఎదురులేదని ముందుకు వెళ్తుందా? అనేది వెయిట్ అండ్ సీ?

Related News

స్వర్గం లాంటి దేశంలో.. పదే పదే విపత్తులు ఎందుకు? నేపాల్‌ వినాశనానికి దారితీస్తున్న అంశాలివే!

నేపాల్‌లో జల ప్రళయం.. మానస సరోవర్ యాత్రకు బ్రేక్, యాత్రకు ఎన్ని మార్గాలున్నాయి?

నేపాల్ జల ప్రళయంలో 160 మంది మృతి.. 1000 మంది మిస్సింగ్, చైనా ఎందుకు సైలెంట్ అయ్యింది?

ప్రపంచవ్యాప్తంగా వీసా ఇంటర్వ్యూలు నిలిపివేత.. ట్రంప్ సర్కార్ కీలక నిర్ణయం

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 15 మంది శిశువులు మృతి, ఇస్లామాబాద్ ఆసుపత్రిలో ఘోరం

ఇరాన్‌పై అమెరికా ఉక్కుపాదం.. ఆర్థికంగా దెబ్బతీసేందుకు ఎత్తులు, నెక్ట్స్ ప్లాన్ ఇదే!

హెచ్-1బీ వీసా కొత్త రూల్స్ రెడీ.. ఫీజు లక్ష డాలర్లు పైనే.. జాబ్ పోతే తక్షణం దేశం వీడాల్సిందే!

Big Stories

Advertisement
×