E-Paper
Advertisement

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కీలక నిర్ణయం.. డోక్లాం-గాల్వాన్ ఘర్షణల జనరల్‌పై వేటు, ఏం జరిగింది?

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కీలక నిర్ణయం.. డోక్లాం-గాల్వాన్ ఘర్షణల జనరల్‌పై వేటు, ఏం జరిగింది?
Advertisement

China: భారత్ – చైనా మధ్య సంబంధాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయా? భారత్‌తో తన స్నేహాన్ని బలోపేతం చేసుకోవడానికి వేగంగా చైనా అడుగులు వేస్తోందా? ఈ క్రమంలో ఇరుదేశాల మధ్య కొన్ని అంశాలపై దృష్టి పెట్టిందా? కొందరు ఆర్మీ అధికారులపై వేటు వేసిందా? అధికారులపై వేటు దేనికి సంకేతం? ఇవే ప్రశ్నలు చాలామంది వెంటాడుతున్నాయి.

 

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కీలక నిర్ణయం

Advertisement

అమెరికా ఆర్థిక వ్యవస్థ పతనం దిశగా అడుగులు వేస్తున్న సమయంలో.. చైనా వేగంగా పావులు కదుపుతోంది. ముఖ్యంగా భారత్‌తో స్నేహ సంబంధాలను బలోపేతం చేసేకునే దిశగా అడుగులు వేస్తోంది ఈ క్రమంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. భారత్‌తో డోక్లాం-గాల్వాన్ ఘర్షణలకు కారణమైన పీఎల్‌ఏ జనరల్‌ను కీలక పదవి నుంచి తొలగించింది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆధ్వర్యంలో సైనిక నాయకత్వంలో భారీ మార్పుల నేపథ్యంలో ఈ ఘటన జరిగింది. అంతేకాదు జావోను చైనీస్ పీపుల్స్ పొలిటికల్ కన్సల్టేటివ్ కాన్ఫరెన్స్- CPPCC సభ్యత్వం నుండి తొలగించింది. దీనికితోడు మరో రెండు పదవుల నుంచి తొలగించింది.

2017లో డోక్లాం, 2020లో గాల్వాన్ లోయ భారత సైనికులతో ఘర్షణల సమయంలో చైనా వెస్ట్ ప్రాంతానికి జనరల్‌గా వ్యవహరించారు జావో జోంగ్కి. భారతదేశ సరిహద్దు- టిబెట్-జిన్‌జియాంగ్‌ ప్రావెన్సుల్లో సైనిక కార్యకలాపాలు చైనా సైన్యంలో వెస్ట్రన్ కమాండర్ చూసేవాడు. జావో తొలగింపుకు బీజింగ్ ఎలాంటి కారణం చెప్పలేదు, ఆయనపై ఎలాంటి విచారణను ప్రకటించలేదు. చైనా సైన్యంలో అవినీతికి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారంలో ఆయన బాధితుడు అయ్యారనే ఊహాగానాలకు తొలగింపు ప్రక్రియ మరింత ఆజ్యం పోసింది.

Advertisement

 

భారత్‌కు చైనా స్నేహ హస్తం, వేగంగా అడుగులు

జావోను తొలగించిన తర్వాత మరో ఇద్దరు సీనియర్ జనరల్స్ ఝాంగ్ యావోక్సియా, లియు ఝెన్లీలను స్టేట్ సెంట్రల్ మిలిటరీ కమిషన్ నుండి తొలగించింది. క్రమశిక్షణలో తీవ్రమైన లోపాలు, చట్ట ఉల్లంఘనలపై విచారణల అనంతరం ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ 2012లో అవినీతికి వ్యతిరేక ప్రచారాన్ని ప్రారంభించారు. అప్పట్లో దీన్ని నిపుణులు ప్రక్షాళనగా చెప్పుకొచ్చారు. ఇందులో భాగంగా పలువురు సీనియర్ అధికారులపై విచారణ జరిపి, వారిని తొలగించడం లేదా బహిష్కరించడం జరిగింది కూడా.

ఆగస్టు 26న చైనా అత్యున్నత రాజకీయ సలహా మండలి 14వ జాతీయ కమిటీ స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. జావోను తొలగించాలని అందరూ అనుకూలంగా ఓటు వేశారు. మత వ్యవహారాల కమిటీ డిప్యూటీ డైరెక్టర్ పదవి నుండి తొలగించారు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వ వార్తా సంస్థ జిన్హువా ప్రకటించింది.  2016 ఫిబ్రవరిలో చైనా వెస్ట్ ప్రాంతానికి జావో తొలి కమాండర్‌గా బాధ్యతలు చేపట్టారు. టిబెట్- జిన్‌జియాంగ్‌లలో PLA కార్యకలాపాల ను నియంత్రిస్తుంది. ఇండియాతో చైనా సరిహద్దులో అధిక భాగాన్ని జావో పరిధిలోకి వస్తుంది.

 

డోక్లాం-గాల్వాన్ ఘర్షణల సైనిక జనరల్‌పై చైనా వేటు

భూటాన్ తమదని చెప్పుకుంటూ ఆ భూభాగంలో చైనా సైనికులు రహదారిని నిర్మించడానికి ప్రయత్నించినప్పుడు 2017 జూన్‌లో డోక్లాం ప్రతిష్టంభన మొదలైంది. భారత-చైనా-భూటాన్ సరిహద్దు సమీపంలోని చుంబి లోయ దగ్గర ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. సైనిక ఘర్షణ సుమారు 72 రోజుల పాటు కొనసాగింది. ఆ తర్వాత 2020 మేలో తూర్పు లడఖ్‌లోని గాల్వాన్ లోయలో ప్రతిష్టంభన ఏర్పడినప్పుడు కూడా జావో బాధ్యతల్లో ఉన్నారు. భారత-చైనా సైనికులు రాళ్లు, కర్రలు, తాత్కాలికంగా తయారుచేసిన ఆయుధాలతో ఫైటింగ్ కు దిగారు. ఈ ఘటనలో 20 మంది భారత సైనికులు మరణించారు. చైనా సైనికులు భారీగా మరణించినట్టు తేలింది. కాకపోతే వాటికి సంబంధించి ఎలాంటి విషయాలను ఆ దేశం బయటపెట్టలేదు.

ALSO READ: ట్రంప్ సర్కార్ కొత్త కసరత్తు.. 90 శాతం భారతీయులపై ప్రభావం, హెచ్-4 ఈఏడీ వర్క్‌పై..

భారత పర్యటనకు ముందు చైనా అధ్యక్షఉడు జిన్‌పింగ్ ఒక సందేశం పంపడానికి ప్రయత్నిస్తున్నారని భావిస్తున్నారు. ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు తొలిసారిగా భారత్‌లో పర్యటించనున్నారు.  దీర్ఘకాలంగా సరిహద్దు వివాదానికి రాజకీయ పరిష్కారం దిశగా ప్రయత్నాలను కొనసాగించడానికి భారత్- చైనా అంగీకరించాయి. సరిహద్దు ప్రాంతాల్లో శాంతి-స్థిరత్వాన్ని కాపాడుకోవాల్సిన ప్రాముఖ్యతను ఇరు దేశాలు నొక్కి చెప్పాయి. ఆగస్టు 24, 25న బీజింగ్‌లో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్- చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీల మధ్య 25వ విడత చర్చల తర్వాత అడుగులు వేసింది చైనా.

Related News

ట్రంప్ సర్కార్ కొత్త కసరత్తు.. 90 శాతం భారతీయులపై ప్రభావం, హెచ్-4 ఈఏడీ వర్క్‌పై..

ప్రభుత్వాన్నే బ్లాక్‌మెయిల్ చేస్తున్న సైబర్ దొంగలు.. రూ.23 కోట్ల విలువగల బిట్‌కాయిన్స్ ఇవ్వాలని బెదిరింపులు

ఏంటీ.. నేపాల్ వరద ప్రవాహ వేగం గంటకు 200 కిమీలా? 4 వేల మీటర్ల ఎత్తు నుంచి దూకి..

ఒకవైపు నేపాల్లో వందలాది చావులు.. మరోవైపు చోరీ ఘటనలు.. అసలు మనుషులేనా వీళ్లు?

నేపాల్ ప్రకృతి విపత్తు.. 626కు చేరిన మృతులు.. 2,478 మంది ఆచూకీపై ఆందోళన!

నేపాల్‌లో వరదలు రాబోతున్నట్లు 5 నెలల ముందే తెలుసు.. మానవ తప్పిదమా? నిర్లక్ష్యమా?

మీ సాయం మాకొద్దు.. ఆ ఒక్కటీ చేయండి చాలు.. నేపాల్ స్టేట్మెంట్!

Big Stories

Advertisement
×