E-Paper
Advertisement

నేపాల్‌లో అద్భుతం.. 1,643 మంది విద్యార్థులను కాపాడిన హెడ్ మాస్టర్.. ఏం జరిగిందంటే?

నేపాల్‌లో అద్భుతం.. 1,643 మంది విద్యార్థులను కాపాడిన హెడ్ మాస్టర్.. ఏం జరిగిందంటే?
Advertisement

Nepal Floods: నేపాల్ అకస్మిక వరదల నుంచి 1500కు పైగా విద్యార్థులను రక్షించి ఓ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు రియల్ హీరోగా ప్రశంసలు అందుకుంటున్నారు. వరద కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో త్రిశూలి వ్యాలీలోని త్రిభువన్ త్రిశూలి సెకండరీ పాఠశాల కూడా ఉంది. అయితే పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజేంద్ర దావాడి (47) సమయస్ఫూర్తితో వ్యవహరించి 1,643 మంది విద్యార్థులను రక్షించారు. స్కూల్ కు ఎగువన ఉన్న గ్రామాన్ని వరద ముంచెత్తిందని తెలిసిన వెంటనే.. ఆయన పాఠశాలకు వస్తున్న అన్ని బస్సుల డ్రైవర్లకు ఫోన్ చేసి వాహనాలను వెనక్కి మళ్లించాలని ఆదేశించారు.

అంతేకాకుండా అప్పటికే పాఠశాలకు వచ్చిన విద్యార్థులను త్వరితగతిన స్కూల్ కు దూరంగా కొండపైకి తీసుకెళ్లారు. వారంతా కొండపైకి చేరుకున్న కొద్ది క్షణాల్లోనే.. రాకాసి వరద స్కూల్ మెుత్తాన్ని ముంచెత్తింది. సరిగ్గా స్కూల్ సమయంలోనే ఉవ్వెత్తున వరద ముంచెత్తినా.. ఒక్క విద్యార్థికి సైతం ఏమి కాలేదు. అయితే ఈ ఘటనలో అదనపు తరగతులు చెప్పడానికి ఉదయమే వచ్చిన సోషల్ టీచర్ సంతోష్ పరియార్ (32) వరద ఉధృతికి కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. అలాగే స్కూల్ తలుపు వేయడానికి వెనక్కి వెళ్లిన స్కూల్ అటెండర్ సుల్తాన్ లామా సైతం నీటి ప్రవాహంలో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయారు.

Advertisement

Also Read: బ్రిటిష్ ఇంజనీరింగ్ అద్భుతాలు.. దేశానికే గర్వకారణమైన 7 వింటేజ్ రైల్వే స్టేషన్లు!

Advertisement

ఇదిలా ఉంటే నేపాల్ వరదల్లో మరణించిన వారి సంఖ్య 734 కు చేరింది. మరో 2,498 మంది ఆచూకి ఇంకా తెలియరాలేదు. గల్లంతైన వారి కోసం రెస్క్యూ బృందాల గాలింపు కొనసాగిస్తూనే ఉన్నాయి. మరోవైపు ఈ దారుణ విపత్తుకు నేపాల్-టిబెట్ సరిహద్దులోని లాంగ్‌టాంగ్ లిరుంగ్ శిఖరం వద్ద చోటుచేసుకున్న ఘటనే కారణమని తెలుస్తోంది. అక్కడ సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న భారీ మంచు, కొండచరియలు విరిగి దాదాపు 1,200 మీటర్ల కిందకు పడటంతో లెండే నది ఉప్పొంగింది. నదీ ప్రవాహంతో పాటు మంచు, రాళ్లు, బురద విపరీతమైన వేగంతో కొట్టుకొచ్చి గ్రామాలు, రోడ్లు, వంతెనలు, విద్యుత్ ప్రాజెక్టులను ధ్వంసం చేశాయి.

Also Read: వర్షాకాలంలో కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్య తీవ్రం.. ఇంట్లోనే ఈ డ్రింక్స్‌తో ఉపశమనం

Tags

Related News

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కీలక నిర్ణయం.. డోక్లాం-గాల్వాన్ ఘర్షణల జనరల్‌పై వేటు, ఏం జరిగింది?

ట్రంప్ సర్కార్ కొత్త కసరత్తు.. 90 శాతం భారతీయులపై ప్రభావం, హెచ్-4 ఈఏడీ వర్క్‌పై..

ప్రభుత్వాన్నే బ్లాక్‌మెయిల్ చేస్తున్న సైబర్ దొంగలు.. రూ.23 కోట్ల విలువగల బిట్‌కాయిన్స్ ఇవ్వాలని బెదిరింపులు

ఏంటీ.. నేపాల్ వరద ప్రవాహ వేగం గంటకు 200 కిమీలా? 4 వేల మీటర్ల ఎత్తు నుంచి దూకి..

ఒకవైపు నేపాల్లో వందలాది చావులు.. మరోవైపు చోరీ ఘటనలు.. అసలు మనుషులేనా వీళ్లు?

నేపాల్ ప్రకృతి విపత్తు.. 626కు చేరిన మృతులు.. 2,478 మంది ఆచూకీపై ఆందోళన!

నేపాల్‌లో వరదలు రాబోతున్నట్లు 5 నెలల ముందే తెలుసు.. మానవ తప్పిదమా? నిర్లక్ష్యమా?

Big Stories

Advertisement
×