BigTV English
Advertisement

TikTok: ఇకపై టిక్ టాక్ లు చేసుకోవచ్చు.. ఆ దేశంలో బ్యాన్ ఎత్తేశారు

TikTok: ఇకపై టిక్ టాక్ లు చేసుకోవచ్చు.. ఆ దేశంలో బ్యాన్ ఎత్తేశారు

Nepal government lifts ban on Tiktok with certain conditions: వెయ్యి సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన దేశం నేపాల్. గౌతమ బుద్ధుడు నేపాల్ లోనే జన్మించాడు. నేపాల్ కూడా భారత్ లో అంతర్భాగంగా ఉండేది. భౌగోళికంగా భారత్, చైనా మధ్య నేపాల్ రాజ్యం విస్తరించబడింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ నేపాల్ చైనా సరిహద్దుగా ఉంది. ప్రపంచంలోనే ఏకైక హిందూ రాజ్యం ఇది. టిక్ టాక్ యాప్ ను అన్ని దేశాలలాగానే నేపాల్ లోనూ బ్యాన్ చేసింది అక్కడి ప్రభుత్వం. ఒకప్పుడు టిక్ టాక్ యాప్ తో పాపులారిటీ సంపాదించుకున్నారు చాలా మంది సెలబ్రిటీలు. భారత్ లోనూ 2019లో ఈ టిక్ టాక్ యాప్ పై కేంద్రం నిషేధాజ్ణలు జారీచేసింది.


అగ్రదేశాలలోనూ బ్యాన్

అమెరికాలాంటి అగ్రదేశాలలోనూ ఈ టిక్ టాక్ యాప్ నిషేధానికి గురయింది. తొలుత 2016లో చైనాలో డౌయిన్ పేరుతో లాంచ్ అయిన ఈ యాప్ తర్వాత ఒక్క ఏడాదిలోనే అంతర్జాతీయ మార్కెట్లో ప్రవేశించింది. టిక్ టాక్ అనే పేరుతో బాగా పాపులర్ అయింది. 2019లో ఒక్క ఇండియాలోనే 24 కోట్ల మంది టిక్ టాక్ యాప్ డౌన్ లోడ్ చేసుకున్నారంటే దీని డిమాండ్ ఏమిటో తెలుస్తుంది. అయితే ఈ యాప్ ఎక్కువగా పోర్న్ వీడియోలు కూడా ఎంకరేజ్ చేస్తోందనే కారణంతో ఈ టిక్ టాక్ యాప్ భారత్ లోనూ బ్యాన్ అయింది. అయితే నేపాల్ దేశంలోనూ తమ దేశ సామాజిక మత సామరస్యానికి విఘాతం కలిగిస్తోందనే కారణంతో టిక్ టాక్ వీడయో షేరిం్ యాప్ అయిన టిక్ టాక్ ను నిషేధించారు ఆ దేశంలో. దాదాపు పది నెలల నిషేధం తర్వాత ఈ యాప్ పై నిషేధం ఎత్తివేస్తున్నట్లు నేపాల్ కేబినెట్ మంత్రి వర్గం కీలక నిర్ణయం తీసుకుంది. నేపాల్ దేశానికి అనుగుణంగా వారి నియమనిబంధనలు పాటిస్తామని టిక్ టాక్ యాజమాన్యం నేపాల్ మంత్రిత్వ శాఖకు లిఖితపూర్వక హామీని ఇవ్వడంతో టిక్ టాక్ పై నిషేధం ఎత్తివేసింది అక్కడి ప్రభుత్వం. ప్రస్తుతం నేపాల్ దేశంలో టిక్ టాక్ యాప్ ను వాడుతున్న యూజర్లు 22 లక్షల మంది దాకా ఉంటారు.


టిక్ టాక్ వీడియోలతో ఉపాధి

టిక్ టాక్ బ్యాన్ తర్వాత చాలా మంది ఫేస్ బుక్, ఇన్ స్టా , వాట్సాప్ ల ద్వారానే కాకుండా టిక్ టాక్ ప్లేస్ లో వచ్చిన పలు యాప్ లను వాడుతున్నారు. ఏది ఏమైనా టిక్ టాక్ యాప్ ని మించింది లేదని అంటున్నారు. టిక్ టాక్ యాప్ ద్వారా వంటల వీడియోలు , స్నాక్ ల తయారీ వంటివి చేసి తన కాళ్ల మీద తాను నిలబడి ఉపాధి పొందుతున్న తనలాంటి వారెందరో టిక్ టాక్ బ్యాన్ తో ఉపాధిని కోల్పోయామని వాపోతున్నారు నేపాల్ జనం. ప్రస్తుతం టిక్ టాక్ యాప్ నిషేధంపై దేశవ్యాప్తంగా తమ సంతోషాన్ని వ్యక్తంచేస్తున్నారు పబ్లిక్. భారత్ లోనూ టిక్ టాక్ యాప్ పై నిషేధం ఎత్తివేయాలని ఇక్కడి అభిమానులు కోరుకుంటున్నారు. షరతులతో కూడిన అనుమతులు ఇస్తూ టిక్ టాక్ యాప్ ని కొనసాగిస్తే బాగుంటుందని అంటున్నారు.

 

Related News

Earthquake In Japan: జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..

Donald Trump: టారిఫ్ లను వ్యతిరేకించేవాళ్లంతా ‘మూర్ఖులు’.. అమెరికన్లకు 2 వేల డాలర్ల డివిడెండ్: డొనాల్డ్ ట్రంప్

Elon Musk: ఎలాన్ మస్క్‌కు లక్ష కోట్ల డాలర్ల ప్యాకేజీ.. ఇంత డబ్బుతో ఏం చేస్తున్నాడు?

Helicopter Crash: కళ్ల ముందే కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్.. స్పాట్‌లో 7 మంది!

United States: డయాబెటిస్‌, ఒబెసిటీ ఉంటే.. అమెరికా వీసా కష్టమే!

Crime News: 10 మంది రోగులను చంపేసిన నర్స్.. కావాలనే అలా చేశాడట, ఎందుకంటే?

Nvidia: ఎన్విడియా పై చైనా నిషేధం.. భారత్ స్టార్టప్ లకు ఇలా కలిసొస్తోంది..

New York First Lady: న్యూయార్క్ ఫస్ట్ లేడీ రామా దువ్వాజి ఎంత ఫేమస్సో తెలుసా?

Big Stories

×