BigTV English

Virus: మిస్టరీ వైరస్.. వేల సంఖ్యలో కేసులు.. రోగుల ముక్కులో నుంచి రక్తం..

Virus: మిస్టరీ వైరస్.. వేల సంఖ్యలో కేసులు..  రోగుల ముక్కులో నుంచి రక్తం..

Virus: ఓవైపు కరోనా.. మరోవైపు H3N2 వైరస్ అల్లకల్లోలం సృష్టిస్తుంటే.. ఇవి చాలవన్నట్లు మరో వైరస్ కలకలం రేపుతోంది. ఆస్ట్రేలియాలో మిస్టరీ వైరస్ పుట్టుకొచ్చింది. డేంజర్ బెల్స్ మోగిస్తోంది. వేల సంఖ్యలో జనాలు ఈ వైరస్ బారిన పడుతున్నారు. ముక్కులో నుంచి రక్తస్రావం అయి ప్రాణాలు కోల్పోతున్నారు.


ఆఫ్రికాలోని బెజీరీలో ఈ వైరస్‌ను శాస్త్రవేత్తలు గుర్తించారు. వైరస్ బారిన పడిన వారిలో తీవ్రమైన జ్వరం, తలనొప్పి, వాంతులు, ఒళ్లునొప్పులు, ముక్కులో నుంచి రక్తస్రావం అవ్వడం వంటి లక్షణాలను గమనించామని అక్కడి వైద్యులు వెల్లడించారు. ఇప్పటి వరకు ఈ మహమ్మారి బారిన పడి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. అలాగే ప్రతిరోజూ వేల సంఖ్యలో కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయన్నారు. మరణాలు కూడా వేగంగా సంభవిస్తున్నాయని చెప్పారు.

ఈక్రమంలో అప్రమత్తమైన అధికారులు బెజీరీలో క్వారంటైన్ విధించారు. జనాలు బయట తిరగకుండా ఆంక్షలు విధించారు. సరైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గత నెలలో టాన్జానియాలో మార్‌బర్గ్ కేసులు వెలుగు చూసిన విషయం తెలిసిందే. ఈక్రమంలో అదే వైరస్ మళ్లీ విజృంభిస్తోందా.. లేదా కొత్త వైరస్ పుట్టుకొచ్చిందా అనే దానిపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు.


ఇక భారత్‌లో కరోనా మళ్లీ కోరలు చాస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,016 కేసులు వెలుగు చూశాయి. దేశరాజధాని ఢిల్లీలో అత్యధికంగా 300 కేసులు వచ్చాయి. పాజిటీవ్ కేసుల సంఖ్య 40 శాతం పెరిగింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 13,508 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×