BigTV English

Pakistan Army Terrorists: ఉగ్రవాదులకు రక్షణగా పాక్ సైన్యం.. భారత్ నుంచి కాపాడడానికే

Pakistan Army Terrorists: ఉగ్రవాదులకు రక్షణగా పాక్ సైన్యం.. భారత్ నుంచి కాపాడడానికే

Pakistan Army Terrorists| భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తల ఉన్న సమయంలో సరిహద్దుల్లో ఉగ్రవాదులకు రక్షణగా పాక్ సైన్యం భద్రత కల్పిస్తోందని జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇప్పటికే ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. భారత సైన్యం, వాయు దళం, నౌకా దళం పాకిస్తాన్ పై దాడి చేసేందుకు మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నాయి. దీంతో పాకిస్తాన్ ఆర్మీ హై అలర్ట్ లో ఉంది.


ఏప్రిల్ 22, 2025న కశ్మీర్ లోని పహల్గాం లోయలో 26 మంది పర్యాటకులను ఉగ్రవాదులు దారుణంగా కాల్చి చంపారు. ఈ మారణహోమానికి ప్రతిస్పందనగా ఉగ్రవాదులకు అండగా నిలిచే పాకిస్తాన్ పై చర్యలకు భారత్ ప్రభుత్వం సిద్ధమైంది. దశాబ్దాల నుంచి వస్తున్న సింధూ నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. ఇండియాలో నివసిస్తున్న పాకిస్తాన్ పౌరులను తిరిగి పంపంచేసి.. ఇక వీసాలు జారీని రద్దు చేసింది. ఇరు దేశాల మధ్య ఉన్న అటారి వాఘా బార్డర్ ని మూసి వేసింది.

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇటీవల కేంద్ర కేబినెట్ మీటింగ్ పెట్టి పాకిస్తాన్, ఉగ్రవాదులపై చర్యలు తీసుకునేందుకు భారత సైన్యానికి, త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. దీంతో భారత సైన్యం స్పెషల్ కమాండో యూనిట్ సర్జికల్ స్ట్రైక్ కు సిద్ధమైంది. పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసేందుకు ప్రణాళికలు రెడీ చేసింది. ఇప్పటికీ సరిహద్దుల్లోని బార్డర్ పోస్టుల వద్ద భారత సైనికుల సంఖ్య పెంచినట్లు సమాచారం.


ఈ పరిణామాల మధ్య ఉగ్రవాదుల స్థావరాలపై ఇండియన్ ఆర్మీ దాడి చేసే అవకాశాలు ఉండడంతో పాకిస్తాన్ సైన్యం వారిని కాపాడేందుకు చర్యలు చేపట్టిందని సమాచారం. ఉగ్రవాద గ్రూపులను కూడా బార్డర్ చెక్ పోస్ట్ ల వద్ద పాక్ రక్షణ బలగాలతో కలిసి పనిచేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. కీలక ఉగ్రవాదులను రహస్య స్థావరాలకు తరలించనట్లు విశ్వసనీయ వర్గాల ద్వారాల తెలిసిందని జాతీయ మీడియా నివేదిక.

Also Read:  బాబ్రీ మసీదు మళ్లీ నిర్మిస్తాం.. యుద్ధ వాతావరణంలో పాక్ ఎంపీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు

సిఎన్ఎన్-న్యూస్18 కథనం ప్రకారం.. పాకిస్తాన్ ఆర్మీకి చెందిన 19 బ్రిగేడ్ పార్మెషన్లు కలిగిన 10 కార్ప్స్ యూనిట్ బలోచిస్తాన్ ప్రాంతంలోని ఫైటర్ ఉగ్రవాదులు, ఇతర టెర్రర్ గ్రూపులను భారత లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద పాక్ బార్డర్ ఫోర్స్ కు అటాచ్ మెంట్ గా తరలించింది. లష్కరె తయిబా లాంటి ఉగ్రవాద సంస్థల నాయకులైన హఫీజ్ సయీద్, మసూద్ అజ్హర్ లాంటి కీలక లీడర్లను రహస్య స్థావరాలకు తరలించడం జరిగింది. కశ్మీర్ సరిహద్దుల్లోని గురేజ్, రాజోరీ, పూంచ్ లాంటి ప్రాంతాల్లో కూడా పాక్ సైన్యంతో కలిసి ఉగ్రవాదులు పనిచేస్తున్నట్లు సమాచారం.

భారత్ తో యుద్ధం పొంచి ఉన్న కారణంగా ఇప్పటికే వేల సంఖ్యలో పాక్ సైనికులు, సీనియర్ అధికారులు రాజీనామాలు చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో పాక్ సైన్యం ఉగ్రవాదులను సరిహద్దుల వద్ద మోహరించడం గమనార్హం.

Related News

US on H 1B Visa: హెచ్‌-1బీ వీసా రుసుంపై వైట్‌హౌస్‌ క్లారిటీ.. వారికి మాత్రమే, ఇక భయం లేదు

H-1B Visas: హెచ్-1బీ వీసాల ఫీజు పెంపు.. భారత టెక్ కంపెనీల పరిస్థితి ఏమిటి? ఆ సమస్య తప్పదా?

Cyber ​​Attack: యూరప్ ఎయిర్‌పోర్టులపై సైబర్ అటాక్.. వేలాది మంది ప్రయాణికులపై ఎఫెక్ట్

US Flights Cancelled: అమెరికాలో నిలిచిపోయిన వందలాది విమానాలు.. కారణం ఇదే!

H-1B Visa: రూ. 88 లక్షలు చెల్లిస్తేనే H-1B వీసా.. ట్రంప్ నుంచి మరో షాకింగ్ నిర్ణయం

Trump H-1B Visa Policy: ట్రంప్ సంచలన నిర్ణయం.. H1B వీసాలకు లక్ష డాలర్ల ఫీజు.. ఇండియ‌న్స్‌కి జాబ్స్ క‌ష్ట‌మే!!

Russia Earthquake: రష్యాని కుదిపేసిన భూకంపం.. 7.4 గా నమోదు, ఆ తర్వాత ఇండోనేషియాలో

TikTok Deal: టిక్‌టాక్ అమెరికా సొంతం!..యువత ఫుల్ ఖుషీ అన్న ట్రంప్

Big Stories

×