BigTV English

Pakistan Terror Attack : పాకిస్తాన్ ఎయిర్‌బేస్‌పై ఉగ్ర దాడి.. మూడు యుద్ధ విమానాలు ధ్వంసం.. 3 తీవ్రవాదులు మృతి

Pakistan Terror Attack : పాకిస్తాన్‌లోని ఓ ఆర్మీ ఎయిర్‌బేస్‌పై ఉగ్రవాదులు శనివారం దాడి చేశారు. ఈ దాడితో మూడు యుద్ధ విమానాలను ధ్వంసం అయ్యాయి. పాకిస్తాన్ సైన్యం వెంటనే ఎదురుదాడి ప్రారంభించింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గరు ఉగ్రవాదులు చనిపోయారని సమాచారం.

పాకిస్తాన్ దేశంలోని పంజాబ్ ప్రాంతంలో ఉన్న మియావాలి ఎయిర్‌బేస్‌లో ఈ ఘటన జరిగింది. పాకిస్తాన్ సైన్యం తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం ఉదయం ఆరుగురు టెర్రరిస్టులు ఎయిస్‌బేస్ కాంపౌండ్ గోడపై నిచ్చెన సహాయంతో ఎక్కారు. అక్కడ ఉన్న కంచు వైర్లను కట్ చేసి లోపలికి చొరబడ్డారు. ఆ తరువాత తుపాకులు పేలుస్తూ, బాంబులు విసిరారు. దీంతో అక్కడ నిప్పు రాజుకుంది.

ఇది చూసిన పాక్ సైనికులు ఎదురుదాడి చేయగా.. ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు. మరో ముగ్గురు అదే ప్రాంతంలో దాగి ఉన్నారని తెలిసింది. వారి కోసం సైన్యం గాలిస్తోంది. ఉగ్రవాదులు చేసిన బాంబు దాడిలో ఎయిర్‌బేస్‌లోని మూడు విమానాలు దెబ్బతిన్నాయి. వాటిలో ఇంధన ట్యాంకులకు అగ్గిరాజుకోవడంతో భారీపేలుడు సంభవించిందని సమాచారం.

అయితే దాడి చేసిన టెర్రరిస్టులు ‘తహరీకె జిహాద్ పాకిస్తాన్’ అనే ఉగ్ర సంస్థకు చెందిన వారని తెలిసింది. అధికారికంగా ఈ విషయం ఆ ఉగ్రసంస్థ ధృవీకరించనప్పటికీ.. ఆ సంస్థ నాయకుడు ముల్లా ముహమ్మద్ కొన్ని రోజుల ముందే ఒక దాడి చేయబోతున్నట్లు హెచ్చరికలు చేశాడు.

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×