BigTV English
Advertisement

Blowing flying kisses : చైనా ఫ్లయింగ్ కిసెస్..ఉద్విగ్నభరితం

Blowing flying kisses  : చైనా ఫ్లయింగ్ కిసెస్..ఉద్విగ్నభరితం
Blowing flying kisses

Blowing flying kisses : ఫెర్రిస్ వీల్ అందరకీ తెలిసిందే. ఎగ్జిబిషన్‌కి వెళ్లిన పిల్లలు, పెద్దలు సహా ఎవరైనా ఈ వీల్ ఎక్కి సరదా తీర్చుకోవాలని ఉవ్విళ్లూరుతారు.ఇదే కాదు.. ఇలాంటి థ్రిల్ రైడ్స్ పట్ల మక్కువ చూపే వారి సంఖ్య తక్కువేమీ లేదు. అలాంటి సాహసికులకు చైనాలోని ‘బ్లోయింగ్ ఫ్లయింగ్ కిసెస్’ రా రమ్మని ఆహ్వానిస్తోంది.


చాంగ్‌క్వింగ్‌లో 3 వేల అడుగుల ఎత్తైన పర్వత శిఖరంపై ఈ రైడ్‌ను ఏర్పాటు చేశారు. రైడ్‌లో భాగంగా ప్రేమికుల విగ్రహాలు, వాటి కుడి చేతుల్లో అబ్జర్వేషన్ డెక్‌లు ఉంటాయి. ఎలాంటి ఆసరా, సీటు బెల్టులు లేని ఆ డెక్‌లపై రైడర్లు
నిలబడి ఉండాలి. వారికి ఇదే అతి పెద్ద సవాల్.

రైడ్ ఆరంభంలో ఆడ, మగ జంట విగ్రహాలు కిందకు వంగి రైడర్లను డెక్‌పైకి ఎక్కించుకుంటాయి.గుండ్రంగా తిరుగుతున్న డెక్‌లను, వాటిపై నిలబడిన రైడర్లను నిదానంగా పైకి లిఫ్ట్ చేస్తుంటాయి జంట విగ్రహాలు.


ఆ క్షణంలో.. అంత ఎత్తు నుంచి గుండ్రంగా తిరుగుతూ ప్రకృతి అందాలను, ఆకాశాన్ని వీక్షించే రైడర్లకు ఊపిరాడనంత ఉద్విగ్నాని కి లోనుకావడం ఖాయం. సీట్లు, సీటుబెల్టులు లేనందున వారు తమను తాము ఆ డెక్‌పై బ్యాలెన్స్
చేసుకుంటుండాలి. అదుపు తప్పారో.. అంతే సంగతులు.

రైడ్ పీక్ దశలో చుంబనాల కోసమా అన్నట్టు ఆ విగ్రహాలు అభిముఖంగా వచ్చిన సమయంలో డెక్‌లు రెండూ
పక్కపక్కకు వచ్చి చేరతాయి. చైనాలో ఓ పురాణ ప్రేమగాథ ఫ్రేరణగా ఈ బ్లోయంగ్ ఫ్లయింగ్ కిసెస్ రైడ్‌కు రూపకల్పన చేశారు.

సేఫ్టీపరంగా పకడ్బందీ ఏర్పాట్లు అంతగా లేని ఈ థ్రిల్ రైడ్ అవసరమా అని కొందరు మండిపడుతుంటే.. మరి కొందరు
మత్రం ఆ మజాయే వేరు అంటున్నారు. ‘బ్లోయింగ్ ఫ్లయింగ్ కిసెస్’ కోసం తెగ పోటీపడుతున్నారు.

Related News

Philippines: ఫిలిప్పీన్స్‌ను వణికిస్తున్న ఫంగ్-వాంగ్‌ తుపాను.. స్పాట్‌లో 20 మంది

Earthquake In Japan: జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..

Donald Trump: టారిఫ్ లను వ్యతిరేకించేవాళ్లంతా ‘మూర్ఖులు’.. అమెరికన్లకు 2 వేల డాలర్ల డివిడెండ్: డొనాల్డ్ ట్రంప్

Elon Musk: ఎలాన్ మస్క్‌కు లక్ష కోట్ల డాలర్ల ప్యాకేజీ.. ఇంత డబ్బుతో ఏం చేస్తున్నాడు?

Helicopter Crash: కళ్ల ముందే కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్.. స్పాట్‌లో 7 మంది!

United States: డయాబెటిస్‌, ఒబెసిటీ ఉంటే.. అమెరికా వీసా కష్టమే!

Crime News: 10 మంది రోగులను చంపేసిన నర్స్.. కావాలనే అలా చేశాడట, ఎందుకంటే?

Nvidia: ఎన్విడియా పై చైనా నిషేధం.. భారత్ స్టార్టప్ లకు ఇలా కలిసొస్తోంది..

Big Stories

×