E-Paper
Advertisement

Flight Accident Video: హైవేపై కారు మీద ల్యాండైన విమానం.. విన్యాసం కాదు, ఘోర ప్రమాదం

Flight Accident Video: హైవేపై కారు మీద ల్యాండైన విమానం.. విన్యాసం కాదు, ఘోర ప్రమాదం
Advertisement

Florida News: జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న కారుని వెనుక నుంచి ఓ విమానం ఢీ కొట్టింది. ఈ ఘటన అమెరికాలోని ఫ్లోరిడా ప్రాంతంలో చోటు చేసుకొంది. వేగాన్ని అదుపు చేసుకోలేక కారును ఢీ కొన్నట్లు స్థానిక అధికారులు చెబుతున్నారు. ఘటన గురించి తెలియగానే ఎమర్జెన్సీ టీమ్స్ అక్కడికి చేరుకున్నాయి. అసలేం జరిగింది? దీనికి సంబంధించి వీడియో వైరల్ అయ్యింది.

అమెరికాలో ఘోర ప్రమాదం

Advertisement

Advertisement

అమెరికా కాలమాన ప్రకారం.. సోమవారం రాత్రి ఫ్లోరిడాలోని బ్రెవార్డ్ కౌంటీలోని ఇంటర్ స్టేట్ 95లో ఓ విమానం అత్యవసర ల్యాండింగ్‌కు ప్రయత్నించింది. అందులో సాంకేతిక కారణాలు ఏంటో తెలీదు. అప్పటికే వేగంగా వస్తున్న విమానం, హైవేపై వెళ్తున్న కారుని వెనుక భాగం నుంచి బలంగా ఢీ కొట్టింది. కారులోని 57 ఏళ్ల మహిళా డ్రైవర్‌‌కు గాయాలు అయ్యాయి.

వెంటనే ఆమెని ఆ ప్రాంత పోలీసులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స తీసుకుంటోంది. ప్రమాదం సమయంలో విమానంలో పైలట్‌, మరొక ప్రయాణికుడు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వీరిద్దరు సురక్షితంగా బయటపడినట్లు తెలిపారు.

ఫ్లోరిడా హైవేలో కారుని ఢీ కొట్టిన విమానం

అయితే విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు గల కారణాలపై లోతుగా దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ ఘటన కారణంగా ఆ ప్రాంతంలో వెళ్లే వాహనాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. హెలికాప్టర్‌ను పక్కకు పెట్టింది. కారుని తొలగించి, ట్రాఫిక్‌ని క్లియర్ చేశారు అధికారులు.  ఈ ఘటనకు సంబంధించి అదే రూట్లో కారులో వస్తున్న ఓ వ్యక్తి, తన ఫోన్ లో చిత్రీకరించాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. 

 

Related News

ఆఫ్రికా పెరిగింది, అమెరికా అలిగింది.. కొత్త ప్రపంచ పటానికి UN ఆమోదం

నేపాల్‌పై ప్రకృతి కన్నెర్ర.. భారీగా విరిగిన కొండచరియలు, నది ప్రవాహానికి అంతరాయం

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

Big Stories

Advertisement
×