E-Paper
Advertisement

Brazil Plane Crash: పర్యాటకుల కళ్లముందే విషాదం.. సముద్రంలో కూలిన విమానం.. స్పాట్‌లో!

Brazil Plane Crash: పర్యాటకుల కళ్లముందే విషాదం.. సముద్రంలో కూలిన విమానం.. స్పాట్‌లో!
Advertisement

Brazil Plane Crash: బ్రెజిల్‌లోని సుందరమైన కోపకబానా తీరం శనివారం ఒక ఘోర ప్రమాదానికి వేదికైంది. వినీలాకాశంలో ప్రకటనల బ్యానర్‌ను ప్రదర్శిస్తూ విన్యాసం చేస్తున్న ఒక చిన్నపాటి అల్ట్రా-లైట్ విమానం (Cessna 170A) అదుపుతప్పి సముద్ర గర్భంలోకి దూసుకెళ్లింది. మధ్యాహ్నం వేళ పర్యాటకులతో సందడిగా ఉన్న బీచ్‌లో, ఒక్కసారిగా విమానం ముక్కునెలక మునిగిపోవడాన్ని చూసి అక్కడి వారు తీవ్ర భయాందోళనలకు లోనయ్యారు. ఈ దుర్ఘటనలో విమానాన్ని నడుపుతున్న పైలట్ ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరం.

అంతేకాకుండా ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక అగ్నిమాపక దళం, రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగాయి. జెట్ స్కీలు, రబ్బరు పడవలు, అనుభవజ్ఞులైన డైవర్ల సాయంతో సముద్రంలో గాలింపు చేపట్టారు. నీటి అడుగున ఉన్న శకలాలను వెతకడానికి ఆధునిక సోనార్ సాంకేతికతను వినియోగించారు. ఎంతో శ్రమించి పైలట్ మృతదేహాన్ని వెలికితీసిన భద్రతా బలగాలు, పోస్ట్‌మార్టం, గుర్తింపు ప్రక్రియ కోసం ఆసుపత్రికి తరలించాయి. కొత్త సంవత్సరం వేడుకల కోసం భారీగా తరలివచ్చిన పర్యాటకులు ఈ ఘటనతో షాక్‌కు గురయ్యారు.

Advertisement

Also Read: టెన్షన్ టెన్షన్.. కర్రెగుట్టల్లో భారీగా బయటపడుతున్న IED బాంబులు

అయితే దర్యాప్తు ప్రారంభించిన వైమానిక దళం ఈ ఊహించని ప్రమాదానికి గల కారణాలను విశ్లేషించడానికి బ్రెజిలియన్ వైమానిక దళం రంగంలోకి దిగింది. సాంకేతిక లోపమా లేక వాతావరణ పరిస్థితుల వల్ల ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. విమాన శకలాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న దర్యాప్తు బృందాలు, ప్రమాదానికి గల ప్రాథమిక కారణాలను త్వరలోనే వెల్లడించనున్నారు.

Advertisement

Related News

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

సముద్రంలో పెను విషాదం.. రోహింగ్యా శరణార్థుల పడవలు బోల్తా.. 500 మందికి పైగా మృతి!

బీచ్‌లో గుండె గుభేల్.. నడినెత్తి మీద నుంచి దూసుకెళ్లిన యుద్ధ విమానాలు.. గాల్లోకి ఎగిరిన టెంట్లు!

Big Stories

Advertisement
×