E-Paper
Advertisement

PM Modi Talks Iran President: వార్ మొదలైన తర్వాత రెండోసారి.. ఇరాన్ అధ్యక్షుడికి ప్రధాని మోదీ ఫోన్

PM Modi Talks Iran  President: వార్ మొదలైన తర్వాత రెండోసారి.. ఇరాన్ అధ్యక్షుడికి ప్రధాని మోదీ ఫోన్
Advertisement

PM Modi Talks Iran President: బ్రిక్స్‌ కూటమికి సారథ్యం వహిస్తున్న భారత్‌, ఆ హోదాలో ఇరాన్‌పై దురాక్రమణల్ని అడ్డుకునేలా చర్యలు చేపట్టాలని ప్రధాని నరేంద్రమోదీని ఆ దేశ అధ్యక్షుడు మసౌద్‌ పెజెష్కియాన్‌ కోరారు. పశ్చిమాసియా దేశాలు ఓ ప్రాంతీయ భద్రత వ్యవస్థగా ఏర్పడాలని ఈ సందర్భంగా ప్రతిపాదించారు. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్‌తో శనివారం ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడారు.

ఇరాన్ అధ్యక్షుడు  పెజెష్కియాన్‌తో  ప్రధాని మోదీ ఫోన్

Advertisement

ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం మొదలైన తర్వాత ఇరాన్ అధ్యక్షుడు మసౌద్‌ పెజెష్కియాన్‌‌తో ప్రధాని నరేంద్రమోదీ రెండోసారి మాట్లాడారు. పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు నేపథ్యంలో ఇరువురు నేతలు ఫోన్‌లో మాట్లాడారు.ఇరాన్ ప్రజలకు ప్రధాని నరేంద్రమోదీ పర్షియన్ నూతన సంవత్సరం పండుగల సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.

ప్రాంతీయ భద్రత, స్థిరత్వం వంటి అంశాలపై చర్చించుకున్నారు. అణ్వాయుధాలు సమీకరించుకోకుండా అడ్డుకునేందుకే తమపై సైనిక దాడికి దిగినట్లు అమెరికా చెప్పడాన్ని ఇరాన్ అధ్యక్షుడు తప్పుబట్టారు. సుప్రీంనేత ఖమేనీ ఆయుధాలను తీవ్రంగా వ్యతిరేకించారని గుర్తు చేశారు. వాటి అభివృద్ధికి ఎలాంటి ముందడుగు వేయకూడదంటూ డిసైడ్ అయ్యారని గుర్తు చేశారు.

Advertisement

దాడులు.. నౌకా రవాణా గురించి ఇరువురు నేతలు చర్చ

కేవలం పాలనపరమైన, మతపరమైన ఆదేశాలు జారీ చేశారని చెప్పినట్లు టెహ్రాన్‌లో విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. అటు ప్రధాని మోదీ, ఇరాన్‌లో నివాసం ఉన్న భారతీయ పౌరుల భద్రత, సంక్షేమానికి అక్కడి ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి ప్రధాని మోదీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

పశ్చిమాసియాలో మౌలిక సదుపాయాలపై జరుగుతున్న దాడులను ఖండించారు. ఇలాంటివి ప్రాంతీయ స్థిరత్వానికే కాకుండా, ప్రపంచ సరఫరా గొలుసులకు తీవ్ర అంతరాయం కలిగిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ వాణిజ్యానికి జీవనాడి హర్మూజ్ జలసంధి ద్వారా నౌకా వాణిజ్యానికి ఎలాంటి ఆటంకం కలగకూడదని స్పష్టం చేశారు.

ALSO READ: ట్రంప్ సంచలన నిర్ణయం.. తీరనున్న చమురు కష్టాలు

హర్మూజ్ జలసంధి మార్గాలు ఎల్లప్పుడూ తెరిచి ఉండాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. మార్చి 12న తొలి ఫోన్ సంభాషణలో ప్రధాని మోదీ పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, విధ్వంసంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో మరొక నౌక హార్మూజ్ జలసంధి నుంచి ఇండియాకు బయలుదేరింది.

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×