BigTV English

Pope Francis : విషమంగా పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్యం – చివరిగా ఆయనేమన్నారంటే.?

Pope Francis : విషమంగా పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్యం – చివరిగా ఆయనేమన్నారంటే.?

Pope Francis : తీవ్రమైన నిమోనియాతో బాధపడుతున్న పోప్ ఫ్రాన్సిస్ తాను ఈ యుద్ధలో గెలువలేకపోవచ్చంటూ వ్యాఖ్యానించారు. తాను చివరి దశలో ఉన్నానంటూ తన సహాయకులకు తెలిపిన పోప్.. తన తర్వాత ఆ బాధ్యతల్ని స్వీకరించేందుకు వారసుడి ఎంపిక సన్నాహాలు చేయాల్సిందిగా ఆదేశించారు. 88 ఏళ్ల పోప్‌ను గతవారం తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో ఆసుపత్రికి తరలించారు. ఆయనకు అన్ని రకాల వైద్య పరీక్షలు చేసిన వైద్యులు.. రెండు ఊపిరితిత్తులలో న్యుమోనియా ఉన్నట్లుగా నిర్ధారించారు. డబుల్ న్యుమోనియా అనేది తీవ్రమైన ఇన్ఫెక్షన్ అని, దీని కారణంగా రెండు ఊపిరితిత్తులు వాపునకు గురవుతాయని తెలుపుతున్నారు. ఈ వాపు కారణంగా శ్వాస తీసుకోవడం మరింత కష్టమవుతుందని అంటున్నారు.


ప్రస్తుతానికి పోప్ ఆరోగ్యం నిలకడగానే ఉందంటూ వాటికన్ నుంచి ప్రకటన విడుదలైంది. పోప్ ప్రశాంతంగా నిద్రపోయారని, తెల్లవారుజామున లేచి, అల్పాహారం సైతం తీసుకున్నారని తెలిపారు. కానీ.. ఆయన పూర్తిస్థాయిలో కోలుకుని, పోప్ బాధ్యతల్ని నెరవేర్చలేరనే ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం పోప్ తన చివరి దశలో ఉన్నానని, త్వరగా తన వారసుడిని ప్రకటించాలని కోరుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

పోప్ ఫ్రాన్సిస్, రోమన్ కాథలిక్ చర్చికి 266వ పోప్. అతని అసలు పేరు జార్జ్ మారియో బెర్గోగ్లియో. 1936 డిసెంబర్ 17న అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్‌లో జన్మించారు. ఇతను కాథలిక్ క్రిస్టియన్లకు మతగురువుగా వ్యవహరించే పోప్ బాధ్యతల్ని 2013 మార్చి 13న స్వీకరించారు. అంతకు ముందు పోప్ బెనెడిక్ట్ XVI రాజీనామా చేయడంతో ఈ బాధ్యతల్ని స్వీకరించిన పోప్ ప్రాన్సిస్ అమెరికా నుంచి ఎంపికైన మొదటి పోప్, మొదటి జెస్యూట్ పోప్, ఫ్రాన్సిస్ అనే పేరును తీసుకున్న మొదటి వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఇతను క్రిస్టియన్లకు ఆథ్యాత్మిక కేంద్రమైన వాటికన్ నుంచి క్రిస్టియారిటీ కోసం పనిచేస్తుంటారు.


పోప్ న్యుమోనియాతో పాటు ఆస్తమా బ్రోన్కైటిస్‌తో కూడా బాధపడుతున్నారు. దీంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడతారు. దాంతో.. కార్టిసోన్, యాంటీబయాటిక్స్ రెగ్యులర్గా తీసుకుంటున్నారు. ఈ దశలో ఆసుపత్రిలో చేరిన పోప్..తాను తిరిగి కోలుకోలేనని తెలపడంతో.. మొత్తం క్యాథలిక్ క్రిస్టియన్ సమాజం ఆయన కోసం ప్రార్థనలు చేస్తున్నారు. తమ మతగురువు ఆరోగ్యంగా బయటకు రావాలని కోరుతున్నారు.

పోప్ ప్రాన్సిస్ శ్వాసకోశ ఇన్ఫెక్షన్ వైరస్‌లు, బ్యాక్టీరియా దాడి కారణంగా ఆసుపత్రికి చేరినట్లుగా తెలుపగా, అతను కోలుకోవడం ప్రస్తుత పరిస్థితుల్లో క్లిష్టతరమే అంటున్నారు. ముఖ్యంగా బ్రోన్కైటిస్ న్యుమోనియాకు గురైన కారణంగా.. వైద్య పరిస్థితులు క్షీణిస్తున్నట్లు తెలుపుతున్నారు. బ్రోన్కైటిస్‌తో వారం రోజుల పాటు ఇబ్బంది పడిన తర్వాత పోప్ ఆసుపత్రిలో చేరినట్లుగా తెలిపిన సహాయకులు.. ఆయన రోమ్‌లోని జెమెల్లి ఆసుపత్రిలో చేరినట్లు నిర్థరించారు. ప్రారంభంలో ఆయన పరిస్థితి మంచిగా ఉన్నప్పటికీ, తాజా స్కానింగులు ద్వారా రెండు ఊపిరితిత్తులల్లో న్యుమోనియా వ్యాప్తిని గుర్తించారని, దాంతో.. ఐసీయూ విభాగానికి తరలించి వైద్యం అందించాల్సి వస్తుందని వెల్లడించారు.

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×