E-Paper
Advertisement

Portugal Prime Minister: పోర్చుగల్ ప్రధాని రాజీనామా.. ఆ ఆరోపణలే కారణమా?

Portugal Prime Minister: పోర్చుగల్ ప్రధాని రాజీనామా.. ఆ ఆరోపణలే కారణమా?
Advertisement

Portugal Prime Minister Antonio Costa Resignation: అవినీతి ఆరోపణలపై పోర్చుగల్‌ ప్రధానమంత్రి ఆంటోనియో కోస్టా గతేడాది నవంబర్ 7న రాజీనామా చేశారు. గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్రాజెక్టు, లిథియం గనుల కుంభకోణాలకు సంబంధించి ఆయన ఇంటిపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భాగంగా పోలీసులు కోస్టా ముఖ్య సలహాదారుడిని అరెస్టు చేశారు. అవినీతి కేసులో కోస్టాపై దర్యాప్తు జరుగుతోంది.

Read More: మోదీ దెబ్బకు.. దివాళా తీసి IMF ముందు చేతులు చాచిన మాల్దీవ్స్..

Advertisement

ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో ఆంటోనియో కోస్టా తన ప్రధాని పదవికి రాజీనామా చేశారు. అయితే తాను ఎలాంటి అవినీతి, అక్రమాలకు పాల్పడలేదని కోస్టా స్పష్టం చేశారు. దర్యాప్తులో ఎలాంటి ఆరోపణలు రుజువు కానప్పటికీ తాను మళ్లీ ప్రధాని పదవి చేపట్టనని తేల్చి చెప్పారు. ఆంటోనియో కోస్టా రాజీనామాను ఆమోదించిన తర్వాత పార్లమెంటును రద్దు చేసే ప్రక్రియ ప్రారంభమైందని పోర్చుగల్ అధ్యక్షుడు మార్సెలో రెబెలో తెలిపారు. దేశంలో మ‌రోసారి ఎన్నిక‌ల షెడ్యూల్ ఇంకా ప్ర‌క‌టించ‌లేద‌న్నారు.

అయితే సోషలిస్టులు మరో నేత నేతృత్వంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. కోస్టా ఆధ్వర్యంలో పోర్చుగల్ వేగవంతమైన ఆర్థిక వృద్ధిని చవిచూసింది. పర్యాటక రంగం అభివృద్ధి చెందింది. పెట్టుబడిదారులకు కోస్టా ఆధ్వర్యంలో పోర్చుగల్ గమ్యస్థానంగా మారింది.

Tags

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×