BigTV English

NRI Family Murder : అమెరికాలో భారత కుటుంబం మృతి కేసు.. పోస్టుమార్టం రిపోర్ట్‌లో ఏముంది?

America: అమెరికా లో భారత సంతతికి చెందిన సంపన్న కుటుంబం అనుమానాస్పద రీతిలో మృతి చెందడంపై దర్యాప్తులో కీలక అంశాలు వెలుగుచూశాయి. మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయింది. పోస్టుమార్టం నివేదిక ప్రకారం రాకేష్ కమల్ తన భార్య, కుమార్తెలను తుపాకీతో కాల్చి చంపాడు. వారు మరణించిన అనంతరం అతడు బలవన్మరణానికి పాల్పడినట్లు ప్రాథమికంగా వెల్లడైంది .

NRI Family Murder : అమెరికాలో భారత కుటుంబం మృతి కేసు.. పోస్టుమార్టం రిపోర్ట్‌లో ఏముంది?

NRI Family Murder : అమెరికాలో భారత సంతతికి చెందిన ఓ సంపన్న కుటుంబం అనుమానాస్పద రీతిలో మృతి చెందడంపై స్దానిక పోలీసులు దర్యాప్తు చేశారు.


ఈ దర్యాప్తులో కీలక అంశాలు వెలుగుచూశాయి. మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయింది. పోస్టుమార్టం నివేదిక ప్రకారం రాకేష్ కమల్ తన భార్య, కుమార్తెలను తుపాకీతో కాల్చి చంపాడు. వారు మరణించిన అనంతరం అతడు బలవన్మరణానికి పాల్పడినట్లు ప్రాథమికంగా వెల్లడైంది . ఈ విషయాన్ని నార్ఫోక్ డిస్ట్రిక్ట్ అటార్నీ మైఖేల్ మోరిస్సే కార్యాలయం వెల్లడించింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తిస్థాయి నివేదిక త్వరలో వస్తుందని పోలీసులు ప్రకటించారు.

కొన్నిరోజులు క్రితం మసాచుసెట్స్‌ రాష్ట్రంలో భారత సంతతికి చెందిన సంపన్న కుటుంబం వారి నివాసంలో అనుమానాస్పద రీతిలో మృతి చెందడం సంచలనగా మారింది. బంధువులు వారికి ఎన్నిసార్లు కాల్ చేసిన స్పందించకపోవడంతో అనుమానం వచ్చింది. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వారి ఇంటి వద్దకు వెళ్ళి చూడగా రాకేశ్‌ కమల్‌(57), ఆయన భార్య టీనా(54), కుమార్తె అరియానా(18) అనుమానస్పద రీతిలో మృతి చెంది ఉన్నారు. వీరు మృతిపై పోలీసులు‌కు అనుమానం వచ్చింది.


రాకేశ్‌ కమల్‌ దంపతులు విద్యారంగానికి చెందిన ఎడ్యునోవా అనే ఓ ట్రస్టును 2016లో ప్రారంభించారు. అయితే ట్రస్టు కార్యకలపాలు 2021లో నిలిచిపోయాయి. ఎడ్యునోవా వెబ్‌సైట్‌ ప్రకారం రాకేశ్‌ కమల్ బోస్టన్‌ యూనివర్సీటి, ఎంఐటీ సోలన్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌, స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయాల నుంచి డిగ్రీలు పొందారు. రాకేశ్‌కు విద్యారంగంలో విశేష అనుభవం ఉంది. హార్వర్డ్‌ యూనివర్సిటీలో టీనా విద్యను అభ్యసించింది. కొన్నాళ్ళు పాటు టీనా రెడ్‌క్రాస్‌ ఛారిటీ బోర్డులో పని చేసింది. చదువులో అరియానా చురుకైన విద్యార్థి అని.. ఆమె మృతి చెందడం తనకు ఎంతో బాధ కలిగిందని యూనివర్సిటీ ప్రోఫెసర్ తెలిపారు.

Tags

Related News

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

New Bride Incident: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!

Tamilnadu Crime: రాజకీయ నేత ఫామ్‌హౌస్.. ఎస్ఐని చంపేశారు, ఏం జరిగింది?

Karimnagar Crime: యూట్యూబ్ చూసి డైరెక్షన్ ఇచ్చింది.. పనంతా ప్రియుడు చేశాడు, చివరకు ఏమైంది?

Big Stories

×