Minor Girl Molested: దేశంలో మహిళలపై అత్యాచారాలు, దాడులు నిత్యకృత్యంగా మారాయి. ప్రతి రోజు ఓ ఆడబిడ్డకు అన్యాయం జరిగిందని వార్తల్లో వస్తుంది. ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరిస్తున్నా.. మృగాళ్ల ప్రవర్తనలో మార్పు రావడం లేదు. అన్న, బాబాయ్, తండ్రి ఇలా ఎవరినీ నమ్మే పరిస్థితులు లేవు. ఏపీలో ఇలాంటి ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది.
విజయవాడలో వరసకు బాబాయ్ అయిన వ్యక్తి 12 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో విజయవాడలో కలకలం రేపుతుంది. ఆరేళ్ల క్రితం బాలిక తల్లిదండ్రులు మృతి చెందడంతో పిన్ని, బాబాయ్ వద్దే ఉంటుంది. వారినే తల్లిదండ్రులుగా భావించిన చిన్నారికి అనుకోని అనుభవం ఎదురైంది. తండ్రిలా ఆదుకుంటాడనుకున్న బాబాయ్ కి.. కామంతో కళ్లు మూసుకుపోయాయి.
ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికను బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడు బాబాయ్. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించడంతో బాలిక ఎవరికి చెప్పలేదు. ఇటీవల బాలికకు తీవ్ర అనారోగ్యం చేయడంతో ఆస్పత్రికి తరలించారు. చిన్నారిని గమనించిన వైద్యులు పరీక్షలు నిర్వహించారు. బాలిక గర్భం దాల్చినట్లు నిర్ధారించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ధైర్యం చెప్పడంతో బాబాయ్ అకృత్యాన్ని బాలిక బయటపెట్టింది.
బాలిక ఫిర్యాదుతో నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
చిత్తూరు జిల్లా మూరకంబట్టు సమీపంలోని నగరవనంలో ప్రేమికులు, సామాన్య ప్రజలు సేద తీరుతుంటారు. వారాంతంలో వీరి తాకిడి ఎక్కువ ఉంటుంది. ఈ క్రమంలో గత శనివారం ఓ ప్రేమికుల జంట కూర్చొని మాట్లాడుకుంటుండగా హేమంత్, మహేష్, కిషోర్ అనే ముగ్గురు యువకులు అటవీ సిబ్బందిగా పరిచయం చేసుకొని ఆ ప్రేమ జంటను వీడియోలు, ఫోటోలు తీసి బెదిరించారు.
ఆ ముగ్గురిలో ఒకరు.. ఆ అబ్బాయిని మా మేడర్ పిలుచుకురమ్మారని చెప్పి దూరంగా తీసుకెళ్లాడు. దీంతో మరో ఇద్దరు ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ అమ్మాయి కేకలు వేయగా ఒకడు నోరు నొక్కి పట్టుకోగా, మరొకడు అత్యాచారం చేశాడు. ఇలా ముగ్గురు యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ విషయం యువతి బంధువులకు తెలిసి ముగ్గురు కామాంధులను గుర్తించి దేహశుద్ధి చేశారు. వారిలో ఒకడు తప్పించుకొని పారిపోయాడు. మిగిలిన ఇద్దరిని బాధితురాలి బంధువులు చిత్తూరు పోలీసులకు అప్పగించారు .
Also Read: Love Tragedy: ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదని.. రైలు కింద పడి లవర్స్ సూసైడ్
నిందితులపై కేసు పెట్టకుండా ఓ రాజకీయ నాయకుడు బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో బాధితురాలి తల్లిదండ్రులు కేసు నమోదు చేసేందుకు వెనుకాడుతున్నారని సమాచారం.