BigTV English

Qatar Death Sentence | నేవి అధికారులకు ఉరిశిక్ష తీర్పుపై ఖతర్ కోర్టులో అప్పీలు చేసిన భారత్

Qatar Death Sentence | భారతదేశ మాజీ నేవీ అధికారులకు ఖతర్ దేశ కోర్టు అక్టోబర్ 26న ఉరిశిక్ష విధించింది. ఈ కేసులో భారత ప్రభుత్వం ఖతర్ కోర్టులో ఉరిశిక్ష తీర్పపై గురువారం అప్పీలు చేసింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ 8 మంది భారత మాజీ నేవీ అధికారులకు ఉరిశిక్ష కేసులో భారత ప్రభుత్వం ఖతర్ కోర్టులో అప్పీలు చేసిందని తెలిపారు.

ఖతర దేశ న్యాయశాఖ అధికారులతో ఈ కేసు విషయంలో సంప్రదింపులు చేస్తున్నామని చెప్పారు. ఖతర్ దేశ మిలిటరీ రహస్యాలతో ముడిపడి ఉన్న కేసు గనుక ఖతర్ కోర్టు మరిన్ని వివరాలు వెల్లడించకూడదని ఆదేశించిందని అన్నారు. ఈ కేసు వివరాలు కేవలం ఖతర్ న్యాయశాఖ అధికారులతో మాత్రమే చర్చించాలని కోర్టు కఠిన నిబంధనలు విధించిందని పేర్కొన్నారు.

భారత మాజీ నేవీ అధికారులు 8 మందిని గత సంవత్సరం ఆగస్టులో ఖతర్ ప్రభుత్వం అరెస్టు చేసింది. అప్పటి నుంచి వారిపై ఖతర్ కోర్టులో విచారణ సాగుతోంది. ఎన్నోసార్టు బెయిలు కోరినా కోర్టు తిరస్కరించింది. ఈ 8 మంది అధికారులు ‘అల్ దెహరా’ అనే నేవీ ఉపకారణాలు తయారు చేసే సంస్థలో ఉన్నత పదువులలో పనిచేస్తున్నారు. అయితే ఆ సంస్థ ద్వారా వీరంతా ఖతర్ మిలిటరీ రహస్యాలు దొంగిలిస్తున్నారని ఆరోపణలున్నాయి. పూర్తి వివరాలు వెల్లడించకపోయినా.. ఈ అధికారులంతా ఇజ్రాయెల్ కోసం గూఢాచర్యం చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారని సమాచారం.

మరోవైపు ఈ 8 మంది భారత అధికారులను వెంటనే విడిపించాలని వారి కుటుంబాలు మోదీ ప్రభుత్వానికి ఎన్నో సార్లు వేడుకున్నాయి. భారత విదేశాంగ మంత్రి జై శంకర్.. ఖతర్ జైలులో ఖైదీలుగా ఉన్న అధికారుల కుటుంబాలను పరామర్శించారు. వారందరినీ విడిపించడానికి న్యాయపరమైన అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×