E-Paper
Advertisement

Saudi Arabia UAE Conflict: సౌదీ దెబ్బకు దిగొచ్చిన యూఏఈ.. యెమెన్ నుంచి బలగాల ఉపసంహరణ!

Saudi Arabia UAE Conflict: సౌదీ దెబ్బకు దిగొచ్చిన యూఏఈ.. యెమెన్ నుంచి బలగాల ఉపసంహరణ!
Advertisement

Saudi Arabia UAE Conflict: గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. యెమెన్ యుద్ధంలో ఇన్నాళ్లు మిత్రపక్షాలుగా ఉన్న ఈ రెండు దేశాల మధ్య ‘ఆయుధాల రవాణా’ చిచ్చు రేపింది. సౌదీ అరేబియా హెచ్చరికలతో యూఏఈ తన బలగాలను యెమెన్ నుంచి వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది.

యెమెన్‌లోని ముకల్లా (Mukalla) నౌకాశ్రయంపై మంగళవారం సౌదీ అరేబియా వైమానిక దాడులు చేసింది. యూఏఈ నుంచి వచ్చిన ఒక నౌక ద్వారా యెమెన్‌లోని వేర్పాటువాద సంస్థ ‘సదరన్ ట్రాన్సిషనల్ కౌన్సిల్’ (STC)కు ఆయుధాలు, సాయుధ వాహనాలు సరఫరా అవుతున్నాయన్న సమాచారంతో ఈ దాడులు చేసినట్లు సౌదీ ప్రకటించింది. అంతేకాకుండా, 24 గంటల్లోగా యూఏఈ తమ బలగాలను యెమెన్ నుంచి ఉపసంహరించుకోవాలని యెమెన్ ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసింది.

Advertisement

దక్షిణ యెమెన్‌ను ప్రత్యేక దేశంగా మార్చాలని STC కోరుతుండగా, దానికి యూఏఈ మద్దతు ఇస్తోంది. అయితే, యెమెన్ సమైక్యంగా ఉండాలని సౌదీ కోరుకుంటోంది. ఇటీవల STC వేర్పాటువాదులు సౌదీ సరిహద్దులకు దగ్గరగా ఉన్న ప్రాంతాలను ఆక్రమించుకోవడం తమ జాతీయ భద్రతకు ‘రెడ్ లైన్’ (Red Line) అని సౌదీ హెచ్చరించింది. మిత్రదేశమైనా సరే ఉపేక్షించేది లేదని స్పష్టం చేసింది.

తాము యెమెన్ నుంచి తమ మిగిలిన బలగాలను వెనక్కి తీసుకుంటున్నట్లు యూఏఈ రక్షణ శాఖ కీలక ప్రకటన చేసింది. అయితే, ఆ నౌకలో ఆయుధాలు లేవని, తమ సైన్యం కోసమే వాహనాలు పంపామని వివరణ ఇచ్చింది. సౌదీ భద్రతకు తాము కట్టుబడి ఉన్నామని పేర్కొంటూ ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నం చేసింది.

Advertisement

Read Also: iPhone Scam: ఆన్‌లైన్‌లో కొత్త ఐఫోన్ కొంటే పాత ఫోన్ డెలివరీ.. ఎలా గుర్తుపట్టాలంటే

Related News

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

సముద్రంలో పెను విషాదం.. రోహింగ్యా శరణార్థుల పడవలు బోల్తా.. 500 మందికి పైగా మృతి!

బీచ్‌లో గుండె గుభేల్.. నడినెత్తి మీద నుంచి దూసుకెళ్లిన యుద్ధ విమానాలు.. గాల్లోకి ఎగిరిన టెంట్లు!

Big Stories

Advertisement
×