E-Paper
Advertisement

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం
Advertisement

America: అమెరికాలో చీటికి మాటికీ కాల్పుల ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. తాజాగా ఇదాహోలోని ఓ హోటల్‌లో జరిగిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. అసలు కాల్పుల ఘటన ఎలా జరిగింది? దీని వెనుక ఎవరున్నారు? అనే విషయాలను ఓసారి చూద్దాం.

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం

పశ్చిమ అమెరికాలోని ఇడాహో లో ఓ రెస్టారెంట్‌లో గుర్తు తెలియని దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో స్పాట్‌లో ముగ్గురు మృత్యువాత పడ్డారు. మరో ఇద్దరు గాయపడినట్టు అధికారులు చెబుతున్నారు. నిందితుడు కూడా మరణించాడని అక్కడి అధికారులు చెబుతున్నారు. ట్విన్ ఫాల్స్ సిటీలోని ‘ఇన్-ఎన్-అవుట్’ రెస్టారెంట్ ఈ దారుణం చోటు చేసుకుంది. అమెరికా కాలమానం ప్రకారం.. శనివారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో రెస్టారెంట్ లోపల కాల్పులు జరిగినట్టు అధికారుల మాట.

Advertisement

ఘటన ఎలా జరిగింది?

కాల్పుల గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అంబులెన్సులు-సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ముందు జాగ్రత్త చర్యగా హోటల్ సమీపంలోని వంతెన, పలు రహదారులను మూసి వేశారు. ఈ కాల్పుల్లో పలువురు మృతి చెందారని ధ్రువీకరించిన అధికారులు, గాయపడిన స్థానిక ఆసుపత్రిలో తరలించారు. అక్కడ చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. కాల్పులకు తెగబడిన దుండగుడు మరణించినట్లు ట్విన్ ఫాల్స్ పోలీస్ చీఫ్ మాథ్యూ హిక్స్ ప్రకటించారు. నిందితుడు ఎలా చనిపోయాడనే వివరాలను ఆయన వెల్లడించలేదు. నిందితుడి గుర్తింపు, దాడి వెనుక ఉద్దేశాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు. మృతుల సంఖ్యపై స్పష్టత లేదని, బంధువులకు సమాచారం అందిస్తున్నామని తెలిపారు.

Advertisement

ప్రత్యక్ష సాక్షి ఏం చెప్పారు?
తాను రెస్టారెంట్ సమీపంలోని సిగ్నల్ వద్ద ఉన్నప్పుడు ఏఆర్ తరహా రైఫిల్‌తో ఓ వ్యక్తి డ్రైవ్ చేసుకుంటూ బయటకు రావడం కనిపించిందన్నారడు. ఆ తర్వాత పిస్టల్‌తో ఉన్న మరో వ్యక్తి కాల్పులు జరపడం చూశానని చెప్పాడు. తుపాకీ గాయాలతో ఉన్న ఓ మహిళను ఒక ఉద్యోగి సురక్షిత ప్రదేశానికి లాక్కెళ్లడం చూసినట్టు తెలిపాడు. అందులోని వారంతా పారామెడిక్స్ కోసం వెయిట్ చేశారని చెప్పుకొచ్చాడు. ఘటన సమయంలో డజనుకు పైగా ప్రజలు రెస్టారెంట్ నుండి బయటకు పరుగెత్తుకుంటూ రావడం కనిపించిందన్నాడు.

ALSO READ: స్పెయిన్ లోని భారీగా చొరబాట్లు, 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత

 

Related News

ట్రంప్ పర్యటనతో తలకిందులైన సమీకరణాలు.. యూకే ప్రభుత్వానికి డెడ్‌లైన్!

సౌదీకి మరో బంగారు పంట.. భారీగా యురేనియం నిక్షేపాలు గుర్తింపు

న్యూయార్క్‌ సబ్‌వే స్టేషన్‌లో ఘోర ప్రమాదం.. భారత సంతతి మహిళ, ఆమె ఫ్రెండ్‌పై దూసుకెళ్లిన రైలు

బోరిస్ జాన్సన్ ప్రయాణిస్తున్న రైలుపై రష్యా డ్రోన్ దాడి.. త్రుటిలో తప్పిన ప్రాణపాయం!

బ్రిక్స్ ప్రసంగాన్ని ఆపి జిన్‌పింగ్ గురించి ఆరా? మోదీ విందుకు దూరంగా చైనా అధ్యక్షుడు, పుతిన్ హాజరు

240 మంది ప్రయాణికులతో వెళ్తున్న షిప్ గల్లంతు.. జావా నుండి బోర్నియోకు వెళ్తుండగా ఘటన,

బ్రిక్స్ సదస్సులో చారిత్రక ఘట్టం.. ఢిల్లీ డిక్లరేషన్‌ కు ఏకగ్రీవ ఆమోదం!

భారత్‌కు అమెరికా బిగ్ షాక్? రష్యా క్రూడాయిల్ కొనుగోళ్లపై 100% టారిఫ్!

Big Stories

Advertisement
×