E-Paper
Advertisement

భోగాపురం విమానాశ్రయంలో మొక్కలు పీకెళ్ళిన జనం.. వీళ్లు మారరు!

భోగాపురం విమానాశ్రయంలో మొక్కలు పీకెళ్ళిన జనం.. వీళ్లు మారరు!
Advertisement

Bhogapuram Airport Viral Video: పెద్ద కార్యక్రమాలు అంటే సందడి, సంబరాలు, వేలాది మంది ప్రజలు.. ఇవన్నీ కామన్. కానీ, కొన్ని సందర్భాల్లో కార్యక్రమం ముగిసిన తర్వాత జరిగే కొన్ని సంఘటనలు.. అసలు కార్యక్రమం కంటే ఎక్కువగా హైలెట్ అవుతాయి. తాజాగా భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా ఇలాంటి దృశ్యాలే కనిపించాయి. ఎయిర్ పోర్టు ఓపెనింగ్ వేడుక చూసేందుకు వచ్చిన జనాలు.. ప్రాంగణంలో అందం కోసం నాటిన పూల మొక్కలను వెళ్లేటప్పుడు పీక్కొని వెళ్లారు. ఎక్కడ మంచి మొక్క కనిపించినా వదలకుండా తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విమానాశ్రయం ప్రారంభోత్సవం ఎంతగా చర్చనీయాంశమైందో, ఆ మొక్కల వ్యవహారం కూడా అంతే చర్చకు దారి తీసింది.

అప్పట్లో విశాఖలో యోగా మ్యాట్లు..

Advertisement

తాజా వీడియోలు చూసిన చాలామందికి మరో సంఘటన వెంటనే గుర్తుకొచ్చింది. కొద్ది నెలల క్రితం విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వేలాది మందికి యోగా మ్యాట్లు ఏర్పాటు చేశారు. కార్యక్రమం ముగిసిన తర్వాత కొందరు ఆ మ్యాట్లను కూడా ఇంటికి తీసుకెళ్లిన ఘటన అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. సోషల్ మీడియాలో వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. ఆ సంఘటనపై బోలెడు ఫన్నీ మీమ్స్ చక్కర్లు కొట్టాయి.

రెండు కార్యక్రమాలకు హాజరైన ప్రధాని మోదీ

నిజానికి ఈ రెండు కార్యక్రమాలకు ప్రధాని మోదీ హాజరయ్యారు. ఒకచోట యోగా మ్యాట్లు, మరోచోట పూల మొక్కలు. కార్యక్రమాలు వేరు. కానీ, ఈవెంట్స్ ముగిసిన తర్వాత సోషల్ మీడియాలో వైరల్ అయిన దృశ్యాలు మాత్రం ఒకే తరహాలో ఉండటంతో నెటిజన్లు సరదాగా పోల్చి చూపిస్తున్నారు. ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు.

సోషల్ మీడియాలో నెటిజన్స్ జోరుగా సటైర్లు

Advertisement

భోగాపురం ఎయిర్ పోర్టు ఓపెనింగ్ సందర్భంగా ప్రజలు మొక్కలను తీసుకెళ్లడంపై నెటిజన్లు క్రేజీగా రియాక్ట్ అవుతున్నారు. “మొక్కలతోనే ఆపేశారు. ఇంకా నయం మోదీ వచ్చిన విమానాన్ని తీసుకుపోలేదు. సంతోషం” అంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. “ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగేస్తారనే సామెత, ఇలాంటి ఘటనలు చూసినప్పుడు నిజమే అనిపిస్తుంది” అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు. “వీళ్లను ఎయిర్ పోర్టు లోపలికి పంపిస్తే, అక్కడున్న వస్తువులను కూడా ఇంటికి తీసుకెళ్లేలా ఉన్నారు” అని మరో వ్యక్తి కామెంట్ పెట్టాడు. “రిటర్న్ గిఫ్ట్ తీసుకెళ్లారు.. తప్పేముంది?” అని మరో నెటిజన్ సటైర్ వేశాడు. “ఈ విజువల్స్ చూశాక ఎయిర్ పోర్టు అథారిటీస్.. మీకు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు బొ..క్క రా అనుకుంటారు” అని ఇంకో వ్యక్తి రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఎయిర్ పోర్టు ఓపెనింగ్ ఈవెంట్ కంటే.. మొక్కలు తీసుకెళ్లిన వీడియోలే హైలెట్ అవుతున్నాయి.

Read Also: విమానం ఎక్కకపోయినా భోగాపురం ఎయిర్‌ పోర్ట్‌ ను చూడొచ్చా? ఇలా వెళ్తే సరిపోతుంది!

Related News

ఎవరెస్ట్ మాత్రమే కాదు.. ఈ 7 పర్వతాలు ఎక్కడం చాలా ప్రమాదకరం

రైల్వే ఉద్యోగులు అన్ని రైళ్లలో ఫ్రీగా వెళ్లొచ్చా? లేక టికెట్ కొనాల్సిందేనా?

విమానం ఎక్కకపోయినా భోగాపురం ఎయిర్‌ పోర్ట్‌ ను చూడొచ్చా? ఇలా వెళ్తే సరిపోతుంది!

‘భోగాపురం’ అంటే ఏంటీ? ఆ పేరు ఎలా వచ్చింది? ఈ ఊరికి ఇంత చరిత్ర ఉందా?

వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా.. హైదరాబాద్ వాసులకు అదిరిపోయే కొత్త ప్యాకేజీ..!

భోగాపురంలో 13 వేల ధింసా డ్యాన్సర్లతో మోడికి వెల్‌కమ్.. గిన్నీస్ రికార్డుల్లోకి ఆదివాసీల నృత్యం!

ఇండియన్ ట్రైన్ జర్నీపై విదేశీ యువతి రివ్యూ.. నెటిజన్లు ఫిదా!

Big Stories

Advertisement
×