BigTV English

Health Tips: పాలతో పాటు ఈ ఆహార పదార్థాలు తింటున్నారా ? జాగ్రత్త..

Health Tips: పాలతో పాటు ఈ ఆహార పదార్థాలు తింటున్నారా ? జాగ్రత్త..

Avoid these Food Combinations with Milk: పాలలో అనేక పోషక పదార్థాలు ఉంటాయి. పాలు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. పాలలో కాల్షియం పుష్కలంగా ఉండడం వల్ల ఇవి ఎముకలను బలంగా ఉండడానికి సహాయపడతాయి. అంతే కాకుండా బోలు ఎముకల వ్యాధిని కూడా నివారిస్తాయి.


ఐరన్, కాల్షియం, ప్రోటీన్, మెగ్నీషియం, విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ బి12తో పాటు ఇతర పోషకాలు పాలలో ఉంటాయి. ఇవి శరీరంలో అనేక వ్యాధుల బారి నుంచి మనల్ని రక్షిస్తాయి. కానీ చాలా మంది పాలతో పాటు వివిధ పదార్థాలను తింటూ ఉంటారు. దీంతో అనేక అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

పాలతో వీటిని తినకండి:


పుల్లని పదార్థాలు:
పాలతో పాటు ఎలాంటి పరిస్థితిలోనైనా పుల్లని పదార్థాలు తినకూడదు. ఆయుర్వేదం ప్రకారం పుల్లని పదార్థాలు పాలను విషపూరితం చేస్తాయి. దీంతో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే పాలతో పాటు పుల్లని ఆహార పదార్థాలు తినకుండా ఉండడం మంచిది.
చేపలు:
శరీర ఆరోగ్యానికి చేపలు ఎంతగానో మేలు చేస్తాయి. కానీ చేపలను పాలతో కలిపి తినడం ప్రమాదకరం. పాలతో పాటు చేపలను తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. ఎలర్జీ లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రెండింటినీ ఒకేసారి తీసుకోవడం వల్ల చర్మ సమస్యలు వస్తాయి. అందుకే చేపలను పాలతో పాటుగా తినకూడదు.
స్పైసీ ఫుడ్:
స్పైసీ ఫుడ్ తినడానికి చాలా మంది ఇష్టపడతారు. కానీ పాలు తాగి ఆ తర్వాత స్పైసీ ఫుడ్ తింటే ఆరోగ్యానికి హాని కలుగుతుంది. అందుకే స్పైసీ ఫుడ్‌కు దూరంగా ఉండడం మంచిది.
ఆమ్ల పదార్థాలు:
నిమ్మ, నారింజ, ద్రాక్ష వంటి పుల్లని పండ్లను పాలతో పాటుగా తింటే జీర్ణ సమస్యలు వస్తాయి. వాంతులు, కడుపునొప్పి, విరేచనాలు కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి పాలు తాగడానికి కొన్ని గంటల ముందు ఆ తర్వాత పండ్లు తినకూడదు. పాలు తాగిన కొన్ని గంటల తర్వాత పండ్లు తినాలి.
అరటి పండ్లు:
చాలామంది పాలతో పాటు అరటి పండ్లను తింటుంటారు. అయితే వీటి వల్ల జీర్ణ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. కొంతమంది జలుబు, దగ్గు, చర్మంపై దద్దుర్లు లేక కడుపులో గ్యాస్ వంటి సమస్యలతో బాధపడతారు.

Also Read: ప్రతీ రోజూ కీరదోస తింటే ఏమవుతుందో తెలుసా..

పుచ్చకాయ:
పుచ్చకాయను పాలతో పాటు తినడం వల్ల జీర్ణవ్యవస్థకు హాని కలుగుతుంది. పుచ్చకాయ, పాలు కలిస్తే శరీరంలో అనేక సమస్యలను సృష్టిస్తాయి. ఇది జీర్ణక్రియ సమస్యలకు కూడా కారణం అవుతుంది. అంతే కాకుండా జీర్ణక్రియ ప్రక్రియ నిమ్మదించేందుకు ఇది దోహదం చేస్తుంది.
పాలతో మాంసం:
పాలు, మాంసం ఒకేసారి తినడం వల్ల శరీరంలో టాక్సిన్స్ ఏర్పడతాయి. ఈ రెండింటిలో వేర్వేరు గుణాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల అజీర్ణం, కడుపులో నొప్పి వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది.

Related News

Pneumonia causes: న్యుమోనియా రావడానికి అసలు కారణాలివే !

Pineapple Benefits: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?

Night Shift Workers: నైట్ షిప్ట్ చేస్తున్నారా ? ఈ టిప్స్ మీకోసమే !

Late Sleep: రాత్రి 11 తర్వాత నిద్రపోతున్నారా ? ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు !

Japanese Interval Walking: జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్.. ప్రయోజనాలు తెలిస్తే ఈ రోజు నుంచి మొదలెడతారు !

Momos side effects: మొమోస్ తింటున్నారా? అయితే ఈ నిజం తప్పక తెలుసుకోండి..

Big Stories

×