SmartPhone Explode Diwali| దీపావళి సమయంలో టపాసులు కాల్చడం, దీపాలు పెట్టే సమయంలో చేతిలో స్మార్ట్‌ఫోన్ కు నిప్పు అంటుకునే ప్రమాదం ఉంది. ఆ సమయంలో మీ ఫోన్ నుండి ఎలక్ట్రిక్ స్పార్క్స్ (నిప్పురవ్వలు) వచ్చినా లేదా పొగ వచ్చినా అది చాలా ప్రమాదకరం. అలాంటి సందర్బంలో ఆందోళన చెందకూడదు. వెంటనే ఈ అయిదు జాగ్రత్తలు పాటించాలి. వీటితో పెద్ద ప్రమాదాలు నివారించవచ్చు.
వెంటనే ఫోన్ నుండి దూరంగా వెళ్ళండి. 2-3 మీటర్ల దూరం పాటించండి. ఇతరులకు కూడా దూరంగా ఉండమని హెచ్చరించండి. ఫోన్‌ని తీసుకోవడానికి లేదా విసిరే ప్రయత్నం చేయవద్దు. ఫోన్ లోని వచ్చే రసాయనాల టాక్సిక్ (విషపూరితమైన) పొగ, బర్నింగ్ డిబ్రిస్ మీ శరీరానికి హాని కలిగించే అవకాశం ఉంది.
ఫోన్ లో సాధారణంగా ఉండే లిథియం-ఐయన్ బ్యాటరీ ఫైర్‌పై నీరు పోసే ప్రయత్నం చేయవద్దు. ఇది పేలుడు మరింత పెరిగేలా చేస్తుంది. ఫోన్ పై ఇసుక, మట్టి, బూడిద లేదా పొడిగా ఉండే బట్టలతో గట్టిగా కప్పాలి. దీంతో అగ్ని అణచివేయవచ్చు. అగ్నికి ఆక్సిజన్ సరఫరాను నిలిపివేస్తుంది. ఆ విధంగా అగ్గి ఆరిపోతుంది.
అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఫోన్ చుట్టూ ఉన్న హానికర పదార్థాలను తొలగించండి. కర్టెన్స్, బట్టలు, ఫైర్‌క్రాకర్స్.. మరేదైనా నిప్పు అంటుకునే అవకాశం ఉన్న వస్తువులను వెంటనే దూరంగా తీసుకెళ్లండి. అలా చేస్తే.. ఫోన్ నుంచి వచ్చే స్పార్క్స్ పెద్ద అగ్నిని ప్రారంభించకుండా ఉంటుంది. ప్రమాదాన్ని పరిమితంగా ఉంచడం లక్ష్యం.
ఫోన్‌లో ఉండే బ్యాటరీలు బర్న్ అయితే హానికరమైన, విషపూరిత పొగలు విడుదల చేస్తాయి. ఈ పొగలు మీ ఊపిరితిత్తులకు హాని కలిగించే అవకాశం ఉంది. అన్ని కిటికీలు, తలుపులను వెంటనే తెరిచి పొగలు బయటకు వెళ్లే అవకాశం కల్పించండి. ఫ్యాన్‌ని ఉపయోగించి గాలిని బయటకి వీచే విధంగా ప్రయత్నం చేయండి.
కాలిపోయిన ఫోన్‌ని చెత్తలో పడేయకూడదు. దాన్ని చల్లార్చి గంటల తరబడి మెటల్ కంటైనర్‌లో ఉంచండి. చల్లారిన తర్వాత, దానిని ఎలక్ట్రానిక్ వేస్ట్ సెంటర్‌కు తీసుకెళ్ళండి. ఇలా చేస్తే పర్యావరణానికి హాని కలగకుండా, భవిష్యత్తులో మరింత ప్రమాదాలు రాకుండా ఉంటుంది.
మరో ఫోన్‌ని ఉపయోగించి కాలిపోయిన ఫోటోలు లేదా వీడియోలను తీయండి. ఇలా చేస్తున్నప్పుడు, 15-20 అడుగుల దూరంలో ఉండండి, పొగ వస్తున్న లేదా అగ్నిలో ఉన్న డివైస్‌ను వీడియో స్పష్టంగా తీయండి. వారంటీ దావా వేయడానికి ఈ వీడియో ఆధారాలు ఉపయోగపడతాయి. కంపెనీ నుండి కాలిపోయిన డివైస్‌ను రిప్లేస్ చేయమని అడిగేందుకు ఇది సరైన ఆధారం.
దీపావళి సమయంలో ఫోన్ పేలడం అరుదైన విషయం కాదు, ఎందుకంటే ఫైర్‌క్రాకర్స్, ఎలక్ట్రికల్ డెకరేషన్స్ కారణంగా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ, ప్రమాదం జరిగినప్పుడు ఆందోళన చెందకుండా, సరైన చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం.
Also Read: ప్రపంచంలోని అన్ని టీవి ఛానెల్స్ ఫ్రీ.. మీ స్మార్ట్‌ఫోన్‌లో లైవ్ టీవి ఉచితం.. ఇలా చూసేయండి