Intinti Ramayanam Today Episode October 21st : నిన్నటి ఎపిసోడ్ లో.. ప్రణతి ఇంట్లో జరుగుతున్న వాటి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. పల్లవి వదిన శ్రీయ వదిన ఇద్దరు కూడా అవని వదినని అవమానించాలని ఈ ఇంట్లోకి మళ్లీ వచ్చారు.. ఇంట్లో వాళ్ల కోసం అవని వదిన పడుతున్న కష్టాల గురించి మనం చూస్తూనే ఉన్నాం కదా మళ్లీ వీళ్ళు ఆమెని ఇంకా బాధ పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని నాకు అర్థం అవుతుంది. నాకు అదే భయంగా ఉంది భరత్ అని ప్రణతి అంటుంది. వాళ్లు కచ్చితంగా వచ్చింది అందుకే..
మనల్ని కూడా వాళ్ళు అవమానిస్తారు కానీ నువ్వు పట్టించుకోవద్దు అని భరత్ అంటాడు. అన్న సంగతి పక్కన పెట్టు ఇన్నాళ్ల తర్వాత కలుసుకున్న అన్న వదినల మధ్య మళ్లీ గొడవలు పెడతారేమో అని నాకు భయంగా ఉంది అని ప్రణతి అంటుంది. అక్క జోలికొస్తే అస్సలు ఊరుకునేది లేదు అని భరత్ అంటాడు.. ఇక శ్రీయా పల్లవి ఇద్దరు కూడా.. నేను మేము ఏం చేసినా ఒక ప్లాన్ ప్రకారం చేస్తాం కాబట్టి మన ఇద్దరి టార్గెట్ అవని. అవని గురించి ముందు ఆలోచిద్దాం అని ఇద్దరు మళ్లీ కలిసిపోతారు. మనల్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేలా చేసిన ఆ అవనీని మనం ఇంట్లో లేకుండా చేయాలి అని ప్లాన్ చేస్తారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. పల్లవి పసిపిల్ల అని కూడా చూడకుండా ముష్టి వాడికి విసిరేసినట్టు విసిరేస్తుంది. దాంతో అవని చాలా బాధపడుతుంది. ఆరాధ్య తినబోతుంటే అవని వద్దని అంటుంది. వద్దమ్మా అని ఆరాధ్య తో అవని అంటుంది. మనుషులకి మనుషుల్లాగే ఇవ్వాలి ఏదో ముష్టి వాడికి విసిరేసినట్టు వేశావు అని అనుకోకుండా అడుగుతుంది అవని.. అయితే ఇక పల్లవి దగ్గరికి వెళ్లి అవని నువ్వు చేసిన విషయాల గురించి కమల్ కు చెబితే నీ పరిస్థితి ఏంటో ఊహించుకో అది గుర్తుపెట్టుకుని ఇంట్లో ప్రవర్తించు అని అంటుంది. అక్షయ్ ఇంటికి రాగానే ఏమైంది అని అడుగుతాడు. అవని ఏ మాట చెప్పదు. శ్రియ పల్లవిలు ఎలా ఉంటారో నేను అర్థం చేసుకోగలను నాన్న కోసం నువ్వు అర్థం చేసుకో నువ్వు సర్దుకుపోవాలి అని మాట తీసుకుంటాడు.
శ్రియ గదిలోకి రాగానే శ్రీకర్ తో ఇంతటి ఇరుకు గదిలో మనం ఉండాలా నాకసలు నచ్చలేదు అని అంటుంది. మనకు ఇష్టం వచ్చినట్టు ఉండమనే కదా ఇక్కడికి తీసుకొచ్చారు. నాకు ఈ గది నచ్చలేదు అత్తయ్య మామయ్యలు గది బాగా విశాలంగా ఉంది ఆ గది కావాలని అడుగుదాం వెళ్దాం పదాన్ని శ్రీయ బలవంతంగా శ్రీకర్ని తీసుకుని వస్తుంది.. బయటికి రాగానే అత్తయ్య మాకు ఈ గది నచ్చలేదు మీరు గది మాకు ఇచ్చేయండి అని అడుగుతుంది. అత్తయ్య మామయ్యకు ఆరోగ్యం సరిగా లేదు అలాంటిది ఆ గదిలో గాలి వెలుతురు మంచిగా ఉంటుందని ఆ గదిలో ఉండమని చెప్పామని అవని అంటుంది.
అంటే మాకు గాలి వెళుతున్న అవసరం లేదా? మేము మీకు మనుషులాగా కనిపించలేదా అని శ్రియ గని కోసం రచ్చ చేస్తుంది.. అవని ఎంత చెప్తున్నా సరే శ్రేయ వినదు అటు పల్లవి కూడా మాకు గది సరిగ్గా లేదు అని అడుగుతుంది. నిన్ను ఇంట్లోకి రానివ్వడమే ఎక్కువ అలాంటిదే నీకు గది కూడా ఇవ్వాలని అంటాడు. మాకు ఏది అవసరం లేదు అని కమలంటాడు. పల్లవి అదేంటి మనం కూడా మనుషులమే కదా అని అంటుంది.. ఇక అవని చీటీలలో పేర్లు రాసుకొని వచ్చి భానుమతిని తీయమని అడుగుతుంది. అందులో రాజేంద్రప్రసాద్ వచ్చిందని అనగానే శ్రీయ ఆ చీటీలన్నిటిని చదువుతుంది..
అన్ని రాజేంద్రప్రసాద్ పేర్లే ఉండడంతో శ్రీయ షాక్ అవుతుంది.. ఇప్పుడు ఆ పేర్లను నేను రాస్తాను అందులో ఎవరి పేరు వస్తే వాళ్లకే అది అందరి పేర్లు రాస్తుంది. మళ్లీ రాజేంద్రప్రసాద్ పేరు రావడంతో షాక్ అవుతుంది. ఇక ఆరాధ్య స్కూల్లో కాంపిటేషన్ ఉంది డబ్బులు కట్టాలి అని అక్షయ్ ని అడుగుతుంది. అవని అక్షయ్ కి డబ్బులు ఇచ్చి ఇది మన పాప విషయం కాబట్టి మీరేం ఫీల్ అవ్వద్దు స్కూల్లో వెళ్లి ఈ డబ్బులు కట్టేసి రండి అని అంటుంది. అక్షయ్ అవని ఇచ్చిన సలహాతో ఏదో ఒక జాబ్ చేయాలి ఇంట్లో కష్టాలను తీర్చాలి అని అనుకుంటాడు.
Also Read : ఇంట్లో దీపావళి సంబరాలు.. కక్కుర్తి పడ్డ మనోజ్..రోహిణికి ఫ్యూజులు అవుట్..
తన ఫ్రెండ్ కు ఫోన్ చేసి ఏదైనా జాబ్ ఉంటే చూడరా ఇంట్లో పరిస్థితి బాగాలేదు అని అడుగుతాడు. సరే ఏదో ఒకటి చూస్తానులే రా అని తన ఫ్రెండ్ అంటాడు. ఇక ఉదయం లేవగానే అవని పూజ చేసి అందరికీ కావాల్సిన అవసరాలని తీరుస్తుంది. వంటగదిలోకి వెళ్లి భానుమతి దగ్గరికి పార్వతి ఏం చేస్తున్నారు అత్తయ్య అని అంటుంది ఇంట్లో ఒక్కటే అవని పనులు చేస్తుంది కదా.. అందుకే ఏదో ఒకటి నా వంతు సాయం చేద్దామని కూరగాయలు చదువుతున్నానని అంటుంది. ప్రణతి అవని వదిన ఒక్కటే ఉదయం లేసి అందరికీ కావాల్సినవన్నీ చేసిపెడుతుంది. కానీ పల్లవి వదిన శ్రీయ వదినలు మాత్రం ఏ మాత్రం పట్టించుకోకుండా పడుకున్నారు అని అంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్లు ఏం జరుగుతుందో చూడాలి.