Amaravati: నిత్యం రాజకీయాల్లో బిజీగా ఉండే ఏపీ రాజకీయ నేతలు దీపావళి వేళ కాస్త రిలాక్స్ అయ్యారు. సీఎం చంద్రబాబు, మాజీ సీఎం జగన్ సోమవారం రాత్రి దీపావళి పండుగను ఘనంగా జరుపుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఇద్దరు నేతలు వేడుకలు చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి.
ఘనంగా దీపావళి సంబరాలు
ఏపీ రాజకీయాల్లో వారిద్దరు కీలకమైన నేతలు. ఒకరు సీఎం చంద్రబాబు కాగా, మరొకరు మాజీ సీఎం జగన్. సోమవారం రాత్రి ఇరు కుటుంబాలు వేర్వేరు ప్రాంతాల్లో దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు ఉండవల్లిలోని నివాసంలో భార్య భువనేశ్వరితో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు.
సీఎం దంపతులు బాణాసంచా కాల్చిన ఫొటోలను టీడీపీ అధికారికంగా విడుదల చేసింది. చంద్రబాబు, భువనేశ్వరి పక్క పక్కనే నిలబడి చిచ్చుబుడ్లు, కాకరపువ్వొత్తులు వెలిగిస్తూ కనిపించారు.అటు వైసీపీ అధినేత జగన్ బెంగళూరులోని యలహంక నివాసంలో దీపావళి వేడుకలు జరుపుకున్నారు. సోమవారం ఉదయం లండన్ నుంచి బెంగళూరుకు చేరుకున్నారు.
సీఎం చంద్రబాబు.. జగన్ దంపతులతో కలిసి
దీపావళి వేడుకల్లో భార్య భారతితో కలిసి పాల్గొన్నారు మాజీ సీఎం. దీపావళి సందర్భంగా బాణాసంచా కాల్చారు మాజీ సీఎం జగన్ దంపతులు. దీపావళి పండుగ అందరి జీవితాల్లో మరిన్ని వెలుగులు తీసుకురావాలని కోరుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ దీపావళి శుభాకాంక్షలు ఎక్స్ ద్వారా తెలియజేశారు మాజీ సీఎం జగన్.
ALSO READ: నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు.. ఏడు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్
ఇదిలా ఉండగా జగన్ సడన్‌గా లండన్ నుంచి రావడంపై పార్టీ నేతలు అప్పుడు చర్చించుకోవడం మొదలుపెట్టారు. షెడ్యూల్ ప్రకారం ఈనెల 23 వరకు జగన్ దంపతులు లండన్‌లో గడపాల్సి ఉంది. రెండురోజులు ముందుగానే వచ్చేశారని అంటున్నారు. రీసెంట్‌గా జగన్ తన ఫోన్ నెంబర్లు ఇవ్వలేదని సీబీఐ.. న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ క్రమంలో అధినేత వచ్చారని అంటున్నారు కొందరు నేతలు. జగన్ విదేశీ పర్యటన పూర్తి కావడంతో నేరుగా ఇప్పుడు న్యాయస్థానం ముందు హాజరుకావాల్సివుంది. మరి ఇప్పుడైనా న్యాయస్థానం ముందు హాజరవుతారా? లేదా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఉండవల్లి నివాసంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సతీ సమేతంగా దీపావళి వేడుకలు ఘనంగా చేసుకున్నారు. దీపాలు వెలిగించి, భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు పూర్తి చేశారు. చిచ్చుబుడ్లు, కాకరపువ్వొత్తులు కాల్చిన సీఎం దంపతులు సంబరంగా గడిపారు.#Diwali2025 #ChandrababuNaidu… pic.twitter.com/6pqjujnnH7
— Telugu Desam Party (@JaiTDP) October 20, 2025
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత శ్రీ వైయస్ జగన్ దీపావళి వేడుకలు
దీపావళి పండుగ అందరి జీవితాల్లో మరిన్ని వెలుగులు తీసుకురావాలని కోరుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ దీపావళి శుభాకాంక్షలు ఎక్స్ ద్వారా తెలియజేసిన శ్రీ వైయస్ జగన్
బాణసంచా కాల్చిన శ్రీ వైయస్… pic.twitter.com/PBFTbvB2GI
— YSR Congress Party (@YSRCParty) October 20, 2025