Nindu Noorella Saavasam Serial Today Episode: టిఫిన్ చేయడానికి కిందకు వచ్చిన అమర్, మిస్సమ్మను చూసి ఎక్కడికి వెళ్తున్నావు ఉదయమే రెడీ అయ్యావు అని అడుగుతాడు. దీంతో మిస్సమ్మ బాధపడుతూనే హాస్పిటల్‌కు చెకప్ కోసం వెళ్తున్నాను అని చెప్తుంది. దీంతో అమర్ సారీ భాగీ ఈ టైంలో నీ ఫీలింగ్స్, ఎమోషన్స్ ఎలా ఉంటాయో నేను అర్థం చేసుకోగలను.. నాకన్నా నువ్వు నన్ను ఎక్కువ అర్థం చేసుకున్నావు. నిజానికి నేనే దగ్గరుండి నిన్ను హాస్పిటల్ కు తీసుకెళ్లి అన్ని టెస్టులు చేయించాలి. కానీ ఆఫీసులో హెవీ వర్క్ ఉండి నేను వెళ్లక తప్పడం లేదు. అది అర్థం చేసుకుని నువ్వే సొంతంగా హాస్పిటల్‌కు వెళ్లి టెస్టులు చేయించుకోవాలనుకుంటున్నావు అంతే కదా అని అమర్ అడగ్గానే.. మిస్సమ్మ అవును అన్నట్టు తల ఊపుతుంది. థాంక్యూ భాగీ ఈ సారి నీతో రాలేకపోయినా నెక్ట్స్ టైం తప్పకుండా వస్తాను.. ఐ ప్రామీస్ అని చెప్పగానే..
మిస్సమ్మ మనసులో బాధపడుతూ ఆ అవసరం ఎప్పటికీ రాదులేండి అనుకుంటుంది. అమర్ టిఫిన్ చేసి ఇప్పుడు నీతో రాథోడ్ వస్తాడు. నీకేం భయం లేదు.. హాస్పిటల్ లో అన్ని తనే చూసుకుంటాడు. రాథోడ్ మిస్సమ్మను జాగ్రత్తగా హాస్పిటల్ కు తీసుకెళ్లి టెస్టులు చేయించి జాగ్రత్తగా ఇంటికి తీసుకురా అని చెప్పగానే.. రాథోడ్ బాధపడుతూ.. మనసులో భగవంతుడా ఈ పాపంలో నాకు భాగం పంచుతున్నావా..? స్వామి అనుకుంటూ సార్ నేను పిల్లలను స్కూల్‌కు తీసుకెళ్లాలి అని చెప్తాడు. దీంతో అమర్ పిల్లలతో పాటు మిస్సమ్మను కూడా తీసుకెళ్లు.. పిల్లలను స్కూల్ లో డ్రాప్ చేసి ఆ తర్వాత మీరు హాస్పిటల్‌కు వెళ్లండి అని చెప్పగానే.. రాథోడ్ అది కాదు సార్ అంటూ ఏదో చెప్పబోతుంటే.. ఏంటి రాథోడ్ అంత కంగారు పడుతున్నావు.. నేను మిస్సమ్మను తీసుకెళ్లమంటుంది వార్ జోన్‌కు కాదు.. హాస్పిటల్‌కు అని చెప్తుంటే..
పక్కనే ఉన్న మనోహరి రాథోడ్ కంగారు పడుతుంది దాని కడుపులో బిడ్డను చంపే పాపంలో ఎలా పాలు పంచుకోవాలా..? అని మనసులో అనుకుంటుంది. మిస్సమ్మకు నువ్వైనా తోడుగా వెళ్లినే నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది అని అమర్ చెప్పగానే.. రాథోడ్ సరే సార్ అంటాడు. సరే భాగీ నేను ఆఫీసుకు వెళ్తున్నాను.. నువ్వు టెన్షన్ పడకుండా హాస్పిటల్ కు వెళ్లిరా అని చెప్పి అమర్ వెళ్లబోతుంటే.. మిస్సమ్మ ఏవండి ఒక్క నిమషం అంటూ లోపలికి వెళ్లి ఒక ఫైల్ తీసుకొచ్చి ఇందులో మీ సైన్ కావాలండి అని అడుగుతుంది. దీంతో అమర్ సైన్ ఏంటి..? ఎందుకు..? అని అమర్ అడగ్గానే.. రాథోడ్ భయపడుతుంటాడు.
అబార్షన్‌కు నీ అనుమతి కావాలి కదా అమరేంద్ర అని మనసులో అనుకుంటుంది. మిస్సమ్మ మాత్రం అది టెస్టులకు వెళ్తున్నాను కదండి.. హాస్పిటల్ ఫార్మాలిటీ అంతే అని చెప్పగానే.. అమర్ సైన్ చేస్తాడు. నువ్వు చేస్తుంది సంతకం కాదు అమర్ పుట్టబోయే నీ బిడ్డకు మరణశాసనం అని మనోహరి మనసులో అనుకుంటుంది. సంతకం చేసిన అమర్ సరే వెళ్లి వస్తాను అని చెప్పగానే.. మిస్సమ్మ ఎమోషనల్ అవుతూ.. అమర్‌ను హగ్ చేసుకుంటుంది. నన్ను క్షమించండి మీకు తెలియకుండా బిడ్డను చంపేసుకుంటున్నాను. మీకు ఈ నిజం తెలిసిన రోజు మీరు నాకు ఏ శిక్ష వేసినా భరిస్తాను అని మనసులో అనుకుంటుంది. తర్వాత అమర్ వెళ్లిపోతాడు.
రాథోడ్, మిస్సమ్మ ఇద్దరూ కలిసి హాస్పిటల్‌కు వెళ్తారు. అక్కడ మిస్సమ్మ డాక్టర్ దగ్గరకు వెళ్తుంది. తన గురించి అన్ని విషయాలు చెప్తుంది. ఇంతలో ఆఫీసుకు వెల్లిన అమర్‌కు డౌటు వస్తుంది. ఫార్మాలిటీ చెకప్‌కు నా సైన్ ఎందుకు..? అసలు అది జనరల్ చెకపేనా..? అని అనుకుంటుంటాడు. ఇంతలో డాక్టర్ దగ్గర ఉన్న మిస్సమ్మ తాను ప్రెగ్నెంట్ అని చెప్పి కానీ అబార్షన్ చేయించుకోవాలి అందుకే వచ్చానని చెప్తుంది. దీంతో డాక్టర్ వద్దని చేయమని వారిస్తుంది. అయితే ఇదంతా మా ఆయన పర్మిషన్ తోనే చేయించుకుంటున్నానని చెప్తుంది. అమర్ సంతకం చేసిన ఫైల్ చూపిస్తుంది. దీంతో డాక్టర్ సరే అయితే పదండి అంటూ ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకెళ్తుంది. మరోవైపు అమర్‌కు డౌటు వచ్చి హాస్పిటల్‌కు బయలుదేరుతాడు. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.