Brahmamudi serial today Episode: రుద్రాణి, రాజ్‌ను రెచ్చగొట్టగానే.. ఇంద్రాదేవి అడ్డు పడుతుంది. రాజ్‌కు సపోర్ట్ చేస్తుంది. దీంతో రాజ్ డౌటుగా నాన్నమ్మ ఇన్ని రోజులు మీరందరూ కావ్యకు కదా సపోర్టు చేశారు. ఇవాళేంటి నాకు సపోర్టు చేస్తున్నావు అని అడుగుతాడు. దీంతో ఇంద్రాదేవి నీ గురించి రాత్రే తెలిసిందిరా అందుకే నీకు సపోర్టు చేస్తున్నాను.. నువ్వు ఎలాగైనా కావ్యను ఒప్పించి ఇంటికి తీసుకురావాలి అని చెప్పగానే.. ఇన్ని రోజులు ఒక్కడిని ఉంటేనే తగ్గలేదు.. ఇప్పుడు నీ సపోర్టు దొరికి ఇద్దరు అయ్యాము ఇక తగ్గుతానా..? కావ్యను తీసుకుని వస్తాను అని చెప్తాడు. దీంతో ఇంద్రాదేవి సరే అయితే పద పోదాం అంటూ వెళ్లిపోతుంది.
మరోవైపు రుద్రాణిని రాహుల్ కారు దగ్గరకు తీసుకెళ్లి తాను తీసుకొచ్చిన క్రాకర్స్ చూపిస్తాడు. అవి చూసిన రుద్రాణి ఓరేయ్ ఇవి పని చేస్తాయి కదా అని అడుగుతుంది. పని చేయడం కాదు మామ్ ఏకంగా పైకే పంపిస్తాయి. నువ్వు చెప్పిన పౌడర్‌తో స్పెషల్ గా దగ్గరుండి చేయించాను. ఈ క్రాకర్స్ కాల్చినప్పుడు దాని స్మోక్ కానీ లోపలికి పోయిందనుకో.. అంతే చాలు బ్రీతింగ్ ఆగిపోతుంది. కళ్లు తెరవకుండానే కావ్య కడుపులో ఉన్న బిడ్డ కాటికి పోతుంది అని చెప్పగానే.. వెరీగుడ్ రాహుల్.. మనకు కావాల్సింది అదే కదా..? ఈరోజు ఎలాగైనా సరే ఆ కావ్య చేత ఈ క్రాకర్స్ అన్ని కాల్పించాల్సిందే.. కానీ ఎలా అని ఆలోచిస్తూ అటూ ఇటూ చూస్తుంటే.. జూనియర్ స్వరాజ్ కనిపిస్తాడు.
వాడి దగ్గరకు వెళ్లి క్రాకర్స్ కాలుస్తావా..? అని అడుగుతుంది. ఓ తప్ప కుండా కాలుస్తాను.. నీ దగ్గర క్రాకర్స్ ఉన్నాయా..? అని స్వరాజ్ అడగ్గానే.. రుద్రాణి ఓ నా దగ్గర బోలెడని ఉన్నాయి. కానీ అవి నువ్వు కాల్చాలి అంటే కొన్ని కండీషన్స్ ఉన్నాయి.. అవి నువ్వు నైట్ మాత్రమే కాల్చాలి. అది కూడా నువ్వు మీ కావ్య అత్తయ్యతో మాత్రమే కాల్చాలి అని చెప్పగానే.. ముందు క్రాకర్స్ ఎక్కడున్నాయి చెప్పండి అని అడుగుతాడు. దీంతో రుద్రాణి.. స్వరాజ్‌ను తీసుకెళ్లి తాము తీసుకొచ్చిన క్రాకర్స్ చూపిస్తుంది. అవి చూసిన తర్వాత స్వరాజ్ ఇవి నాకొద్దు లాస్ట్ టైం అమ్మమ్మ ఇంటికి వచ్చినప్పుడు నన్ను నువ్వు తిట్టావు అందుకే నేను తీసుకోను.. నేను మా మామయ్య వెళ్లి మీకన్నా ఎక్కువ క్రాకర్స్ తెచ్చుకుంటాము అని అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
దీంతో వెటకారంగా రాహుల్ మమ్మీ నువ్వు వెంటనే వెళ్లి జ్యోతిష్యుడిని కలువు అని చెప్తాడు. ఎందుకురా అని రుద్రాణి అడగ్గానే.. ఏదైనా ప్లాన్ మొదలు పెట్టగానే.. ఫెయిల్ అవుతుంది. అసలు నీకు టైం ఎలా నడుస్తుందో చూస్తున్నావు కదా అంటాడు. దీంతో రుద్రాణి ఇది కూడా మన మంచికే జరిగింది రాహుల్ అంటుంది రుద్రాణి.. దీంతో రాహుల్ కోపంగా ఇలాంటి దరిద్రం కూడా మంచి కోసమే ఎలా జరుగుతుంది మమ్మీ అని అడుగుతాడు. దీంతో రుద్రాణి.. ఇప్పుడు ఇవి ఆ స్వరాజ్ గాడు కాలిస్తే.. ఆ నిందలు మన మీదకు వచ్చేవి. కానీ ఇప్పుడు ఆ రాజ్ తెచ్చే క్రాకర్స్‌లో ఇవి కలిపేద్దాం.. అంతే మన మీదకు నింద రాకుండా పని అయిపోతుంది అని చెప్పగానే.. రాహుల్ సూపర్ ఐడియా మమ్మీ అంటాడు రాహుల్.
కనకం కొత్త బట్టలు తీసుకొచ్చి రాజ్‌కు ఇవ్వమని కావ్యకు ఇస్తుంది. అప్పుడు కావ్య తాను డైరెక్టుగా ఇస్తే తీసుకోడని ఇంద్రాదేవి, అపర్ణతో కలిసి నాటకం ఆడి తాము తీసుకొచ్చిన కొత్త బట్టలు రాజ్ వేసుకునేలా చేస్తుంది కావ్య. తర్వాత కావ్య భయపడుతుంది. ఇంతకు ముందులా నాక అబార్షన్ అయ్యేందుకు ఏదైనా ప్లాన్ చేస్తున్నాడో అని భయపడుతుంది. దీంతో ఇంద్రాదేవి, అపర్ణ అలాంటిదేం జరగదు అని చెప్తాడు. మరోవైపు రూంలో రెడీ అవుతున్న రాజ్ దగ్గరకు జూనియర్ స్వరాజ్ వెళ్లి క్రాకర్స్ తెచ్చుకుందామని అడుగుతాడు. రాజ్ సరే అంటాడు. అంతా కిటికీలోంచి చూస్తున్న రుద్రాణి హ్యాపీగా ఎస్ తీసుకెళ్తున్నాడు.. రాహుల్ ఇక అంతా నీ చేతుల్లో ఉంది. ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు మనం తెచ్చిన క్రాకర్స్ వాళ్లు తీసుకొచ్చిన వాటిలో కలపాలి అని చెప్పగానే.. రాహుల్ యూ డోంట్ వర్రీ మమ్మీ అదంతా నేను చూసుకుంటాను అని చెప్తాడు.
తర్వాత రాత్రికి అందరూ కలిసి క్రాకర్స్ కాలుస్తుంటారు. పక్క నుంచి రాహుల్, రుద్రాణి చూస్తుంటారు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.