Gundeninda GudiGantalu Today episode October 21st : నిన్నటి ఎపిసోడ్ లో..శృతి వాళ్ళమ్మ దీపావళి పండక్కి అల్లుడిని తీసుకొని ఇంటికి రమ్మని పిలుస్తుంది. మా అమ్మ ఇంటికి రమ్మని పిలుస్తుంది రవి అని శృతి అంటుంది. అదేంటి ఇంటికి పిలవాలంటే నాకు ఫోన్ చేసి పిలవాలి కదా నీకు ఫోన్ చేసి తెలుస్తుంది ఏంటి అని రవి అంటాడు. అల్లునికి ఫోన్ చేసి పిలవడం మర్యాద అని రవి అంటాడు. ఏదైతే ఏమి నాకు చేసింది కదా మనల్ని రమ్మని పిలుస్తుంది వాళ్లకి కూడా ఏవో ఒక ముచ్చట్లు ఉంటాయి కదా అని అంటుంది శృతి. బాలు మాత్రం మనం ఇక్కడే మా పండగ చేసుకుందామని అంటాడు..
మా అత్తగారు ఫోన్ చేసి రమ్మని పిలిచినా కూడా నేను వెళ్ళను అని బాలు అంటాడు అత్తగారు ఫోన్ చేసి రమ్మని పిలిచినా కూడా నేను వెళ్ళను అని బాలు అంటాడు. అబ్బో మీ అత్తగారు పెద్ద గొప్పగా చేసేవాళ్ళు లే ఆడపించినా ఒకటే పిలవకపోయినా ఒకటే అని ప్రభావతి మీన వాళ్ళ కుటుంబాన్ని దారుణంగా అవమానిస్తుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. ప్రభావతితో సహా అందరూ కూడా దీపావళి కోసం పూజలు చేస్తారు. ఇంట్లో ఎంతో సందడి వాతావరణం నెలకొంటుంది. సత్యం తమ ముగ్గురు కోడళ్ళకు దీపావళి కానుకలు ఇస్తాడు. ముగ్గురు కలిసి ఎరుపు రంగు చీరలో పూజకు వస్తారు. ఇంటిని పూలతో ముస్తాబు చేయడంతో పాటుగా దీపాలతో ఎంతో చక్కగా అలంకరిస్తారు. ఇక అందరూ సరదాగా పూజను మొదలు పెడతారు. పూజ పూర్తవ్వగానే ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోతారు. పండగ రోజు పూలకు మంచి డిమాండ్ ఉంటుందని మీనా ఈరోజు చేస్తే మనకి మంచిగా డబ్బులు వస్తాయని బాలుతో అంటుంది..
కానీ సత్యం మాత్రం అందరూ ఇంట్లో ఉండి ఈరోజు సంతోషంగా గడపాలని కోరుకుంటాడు. అయితే అందరూ సత్యం మాట విని ఎక్కడికి వెళ్లకుండా దీపావళి సంబరాలను జరుపుకోవాలని అనుకుంటారు. సాయంత్రం వ్రతం ఉంది అందరూ ఉపవాసం ఉండి పూజ చేయాలి అని ప్రభావతి కోడళ్లకు చెప్తుంది. మీనా మమ్మల్ని ఆశీర్వదించండి మావయ్య గారు అని ఆశీర్వాదం తీసుకుంటారు. ఇక ముగ్గురు కొడుకులు కూడా తల్లిదండ్రుల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. మీనా పాయసం చేసి తీసుకొని వస్తుంది.
రవి ప్రభావతి మేము పనిలో ఉన్నాం తర్వాత తీసుకుంటాం అని అంటారు. ఇక అందరూ పాయసం బాగుంది అంటూ మెచ్చుకుంటూ లొట్టలు వేసుకుని తింటారు. మనోజ్ కి మాత్రం మీ నా చేతికి ఇవ్వకుండా కుక్కకి ఇచ్చినట్టు అక్కడ పడేసి వెళ్తుంది. ఇదేంటి నాకు చేతికి ఇవ్వకుండా ఇలా పడేసింది ఏంటి అని అనుకుంటాడు. అయితే మనోజు అందరూ పాయసం గురించి పొగుడుతూ ఉంటే దొంగగా మింగేస్తాడు. బాలు ఏంట్రా లక్షలు మింగేసినట్టు పాయసాన్ని అని కూడా మింగేసావా అని అంటాడు..
విద్య మీనాకు ఫోన్ చేసి పువ్వులు కావాలని అడుగుతుంది. మేము పార్టీ చేసుకోవాలనుకుంటున్నాము నువ్వు పూలు తెచ్చే ఇచ్చి వెళ్ళు మీనా అని విద్య అడుగుతుంది. పూలు ఇవ్వడానికని మీనా విద్య వాళ్ళింటికి వెళ్తారు.. దినేష్ రోహిణి కి కాల్ చేస్తాడు. ఏంటి ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదు అని బెదిరిస్తాడు. మనుషుల్ని పెట్టి కొట్టించిన నీకు బుద్ధి రాలేదా నన్ను ఇంకా వదలవా అని రోహిణి అంటుంది.
నువ్వు మనుషులని పెట్టి కొట్టించినందుకే నీ మీద ఇంకా నాకు కసి పెరిగింది నీ గురించి అన్ని నిజాలను బయట పెట్టేస్తాను అని బెదిరించేస్తాడు. నువ్వు అర్జెంటుగా నాకు లక్ష రూపాయలు ఇవ్వకుంటే మీ ఇంటికి వచ్చి ఈ విషయాన్ని ఫోటోలతో సహా చూపిస్తాను అని రోహిణి బెదిరిస్తాడు. రోహిణి వెంటనే విద్య దగ్గరికి వెళ్తుంది. నాకేం చేయాలో అర్థం కావట్లేదు ఆ దినేష్ గాడు వెంటనే లక్ష రూపాయలు ఇవ్వాలని అంటున్నాడు. నాకు భయంగా ఉంది ఎవడు అన్నట్లుగానే ఆ చేసేస్తాడేమో.. వాడికి కచ్చితంగా లక్ష రూపాయలు ఇవ్వాలి అని అనుకుంటుంది.
Also Read :పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ జంటలు..జనాలను పిచ్చోళ్లను చేస్తున్నారే..!
విద్య నువ్విలా వాడికి రోజు డబ్బులు ఇచ్చుకుంటూ వెళ్తుంటే వాడు ఇంకా రెచ్చిపోయి నిన్ను డబ్బులు అడుగుతూనే ఉంటాడు. నువ్వు వాడికి ఇంకా డబ్బులు ఇవ్వద్దు ఏం చేస్తాడు చేసుకుని అని అంటుంది. రోహిణిని దినేష్ కిడ్నాప్ చేయాలని అనుకుంటాడు. ఓ ఇంటికి వెళ్లిన రోహిణిని తీసుకు రమ్మని తన మనుషులని పంపిస్తాడు. అదే ఇంటికి పూలను డెలివరీ చేయడానికి మీనా వెళ్తుంది. ఎర్ర చీరలో ఉంటుంది అని చెప్పగానే మీలానే కిడ్నాప్ చేసి తీసుకొచ్చేస్తారు.. బాలు మీనా ఎక్కడికి వెళ్లిందో టెన్షన్ పడుతూ ఉంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..