Bengaluru News: ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ సీఈఓ భవిష్ అగర్వాల్ చిక్కుల్లో పడ్డారా? ఎందుకు ఆయనపై కేసు నమోదు అయ్యింది? కంపెనీ ఉద్యోగి రాసిన లేఖలో ఏముంది? యాజమాన్యం వేధింపులకు గురి చేసినట్టు అందులో ప్రస్తావించాడా? ఓలా సీఈఓతోపాటు టాప్ అధికారులు ఉన్నారా? అవుననే అంటున్నారు బెంగుళూరు పోలీసులు. అసలు ఏం జరిగింది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ మెడకు కొత్త కేసు
బెంగుళూరు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీలో పని చేస్తున్న 38 ఏళ్ల అరవింద్ అనే ఇంజినీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. మూడేళ్లుగా అరవింద్ ఆ కంపెనీలో ఓలా ఎలక్ట్రిక్ కంపెనీలో హోమో లోగేషన్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. గత నెల అంటే సెప్టెంబర్ 28న అరవింద్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు సోదరుడు అశ్విన్ ఫిర్యాదు మేరకు బెంగుళూరు పోలీసులు అక్టోబర్ 6న కేసు నమోదు చేశారు.
దీనిపై విచారణ చేపట్టిన పోలీసులకు షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ సీఈఓ భవీష్ అగర్వాల్, మరికొందరు అధికారులపై బెంగుళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిర్యాదులో మృతుడి ఇంట్లో 28 పేజీల సూసైడ్ నోట్ లభించింది. దాన్ని పోలీసులకు అందజేశారు. తనను మానసికంగా వేధించారన్నది ఫస్ట్ పాయింట్. పని ఒత్తిడికి గురి చేశారని మరో పాయింట్.
బెంగుళూరు పోలీసులు కేసు నమోదు
ఆత్మహత్య వెనుక సీఈఓ భవిష్ అగర్వాల్, సుబ్రత కుమార్‌లు కారణమని పేర్కొన్నాడట. జీతం చెల్లించకపోవడం వంటి కారణాల నేపథ్యంలో అరవింద్ విషం తీసుకుని మరణించాడని తేలింది. అక్టోబర్ 18న నిందితులపై బలవంతపు చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీనిపై నిందితులకు నోటీసులు జారీ చేసినట్టు పోలీసులు తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఓలా ఉద్యోగి అరవింద్ మరణించిన రెండు రోజులకు అతడి బ్యాంక్ ఖాతాలో సదరు కంపెనీ నుంచి రూ. 17 లక్షల పైచిలుకు డబ్బులు జమ అయ్యాయి. నగదు బదిలీపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై హెచ్‌ఆర్ విభాగం, కంపెనీ అధికారులను అరవింద్ కుటుంబసభ్యులు సంప్రదించారు. వారికి నుంచి సరైన సమాధానాలు లభించలేదు. చివరకు అరవింద్ వస్తువులను తనిఖీ చేయడంతో 28 పేజీల సూసైడ్ నోట్ దొరికిందని కుటుంబసభ్యుల మాట.
ALSO READ: మోస్ట్ డేంజర్ రౌడీషీటర్ రియాజ్, భారీగా క్రిమినల్ కేసులు
ఈ కేసు నిమిత్తం త్వరలో ఆ కంపెనీ సీనియర్ అధికారులను పోలీసులు ప్రశ్నించనున్నారు. మృతుడి కుటుంబానికి మద్దతుగా మొత్తం సెటిల్‌మెంట్ చేసి డబ్బులను ఖాతాలో జమ చేసింది ఆ కంపెనీ. తమ ఉద్యోగి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసింది. తమపై వస్తున్న ఆరోపణలను ఆ కంపెనీ ఖండించింది. మూడు సంవత్సరాలుగా పని చేసిన అరవింద్, వేధింపులకు గురైనట్లు తమకు ఫిర్యాదు చేయలేదని పేర్కొంది.