BigTV English

Wife: పనీపాటా లేదు.. ముగ్గురు భార్యలతో ఫుల్ ఎంజాయ్..

Wife: పనీపాటా లేదు.. ముగ్గురు భార్యలతో ఫుల్ ఎంజాయ్..

Wife: పెళ్లైన చాలామంది ఇచ్చే సలహా.. పెళ్లి చేసుకోవద్దని. భార్యతో వేగలేకపోతున్నామని మెజార్టీ భర్తలు చెబుతుంటారు. రెండు పెళ్లిళ్లు చేసుకున్నవాడు ఎవరైనా కనిపిస్తే.. అతన్ని చూసి ఆశ్చర్యపోతుంటారు. ఒక్క భార్యతోనే వేగలేకపోతున్నాం.. నువ్వేంట్రాబాబు రెండు పెళ్లిళ్లు చేసుకున్నావ్.. అంటూ ఆశ్చర్యపోతుంటాం. కానీ, ఒకటి రెండూ కాదు.. ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు ఒకడు. ముగ్గురు భార్యలతో.. ఒకే ఇంట్లో.. ఒకేసారి.. ముచ్చటగా కాపురం చేస్తున్నాడు. ఇదేమైనా మామూలు విషయమా?


అలాగని మనోడేమీ మన్మథుడు కాదు. సంపన్నుడూ కాదు. అందగాడూ కాదు. మంచి ఉద్యోగమూ లేదు. సెలబ్రిటీ కూడా కాదు. సూటిగా చెప్పాలంటే.. ఏ పనీపాటా లేకుండా.. ఖాళీగా ఉంటాడు. మరి, ఏం చేస్తుంటాడు? అంటే. జస్ట్ ముగ్గురు భార్యలతో ఎంజాయ్ చేస్తుంటాడు అంతే. వాళ్లే అతన్ని పోషిస్తుంటారు.

ఆ అదృష్టవంతుడి పేరు నిక్ డెవిస్. అమెరికాలో ఉంటాడు. తన ముగ్గురు భార్యలను ఉద్యోగాలకు పంపి హాయిగా ఇంట్లో ఉంటున్నాడు. పదిహేనేళ్ల క్రితం మొదటి భార్యగా ఏప్రిల్‌ (38)ను పెళ్లి చేసుకున్నాడు. ఓ ఆరేళ్ల కాపురం తర్వాత జెన్నీఫర్ (34)తో వెడ్డింగ్ బెల్స్ మోగించాడు. అందుకు మొదటి భార్య కూడా ఓకే చెప్పడం విశేషం. అలా ఇద్దరు భార్యలతో సఖ్యతగా ఉండగానే.. ఈసారి 22ఏళ్ల యంగ్ బ్యూటీ డానియేల్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు భార్యలు కలిసి.. దగ్గరుండి మరీ, భర్తకు మూడోపెళ్లి చేశారు. ముగ్గురూ కలిసి ఒకే ఇంట్లో కలిసిమెలిసి కాపురం చేస్తున్నారు.


అతడి ముగ్గురు భార్యలూ ఉద్యోగాలు చేస్తూ నిక్‌ను పోషిస్తుండటం మరింత ఇంట్రెస్టింగ్ పాయింట్. తనను తాను చెస్‌ ఆటలో రాజుతో పోల్చుకునే నిక్‌.. ‘‘రాజు ఎక్కడైనా కష్టపడతాడా?’’ అని ప్రశ్నిస్తాడు.

ప్రస్తుతం పిల్లలను కనే పనిలో బిజీగా ఉన్నాడు. ఇతడికి ఇప్పటికే ఓ కుమారుడు ఉండగా.. గతేడాది జూన్‌లో మరో చిన్నారి జన్మించింది. ఈ నెంబర్ ఇంకా పెరుగుతూనే ఉంటుందని అంటున్నాడు. నిక్ మూడు పెళ్లిళ్ల విషయం తెలిసి.. వారి ఫ్యామిలీ ఫోటోలు చూసి.. తెలిసినవారంతా తెగ కుళ్లుకుంటుంటారు. అతగాడి అదృష్టానికి ఈర్ష్య పడుతుంటారు. తామేమో ఒక్క భార్యనే భరించలేకపోతుంటే.. వాడేంటి ఏకంగా ముగ్గురు పెళ్లాలతో ఫుల్ ఖుషీగా ఉంటున్నాడని తెగ చర్చించుకుంటుంటారు. అలాంటి మాటలు విని.. నిక్ మరింత సంబరపడిపోతుంటాడు. ఆ మూడు పెళ్లిళ్ల ట్రిక్ ఏంటో తమకూ చెప్పమంటూ అతన్ని అడుగుతుంటారట తెలిసినవారంతా.

Tags

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×