BigTV English

Talking about replacing Biden: జోబైడెన్‌ను వద్దంటున్న డెమోక్రటిక్స్.. అభ్యర్థి మార్పు తప్పదా..?

Talking about replacing Biden: జోబైడెన్‌ను వద్దంటున్న డెమోక్రటిక్స్.. అభ్యర్థి మార్పు తప్పదా..?

Democrats talking about replacing Joe Biden: ఇటీవలే అట్లాంటాలో జరిగిన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో జరిగిన ఓ డిబేట్ లో అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తడబడిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి ప్రతిపక్ష పార్టీ నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అధికార పార్టీ డెమోక్రటిక్ మాత్రం అదేమీ లేదంటూ పేర్కొన్నది.


తడబడినంత మాత్రానా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించలేరా? అంటూ ప్రతిపక్ష నేతలపై విమర్శలు గుప్పించింది. ఇదిలా ఉంటే సొంత పార్టీలోనే జో బైడెన్ కు వ్యతిరేకత ఎదురవుతుంది. పార్టీలోని పలువురు కీలక నేతలతోపాటు ప్రముఖ కొన్ని వార్తా సంస్థలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి.

‘దేశానికి సేవ చేయాలంటే, అధ్యక్ష పదవి బరిలోంచి జో బైడెన్ వైదొలగాలి. ఈ దఫా ఆయన డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా కొనసాగడంలో హేతుబద్ధత ఏమీ లేదు’ అంటూ ప్రముఖ ఓ వార్త సంస్థ తన సంపాదకీయంలో పేర్కొన్నది. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వ రేసు నుంచి జో బైడెన్ ను తప్పించడం అత్యంత దేశభక్తితో కూడిన అవసరం అంటూ మరో వార్తా పత్రిక తెలిపింది.


అయితే, బైడెన్ మాత్రం.. తాను అధ్యక్ష పదవి పోటీలో కొనసాగుతున్నట్లు చెప్పారు. న్యూజెర్సీలో తాజాగా తన మద్దతుదారులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని పేర్కొన్నారు. మరోవైపు ట్రంప్ తో డిబేట్ తరువాత ఓటర్లలో 10 శాం మంది జోబైడెన్ వైపు మొగ్గుచూపారని ఓ సర్వేలో తేలినట్లు అధ్యక్షుడి బృందం తెలిపింది.

అయితే, షికాగోలో ఆగస్టు 19-22 మధ్య డెమోక్రటిక్ పార్టీ ప్రతినిధులు భేటీ కానున్నారు. ఈ భేటీలో అధ్యక్ష ఎన్నికల్లో తమ అభ్యర్థిని అధికారికంగా ఖరారు చేయనున్నారు. అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని దక్కించుకోవాలంటే 1975 మంది డెలిగేట్ల మద్దతు అవసరం ఉండగా, జోబైడెన్ కు 3894 మంది మద్దతు ఉంది.

Also Read: అవును.. నేను యువకుడిని కాదని నాకు తెలుసు.. కానీ,.. : జోబైడెన్

ఇదిలా ఉంటే.. ట్రంప్ తో జరిగిన డిబేట్ లో తడబాటుపై వస్తున్న విమర్శలపై బైడెన్ స్పందించిన విషయం తెలిసిందే. అవును.. తాను తడబడిన మాట వాస్తవమేనన్నారు. వయసు మీద పడుతున్నందున గతంలో మాదిరిగా చలాకీగా ఉండలేకపోతునన్నారు. అయితే, అధ్యక్ష పదవిని సమర్థవంతంగా నిర్వర్తించగలనన్న నమ్మకం తనకు బలంగా ఉందంటూ బైడెన్ పేర్కొన్నారు.

Related News

Pakistan: ఆయనో సేల్స్ మెన్, ఈయనో మేనేజర్.. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, ప్రధానిపై సెటైర్లు

America News: ఎయిర్‌పోర్టులో ఢీ కొన్న విమానాలు, ఎలా జరిగింది? వైరల్ అవుతున్న వీడియో

Philippines: చిగురుటాకులా వణికిన ఫిలిప్పీన్స్‌.. వరుసగా మూడు భూకంపాలు, 22 మంది మృతి

USA: అమెరికాలో లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల రాజీనామా..

Indonesia News: ఇండోనేషియాలో కూలిన స్కూల్ బిల్డింగ్.. శిథిలాల కింద 65 మంది విద్యార్థులు

Myanmar: మయన్మార్‌లో భూకంపం.. 4.7గా నమోదు, భారత్‌లోనూ ప్రకంపనలు

London News: గాంధీ విగ్రహంపై పిచ్చి రాతలు.. లండన్‌లో వెర్రి చేష్టలు, వెనుకున్నదెవరు?

Lawrence Bishnoi Gang: లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ చుట్టూ ఉచ్చు.. కెనడా సంచలనం నిర్ణయం

Big Stories

×