BigTV English

Assassinated US President List: అబ్రహం లింకన్ నుంచి డోనాల్డ్ ట్రంప్ వరకు.. తుపాకీ దాడులకు గురైనవాళ్లు వీరే..!

Assassinated US President List: అబ్రహం లింకన్ నుంచి డోనాల్డ్ ట్రంప్ వరకు.. తుపాకీ దాడులకు గురైనవాళ్లు వీరే..!

Abraham Lincoln to Donald Trump Assassinated US Presidents List: అమెరికాలోని పెన్సిల్వేనియాలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష ఎన్నికల కోసం ప్రచారం చేస్తుండగా భారీ భద్రతా వైఫల్యం ఏర్పడింది. ఓ యువకుడు డొనాల్డ్ ట్రంప్ పై కాల్పులు జరిపాడు. ఆ బుల్లెట్ డొనాల్డ్ ట్రంప్ కుడి చెవి గుండా దూసుకుపోయింది. కొన్ని మిల్లీ మీటర్ల తేడాతో ఆయన ప్రాణాలతో బయటపడ్డాడు. అమెరికా చరిత్రనే మలుపుతిప్పే ఘటనగా ఇది చరిత్రలో నిలిచిపోనుంది. ఈ ఏడాదిలో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈ దాడి కచ్చితంగా ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. డెమోక్రాట్లపై ఇప్పటికే రిపబ్లికన్లు మండిపడుతున్నారు. డెమోక్రాట్ల అధ్యక్ష అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ బరిలో నిలవనున్నారు.


అమెరికా అధ్యక్ష అభ్యర్థులు, అమెరికా అధ్యక్షులు ఇలా తుపాకీ దాడికి గురికావడం ఇదే తొలిసారి కాదు. ఇలా తుపాకీ దాడిలో మరణించిన అధ్యక్షులు కూడా ఉన్నారు. ఆ జాబితాను ఇప్పుడు పరిశీలిద్దాం. తొలిసారిగా ఈ దాడి అబ్రహం లింకన్ మీద జరిగింది. ఆ దాడిలో ఆయన ప్రాణాలు కోల్పోయారు.

లింకన్..


16వ అధ్యక్షుడైన అబ్రహం లింకన్ 1865 ఏప్రిల్ 14న జాన్ విల్కెస్ బూత్ అనే దుండగుడి చేతిలో తుపాకీ దాడికి గురయ్యారు. లింకన్ తన భార్య మేరీ టాడ్ లింకన్‌తో కలిసి అవర్ అమెరికన్ కజిన్ అనే కామెడీ షో వాషింగ్టన్‌లో చూసి బయటికి వచ్చాక ఈ దాడి జరిగింది. వెంటనే ఆయనను సమీపంలోని ఇంటికి తీసుకెళ్లి చికిత్స అందించారు. కానీ, మరుసటి రోజు ఉదయమే ఆయన తుదిశ్వాస విడిచారు. నల్లజాతీయుల హక్కుల కోసం పోరాడిన కారణంగా ఆయనపై ఈ హత్యా దాడి జరిగి ఉంటుందని చెబుతారు.

Also Read: Israel Gaza War: స్కూల్స్ టార్గెట్‌గా ఇజ్రాయిల్ దాడి..15 మంది మృతి

గార్‌ఫీల్డ్..

అమెరికా 20వ అధ్యక్షుడు ఆమెస్ గార్‌ఫీల్డ్ ఇలా హత్యకు గురైన రెండో అధ్యక్షుడు. అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న ఆరు నెలల్లోనే 1881 జులై 2న ఆయన ఓ ట్రైన్ స్టేషన్‌లో నడుచుకుంటూ వెళ్లుతుండగా దాడి జరిగింది. కొన్ని వారాలు ఆయనకు చికిత్స అందించినా బతకలేకపోయారు.

మెక్‌కిన్లీ..

1901 సెప్టెంబర్ 1వ తేదీన అమెరికా 25వ అధ్యక్షుడు విలియం మెక్ కిన్లీని న్యూయార్క్‌లో ఓ ప్రసంగం పూర్తి చేసిన తర్వాత దాడి చేసి హతమార్చారు. అందరికీ షేక్ హ్యాండ్ ఇస్తుండగా పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో చాతిలో రెండు షాట్లు పేల్చాడు ఓ నిరుద్యోగి. సెప్టెంబర్ 14న ఆయన తుదిశ్వాస విడిచారు.

కెన్నెడీ..

తన భార్య జాక్వెలిన్ కెన్నెడీతో కలిసి జాన్ ఎఫ్ కెన్నెడీ డల్లాస్ పర్యటిస్తుండగా హత్యకు గురయ్యారు. కాన్వాయ్‌లో ప్రయాణిస్తుండగా డల్లాస్ డౌన్ టౌన్‌లో ఆయనపై కాల్పులు జరిగాయి. వెంటనే పార్క్‌లాండ్ మెమోరియల్ హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూనే విషమించి జాన్ ఎఫ్ కెన్నెడి కన్నుమూశారు.

Also Read: Imran Khan Party Ban: ఇమ్రాన్ ఖాన్‌కు బిగ్ షాక్.. పీటీఐ పార్టీపై నిషేధం

బతికి బయటపడిన అధ్యక్షులు..

1933 ఫిబ్రవరిలో ఫ్రాంక్లిన్ రూజ్‌వెల్ట్ పై దాడి జరిగింది. కానీ, ఆయన గాయపడకుండానే తప్పించుకున్నాడు. 33వ అధ్యక్షుడు హ్యారీ ఎస్ ట్రూమాన్ కూడా 1950లో తుపాకీ దాడిని ఎదుర్కొన్నాడు. ట్రూమాన్ పై దాడి జరిగినా ఆయనకు గాయాలు కాలేదు. ఇక 38వ అధ్యక్షుడు జెరాల్డ్ ఫోర్డ్ ‌పై వారం వ్యవధిలోనే రెండు సార్లు హత్యా ప్రయత్నాలు జరిగాయి. కానీ, రెండింటి నుంచి ఆయన తప్పించుకోగలిగారు. 40వ అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ తన కాన్వాయ్ వైపు వెళ్లుతుండగా కాల్పులు జరిగాయి. బుల్లెట్ గాయాల నుంచి ఆయన కోలుకున్నారు. 43వ అధ్యక్షుడు జార్జ్ బుష్ పైనా తుపాకీ దాడి జరిగితే ప్రాణాపాయం కలుగలేదు.

అమెరికా అధ్యక్ష అభ్యర్థులుగా నిలిచిన థియోడర్ రూజ్ వెల్ట్, రాబర్ట్ కెన్నెడీ, జార్జ్ వాల్లెస్‌లపైనా దాడులు జరిగాయి. రూజ్‌వెల్ట్ గాయాల నుంచి కోలుకున్నా.. జాన్ ఎఫ్ కెన్నెడీ సోదరుడు రాబర్ట్ కెన్నెడీ మాత్రం కాల్పుల్లో మరణించాడు. వాల్లేస్‌కు బుల్లెట్ గాయాల కారణంగా నడుము కింది భాగం మొత్తం పక్షవాతం వచ్చింది.

Related News

Palakurthi Politics: ఎర్రబెల్లి యూ టర్న్.. యశస్విని రెడ్డికి షాక్ తప్పదా?

Kadapa MLA: కడప రెడ్డమ్మ కథ రివర్స్..?

BJP Vs BRS: కేసీఆర్‌కు బీజేపీ షాక్! వెనుక స్కెచ్ ఇదే!

Urea War: బ్లాక్ మార్కెట్‌కు యూరియా తరలింపు.? కేంద్రం చెప్పిందెంత..? ఇచ్చిందెంత..?

AP Politics: సామినేని అంతర్మథనం..

Satyavedu Politics: మారిన ఆదిమూలం స్వరం.. భయమా? మార్పా?

Big Stories

×