E-Paper
Advertisement

ఇరాన్‌పై మరోసారి అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఇదిగో వీడియో, వెనక్కి తగ్గేది లేదన్న ఇరాన్

ఇరాన్‌పై మరోసారి అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఇదిగో వీడియో, వెనక్కి తగ్గేది లేదన్న ఇరాన్
Advertisement

Iran War: ఇరాన్‌కు అమెరికా ఇచ్చిన గడువు కేవలం 24 గంటలు మిగిలి ఉంది. దీంతో ఏం జరుగుతోందన్న భయం ప్రపంచదేశాలను వెంటాడుతున్నాయి. తాజాగా ఇరాన్ పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు అధ్యక్షుడు ట్రంప్. టెహ్రాన్‌పై జరిపిన దాడుల్లో ఇరాన్‌కు చెందిన పలువురు సైనిక ఉన్నతాధికారులు మృతి చెందారని పేర్కొన్నారు. దీనికి సంబంధించి వీడియో పోస్టు చేశారు.

ఇరాన్‌పై మరోసారి అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Advertisement

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. టెహ్రాన్‌పై జరిపిన దాడుల్లో ఇరాన్‌కు చెందిన పలువురు సైనిక ఉన్నతాధికారులు మృతి చెందారని స్పష్టం చేశారు. సోషల్‌ మీడియా ట్రుత్‌ వేదికగా వీడియో షేర్ చేశారు. ఇరాన్‌పై విజయం సాధించామని రాసుకొచ్చారు. తమ సైన్యాన్ని తప్పుదారి పట్టించిన పలువురు నాయకులు భారీ దాడిలో హతమయ్యారని రాసుకొచ్చారు.

ట్రంప్ పోస్టు చేసిన వీడియోలో వాతావరణం చీకటిగా ఉంది. విమానాల శబ్దాలు, భారీ పేలుళ్లు వినిపించాయి. ఏం జరిగిందో ఈ వీడియోలో స్పష్టత లేరు. అయితే దాడి ఎక్కడ చేశామనే విషయాలను ఆయన వెల్లడించలేదు. ఆ వీడియో ఇరాన్‌పై దాడికి సంబంధించినదా? లేదా అనే ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి.

Advertisement

టెహ్రాన్‌పై దాడుల్లో ఇరాన్‌ సైనికాధికారులు మృతి.. వెనక్కి తగ్గేది లేదన్న ఇరాన్

శాంతి ఒప్పందం కుదుర్చుకుని హోర్మూజ్ జలసంధిని తిరిగి తెరవకపోతే ఇరాన్‌కు నరకం చూపిస్తామని హెచ్చరించారు ట్రంప్. మార్చి 26న వారం రోజులు సమయం ఇరాన్ అడిగిందని, తాము 10 రోజులు ఇచ్చామని అప్పట్లో ట్రంప్ చెప్పారు. ఆయన చెప్పిన గడువు సోమవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆయన ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఇరాన్‌ ఖండించింది. ఇరాన్ సెంట్రల్ మిలిటరీ కమాండ్ జనరల్ అలీ అబ్దొల్లాహి అలియాబాదీ ఘాటుగా స్పందించారు. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడికి పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. ట్రంప్‌ వ్యాఖ్యల్లో అసహనం కనిపిస్తోందని, ఆత్రుతతో వ్యాఖ్యలు చేశారన్నారు. అమెరికా ఒత్తిడికి తలొగ్గే ప్రసక్తే లేదన్నారు.

ALSO READ: పాక్ ప్రజలకు భారీ ఊరట.. లీటర్ పెట్రోల్‌పై రూ.80 తగ్గింపు.. పండుగ చేసుకుంటున్న జనం!

ప‌శ్చిమాసియాలో అమెరికా-ఇజ్రాయెల్ సైనిక స్థావరాలపై నిరంతరం దాడులు చేస్తామని స్పష్టంచేశారు. తమ దేశ ఆస్తులను, హక్కులను కాపాడుకోవడానికి వెనుకడుగు వేసేది లేదన్నారు. తమ అణు కేంద్రంపై దాడులు కొనసాగితే రేడియో ధార్మికత వెలువడి గల్ఫ్ దేశాలు అంతమవుతుందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి హెచ్చరించిన విషయం తెల్సిందే.

 

Related News

పెరులో వరుస భూకంపాలు.. ఆరుగురు మృతి, వందలాది మంది నిరాశ్రయులు

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

సముద్రంలో పెను విషాదం.. రోహింగ్యా శరణార్థుల పడవలు బోల్తా.. 500 మందికి పైగా మృతి!

Big Stories

Advertisement
×