E-Paper
Advertisement

‘రామాయణ’ వీఎఫ్ఎక్స్‌పై విమర్శలు.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన హృతిక్ రోషన్!

‘రామాయణ’ వీఎఫ్ఎక్స్‌పై విమర్శలు.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన హృతిక్ రోషన్!
Advertisement

Ramayana VFX: రణబీర్ కపూర్ హీరోగా నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘రామాయణం’. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ సోషల్ మీడియాలో భారీ చర్చకు దారితీసింది. ముఖ్యంగా ఇందులోని విజువల్ ఎఫెక్ట్స్ (VFX)పై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అయితే, ఈ విమర్శలపై బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ స్పందిస్తూ మేకర్స్‌కు పూర్తి మద్దతు ప్రకటించారు.

Read also-Illu Illalu Pillalu Today Episode: నర్మదతో భాగ్యం ఛాలెంజ్.. ధీరజ్, ప్రేమల మధ్య పెరిగిన దూరం.. శ్రీవల్లికి దిమ్మతిరిగే షాక్..

ఉద్దేశం ముఖ్యం..

Advertisement

హృతిక్ రోషన్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒక సుదీర్ఘమైన పోస్ట్‌ను షేర్ చేశారు. “ఒక భారీ చిత్రాన్ని రూపొందించే క్రమంలో నిర్మాతల ఉద్దేశం ప్రశంసించదగినది. కల్కి 2898 AD, బాహుబలి, ఇప్పుడు రామాయణం వంటి సినిమాలను తీస్తున్న వారు నా దృష్టిలో అసలైన హీరోలు. వారు అంతకుముందు ఎవరూ చేయని సాహసాన్ని చేస్తున్నారు” అని హృతిక్ పేర్కొన్నారు. సినిమాలోని వీఎఫ్ఎక్స్ వీడియో గేమ్ లాగా ఉన్నాయన్న విమర్శలపై హృతిక్ టెక్నికల్ కోణంలో సమాధానమిచ్చారు. వీఎఫ్ఎక్స్ అంటే కేవలం వాస్తవానికి దగ్గరగా ఉండటమే కాదు, ఒక్కో దర్శకుడు ఒక్కో శైలిని ఎంచుకుంటారు. కొన్నిసార్లు అది ‘స్టోరీ బుక్’ తరహాలో ఉండవచ్చు. వేలాది మంది కళాకారులు అహర్నిశలు శ్రమించి ఒక కలని తెరపైకి తెస్తారు. వారి శ్రమను తక్కువ చేసి చూడకూడదు. “ఇది నిజంగా కనిపిస్తుందా?” అని అడిగే బదులు, “ఇది ఆ కథా ప్రపంచానికి సరిపోతుందా?” అని ఆలోచించాలని హృతిక్ సూచించారు.

Read also-ప్రభాస్ ‘ఫౌజీ’ సెట్స్ నుండి ఫోటోలు లీక్.. వారికి వార్నింగ్ ఇచ్చిన మేకర్స్!

దర్శకుడికి అండగా..

Advertisement

నితేష్ తివారీ విజన్‌ను సమర్థిస్తూ.. “మనం విమర్శించే ముందు ఆ నిర్మాతలు తీసుకున్న రిస్క్‌ను గుర్తించాలి. ఇలాంటి భారీ చిత్రాలు మనల్ని సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. బాల్యంలో నేను చూసిన సినిమాలే నన్ను ఈ స్థాయికి చేర్చాయి. ఇప్పుడు రామాయణం కూడా నేటి తరం పిల్లలకు అలాంటి స్ఫూర్తిని ఇస్తుంది” అని హృతిక్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రంలో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్నారు. కన్నడ స్టార్ యష్ రావణుడి పాత్రలో కనిపిస్తుండగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ మొదటి భాగం 2026 దీపావళి కానుకగా విడుదలయ్యే అవకాశం ఉంది.

Related News

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

‘స్పిరిట్’ వాయిదా.. ఫ్యాన్స్‌కు కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన సందీప్ రెడ్డి వంగా!

గరివిడి లక్ష్మి సినిమాపై రవితేజ రివ్యూ.. ఏమన్నారంటే?

ఏడేళ్ల వయసులోనే సాఫ్ట్వేర్ సంస్థకు యజమాని.. ‘జైలర్’ బుడ్డోడు చిన్నోడు కాదండోయ్!

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

Big Stories

Advertisement
×