E-Paper
Advertisement

భారత్‌ నరకం వ్యాఖ్యలపై ట్రంప్ యూ-టర్న్.. తిట్టినా మనోడే.. పొగిడినా మనోడే

భారత్‌ నరకం వ్యాఖ్యలపై ట్రంప్ యూ-టర్న్.. తిట్టినా మనోడే.. పొగిడినా మనోడే
Advertisement

Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌ను నరకం (Hellhole) అని సంబోధించారన్న వార్తలు అంతర్జాతీయ స్థాయిలో దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో అమెరికా రాయబార కార్యాలయం ఈ అంశంపై వివరణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేస్తూ.. భారత్ పట్ల ట్రంప్‌కు ఉన్న అభిప్రాయాన్ని స్పష్టం చేసింది. ఆయన దృష్టిలో భారత్ ఒక గొప్ప దేశమని, తనకు అత్యంత సన్నిహితుడైన మిత్రుడు భారత్‌ను నడిపిస్తున్నారని ఎంబసీ పేర్కొంది.

అమెరికన్ రేడియో హోస్ట్ మైఖేల్ సావేజ్ నిర్వహించిన ఒక టాక్ షో ట్రాన్స్‌క్రిప్ట్‌ను డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా వేదికగా రీపోస్ట్ చేయడంతో ఈ వివాదం మొద‌లైంది. ఆ లేఖలో సావేజ్.. భారత్, చైనా, ఇతర దేశాలను భూమిపై ఉన్న నరకాలుగా అభివర్ణించారు. అమెరికాలో అమల్లో ఉన్న ‘బర్త్‌రైట్ సిటిజెన్‌షిప్’ (జన్మతః వచ్చే పౌరసత్వం) చట్టాన్ని ఆసరాగా చేసుకుని, పౌరసత్వం పొందడం కోసం తొమ్మిదో నెలలో గర్భిణులు ఈ దేశాల నుండి అమెరికాకు వస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ పోస్ట్ ప్రధానంగా అమెరికన్ సివిల్ లిబరీస్ యూనియన్ (ACLU) లక్ష్యంగా సాగింది. ఇది అమెరికన్ పౌరుల కంటే అక్రమ వలసదారులకే ఎక్కువ ప్రయోజనం చేకూరుస్తోందని ఆయన ఆరోపించారు.

Advertisement

ట్రంప్ ఈ వివాదాస్పద పోస్ట్‌ను షేర్ చేయడంపై భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఆచితూచి స్పందించిన కొద్దిసేపటికే అమెరికా ఎంబసీ స్పందించింది. “అధ్యక్షుడు ట్రంప్ భారత్‌ను ఒక గొప్ప దేశంగా పరిగణిస్తారు. అక్కడ తనకు అత్యంత ఆప్తమిత్రుడు (ప్రధాని మోదీని ఉద్దేశించి) అధికారంలో ఉన్నారని ఆయన స్వయంగా చెప్పారు” అని ఎంబసీ ప్రతినిధి వెల్లడించారు.మైఖేల్ సావేజ్ పాడ్‌కాస్ట్ వీడియోను ట్రంప్, షేర్ చేయడం వల్ల అది ఆయన అభిప్రాయమేనన్న సంకేతాలు వెళ్లాయని ఎంబ‌సీ స్ప‌త‌నిచ్చింది. సావేజ్ చేసిన వ్యాఖ్యలు ట్రంప్ వ్యక్తిగత అభిప్రాయాలు కాదని, అది కేవలం ఒక చర్చా కార్యక్రమానికి సంబంధించిన సమాచారాన్ని పంచుకోవడం మాత్రమేనని పరోక్షంగా స్పష్టం చేశారు.

Read Also: భారత్‌ను నరకంతో పోల్చిన ట్రంప్‌.. స్పందించిన భారత్‌

Related News

భారత్‌కు బిగ్ రిలీఫ్.. 100% టారిఫ్‌ల చట్టాన్ని నిలిపివేసిన డొనాల్డ్ ట్రంప్!

రష్యా సైన్యంలో ఉక్రెయిన్‌ ఏజెంట్.. 300 మంది సైనికుల్ని లేపేసి.. దేశం దాటేసిన యువ అధికారి!

రష్యాను కుదిపేసిన భారీ భూకంపం.. రిక్టర్ స్కేలు 7.0 గా నమోదు, నష్టంపై ఇంకా..

బలవంతంగా డ్రగ్స్‌ ఎక్కించి.. ఎఫ్ఐటీ విద్యార్థినిపై అత్యాచారం, అమెరికాలో షాకింగ్ ఘటన

పాఠశాలలో ఓ టీనేజర్ దారుణం.. గన్‌తో కాల్పుల మోత, టీచర్ సహా నలుగురు మృతి, అమెరికాలో ఘటన

హోర్ముజ్ జలసంధిలో బాంబుల శబ్దాలు.. పేలుతున్న మైన్స్-మునిగిన షిప్, అసలేం జరిగింది?

అతిపెద్ద చమురు సంస్థ అరామ్కోపై క్షిపణి దాడి.. హౌతీ దూకుడుతో సౌదీకి వణుకు

తన బొమ్మలకు పని చెప్పిన కిమ్.. క్షిపణులతో డిష్యుం డిష్యుం.. పొరుగు దేశాల్లో కలవరం!

Big Stories

Advertisement
×