Dragon Movie : టాలీవుడ్ స్టార్ హీరో గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ ప్రస్తుతం డ్రాగన్ సినిమాలో నటిస్తున్నారు. క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. కొన్ని కారణాలవల్ల ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వచ్చిన విషయం తెలిసిందే. మొత్తానికి ఇటీవల సినిమా తిరిగి షూటింగ్ ప్రారంభించింది. అయితే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావస్తుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ కోసమని డైరెక్టర్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా నుంచి అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు. తాజాగా బయటకొచ్చిన ఒక వార్త ఫ్యాన్స్ కి పూనకాలు తెపిస్తుంది. ఇంతకీ ఆ మ్యాటర్ ఏంటి అన్నది ఇప్పుడు మనం కాస్త వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..
ఇటీవల ఎన్టీఆర్ తన భుజానికి తగిలిన గాయానికి సర్జరీ చేయించుకున్న విషయం తెలిసిందే అయితే కొద్ది రోజులు రెస్ట్ తీసుకున్న ఎన్టీఆర్ మళ్లీ తిరిగి షూటింగ్లో పాల్గొంటున్నారు. ఇక ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ అప్డేట్ ఎంతవరకు వచ్చింది అన్నది ప్రస్తుతం ఫాన్స్ లో సస్పెన్స్ గా మారింది. డ్రాగన్ షూటింగ్ అప్డేట్ గురించి తెలుసుకునేందుకు ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు.తాజాగా ఈ మూవీ అప్డేట్ ప్రకారం ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తయిందని టాక్ వినిపిస్తుంది. డిసెంబర్ మొదటి వారంలో ఓ ప్రత్యేక సెట్ లో ఈ సినిమా క్లైమాక్స్ ను ఘాట్ చేస్తారట. క్లైమాక్స్ కోసం ఎన్టీఆర్ పై కొన్ని స్పెషల్ యాక్షన్ సీన్స్ ను ప్లాన్ చేసారు. ఈ యాక్షన్ సీన్ తర్వాత సినిమాలో ఒక పాటని షూట్ చెయ్యనున్నారని టాక్.. ఆ తర్వాత ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలు పెట్టనున్నారట. మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.. దేవర తర్వాత ఎన్టీఆర్ తెలుగులో నటించిన సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి..
ఈ మూవీ దాదాపు పూర్తికా వస్తున్న నేపథ్యంలో ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నట్లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా గురించి ఇప్పటికే పలు రకాల వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. అంతేకాదు ఏఐ వీడియోలు కూడా బయటకు రావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి. ఈ సినిమాకు ‘గాడ్ ఆఫ్ మాస్’ అనే టైటిల్ ను ఫిక్స్ చెయ్యనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో ఎన్టీఆర్ కుమారస్వామి పాత్రలో నటి నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఎన్టీఆర్ ఆ పాత్రలో కనిపిస్తున్నాడా లేదా అన్నది పక్కన పెడితే ఎన్టీఆర్ అభిమానులు మాత్రం కుమారస్వామిగా ఎన్టీఆర్ చాలా బాగుంటాడు అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు. మరి త్రివిక్రమ్ సినిమా మొదలైన తర్వాతే ఆయన ఏ పాత్రలో నటిస్తున్నారు అన్నది ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి ఈ సినిమా మొదలుకాకముందే భారీ హైప్ ని క్రియేట్ చేసుకుంది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ మరో రెండు భారీ ప్రాజెక్టులకు సైన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఆ సినిమాల గురించి వెల్లడించే అవకాశాలు కూడా ఉన్నట్లు టాక్.