Iran Iodine Tablets: ఇరాన్ తన ప్రజలకు అయోడిన్ టాబ్లెట్లు పంచుతోంది. యుద్ధరంగంలో ఉన్న తమకు ఎప్పుడు ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో తెలియని అనిశ్చితిలో ముందు జాగ్రత్తగా వాటిని పంపించేస్తుంది ఇరాన్. యుద్ధానికి అయోడిన్ టాబ్లెట్ కు సంబంధం ఏంటనే అనుమానం రావచ్చు. ఇంతకీ విషయం ఏంటంటే అను కేంద్రాలకు సమీపంలో ఉన్న ప్రజలకు ముందు జాగ్రత్తగా మేము అయోడిన్ టాబ్లెట్లను పంపినీ చేస్తున్నామ అని చెప్తుంది ఇరాన్. ట్రంప్ ను అసలు నమ్మలేము. ఆయన ఏ నేరానికైనా పాలపడే అవకాశం ఉంది. అని ఇరాన్ అధికారి ఒకరు మీడియాకు చెప్పారు. ఇటీవల అమెరికాతో ఉద్రిక్త తీవ్ర స్థాయిలో ఉన్న సమయంలో కూడా అణుస్థావరాల చుట్టూ రెండు నుంచి 3 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రజలకు టెహరాన్ ఈ ఔషధాలను పంచింది. ప్రజలకు రేడియో ధార్మికత ప్రభావాలను తగ్గించేందుకే ఈ అయోడిన్ టాబ్లెట్లు పంచుతున్నట్లు అక్కడ ప్రభుత్వం చెబుతుంది. రేడియేషన్ వల్ల థైరాయిడ్ కణాలు దెబ్బతింటాయి. దాంతో ఆ గ్రంధి పంతీరు మందగించి హార్మోన్లును సరిగ్గా ఉత్పత్తి చేయలేదు.
జాతీయ భద్రతా బృందంతో ట్రంప్ భేటీ..
అణుప్రమాదాల వల్ల రేడియేషన్ గురైన వారు భవిష్యత్తులో థైరాయిడ్ క్యాన్సర్ బారన పడే ప్రమాదం ఉందని నిపుణలు హెచ్చరిస్తున్నారు. రెండు రోజుల క్రితం జాతీయ భద్రతా బృందంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బేట అయ్యారు. ఇరాన్ పై సైనిక చర్య కొనసాగించాలా వద్దా అనే దానిపై ఆయన చర్చించినట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఇరాన్ లోని పికాక్స్ పర్వత ప్రాంతంలో ఉన్న అణుకేంద్రంపై దాడి జరగొచ్చన్న భయాలు ఇరాన్ ప్రాంతంలో నెలకొన్నాయి. అమావాస్య కావడంతో రాబోయే రెండు రోజుల్లో చంద్రుడి కాంతి తక్కువగా ఉంటుందని అది దాడులు చేయడానికి అనుకూలమైన సమయం అనే ఆందోళన కూడా వ్యక్తమవుతుంది.
మధ్యంతర ఫలితాల్లో ట్రంప్‌కు ఎదురుదెబ్బ..
యుద్ధం ప్రారంభించే విషయంలో తమ ప్రభుత్వం త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటుందని ఇటేవలే ట్రంప్ చెప్పారు. ఇవన్నీ కలిసి దాడుల భయాలను పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇరాన్ ముందు జాగ్రత్త చర్యలకు సిద్ధమైపోయింది. మరోవైపు ఇరాన్లో జరుగుతున్న అణు కార్యక్రమాల సమాచారం ఇస్తే 180 కోట్ల రివార్డ్ ఇస్తామని అమెరికా సైన్యం ప్రకటించింది. అంతేకాదు వారికి పునరావసరం కల్పిస్తామని కూడా చెప్తోంది. అలాగే ఇరాన్ లోని అణుకేంద్రాలు వాటి పరిసరాలు, పరికరాలు, సిబ్బంది శాస్త్రవేత్తల సమాచారం ఇచ్చిన వారికి రివార్డ్ ఫర్ జస్టిస్ ప్రోగ్రాం కింద ఈ భారి ఆఫర్ ఇస్తున్నట్టు అమెరికా ప్రకటించింది. మరోవైపు శుక్రవారం ఇరాన్ పై పరిమిత స్థాయిలో అమెరికా దాడులు చేసింది. కొన్ని నిమిషాల పాటు ఆ దేశ వైమానిక రక్షణ వ్యవస్థను టార్గెట్ చేశమని ట్రంప్ వెలడించారు. కేష్ ద్వీపంలో పేలులు వినిపించాయని టెహనాన్ మీడియా పేర్కొంది. మధ్యంతర ఫలితాల్లో ట్రంప్‌లకు ఎదురు దెబ్బ తగిలిన తర్వాత తొలిసారిగా ఈ దాడులు జరిగాయి.
మరోవైపు మధ్యతర ఎన్నికల్లో ట్రంప్ పార్టీ ఘోరంగా ఓటపు చెందింది. దీనితోటి తిక్కరేగిన ట్రంప్ ఏం చేస్తారో ఎలా వ్యవహరిస్తారో అన్నదాన్ని ఇరాన్ అంచలేకపోతుంది.
ఇరాన్ మళ్లీ ట్రంప్ యుద్ధం చేస్తారా..?
ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటా ఉంది. ఒక పక్క అమెరికాను అమెరికా మిత్రపక్ష దేశాలను కాచుకుంటున్న ఇరాన్ ఇంకో పక్క తన ప్రజలను కాపాడుకునేదాని కోసం ఈ అయోడిన్ టాబ్లెట్లు సరఫరా చేస్తా ఉంది. వాళ్ళ ఆరోగ్యం బాగుంటే భవిష్యత్తులో భవిష్యత్తు తరాన్ని జాగ్రత్తగా చూసుకోవచ్చు అనేది ఇరాన్ ప్లాన్. ఇంకొక వైపు ట్రంప్ ఏ క్షణమైనా కూడా ఇరాన్ మీద దాడి చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఆయన అణు కేంద్రాలనే రక్షంగా చేసుకునే అవకాశం కూడా లేకపోలేదని చెప్తాన్నారు. ఒక పక్క ఇరాన్ మీద చేస్తున్న దాడి వల్లే ఆ పార్టీ ఘోరంగా ఓడిపోయిందని విశ్లేషణ వస్తున్నప్పటికీ ట్రంప్ మళ్ళీ ఇరాన్ నే టార్గెట్ చేసి ఆ దేశం మీద యుద్ధానికి దిగబోతున్నారన్న వార్తలు అమెరికా ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.
ఆయిల్ కొరతలతో ఇబ్బందులు పడుతున్న ప్రపంచం..
ఇరాన్ మీద అమెరికా చేసిన దాడితో మొత్తం ప్రపంచం అంతా కూడా ఆయిల్ కొరతతోటి ఆయిల్ ధరలు పెరగడం తోటి గ్యాస్ కొరతోటి ఇబ్బంది పడిన విషయం అందరికీ తెలిసిందే అయితే ట్రంప్ ఏం చేసినా సరే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని ఇరాన్ ప్రకటించింది.