E-Paper
Advertisement

2028లో అమెరికాను ఏలేది ఎవరు? ట్రంప్ స్థానంలో ఈ ముగ్గురిలో ఒకరా?

2028లో అమెరికాను ఏలేది ఎవరు? ట్రంప్ స్థానంలో ఈ ముగ్గురిలో ఒకరా?
Advertisement

Donald Trump: అమెరికా రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ. డొనాల్డ్ ట్రంప్‌కు ఏమైంది? రిపబ్లికన్ పార్టీకి ఏమైంది? అసలు 2028లో అధ్యక్ష పీఠం కోసం పోటీ చేసేది ఎవరు? మొన్నటి వరకు అమెరికా రాజకీయాలను శాసించిన ట్రంప్‌కు ఇప్పుడు సొంత పార్టీ నుంచే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఇరాన్ యుద్ధం, ఆర్థిక పరిస్థితులు, ధరల పెరుగుదల, ప్రభుత్వ విధానాలు.. ఇలా అనేక అంశాలపై ప్రజల్లో అసంతృప్తి పెరిగింది. ఇప్పటికే ఈ ఇంపాక్ట్ మధ్యంతర ఎన్నికల్లో కనిపించింది. ఫలితం.. డెమోక్రాట్లు కాంగ్రెస్‌లోని రెండు సభలపైనా పట్టు సాధించారు. దీంతో ఇంకాస్త టైమ్‌ తర్వాత జరగాల్సిన డిస్కషన్ ఇప్పుడే మొదలైంది. ట్రంప్ తర్వాత ఆ పార్టీని నడిపించేది ఎవరు? జేడీ వాన్స్‌నా? మార్కో రూబియోనా? లేక పీట్ హెగ్సెత్‌నా? అమెరికా రాజకీయాల్లో అసలేం జరుగుతోందనే చూద్దాం.

ముందుగా ఎన్నికల ఫలితాల దగ్గరికి వెళ్దాం..

Advertisement

ముందుగా ఎన్నికల ఫలితాల దగ్గరికి వెళ్దాం. 2026 నవంబర్ 3న అమెరికాలో మధ్యంతర ఎన్నికలు జరిగాయి. సాధారణంగా అధ్యక్షుడి నాలుగేళ్ల పదవీకాలంలో రెండేళ్లు పూర్తయ్యాక జరిగే ఈ ఎన్నికలు ప్రభుత్వ పనితీరుకు ఒక టెస్ట్ అనే చెప్పాలి. ఈసారి మాత్రం ఫలితాలు రిపబ్లికన్ పార్టీకి గట్టి షాక్ ఇచ్చాయి. డెమోక్రాట్లు ప్రతినిధుల సభలో మెజారిటీ సాధించడంతో పాటు సెనేట్‌లోనూ లీడ్‌లోకి వచ్చారు. గతంలో రిపబ్లికన్లకు అనుకూలంగా ఉన్న కొన్ని రాష్ట్రాల్లోనూ డెమోక్రాట్లు విజయాలు సాధించారు.

అధ్యక్ష పదవికి పోటీ చేసేది ఎవరు?

Advertisement

అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఇది అధ్యక్ష ఎన్నిక కాదు. ట్రంప్ అధ్యక్షుడిగా కంటిన్యూ అవుతారు. కానీ మిగిలిన రెండేళ్లలో ఆయన తీసుకునే నిర్ణయాలకు కాంగ్రెస్ నుంచి ఎదురు దెబ్బలు తగలడం ఖాయం. ఇదే ఇప్పుడు రిపబ్లికన్ పార్టీలో నాయకత్వ భవిష్యత్తుపై చర్చకు దారితీసింది. 2028లో ట్రంప్ తర్వాత రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష పదవికి పోటీ చేసేది ఎవరు? ఈ క్వశ్చన్‌కు మెయిన్‌గా వినిపిస్తున్న ఆన్సర్‌ వైస్ ప్రసిడెంట్ జేడీ వాన్స్. ట్రంప్‌కు అత్యంత సన్నిహితుడిగా, ఆయన రాజకీయ ఉద్యమానికి వారసుడిగా వాన్స్‌ను చాలామంది చూస్తున్నారు. ట్రంప్ విధానాలకు ఆయన సపోర్ట్‌గా ఉన్నారు. బట్.. మిడ్ టర్మ్స్‌ ఎలక్షన్స్‌ రిజల్ట్స్‌తో రిపబ్లికన్లకు ఎదురైన ఓటమి తర్వాత వాన్స్ రాజకీయ భవిష్యత్తుపై కూడా చర్చ మొదలైంది.

ట్రంప్ తో తలపడ్డ మార్కూ రూబియా..

ఇక మరో కీలకమైన పేరు మార్కో రూబియో. ప్రస్తుతం అమెరికా విదేశాంగ మంత్రిగా ఉన్న రూబియో, ట్రంప్ ప్రభుత్వంలో అత్యంత కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్నారు. 2016లోనే ఆయన అధ్యక్ష పదవికి పోటీ చేసి రిపబ్లికన్ ప్రైమరీలో ట్రంప్‌తో తలపడ్డారు. ఇప్పుడు మరోసారి 2028 రేసులోకి వస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే తాను ట్రంప్ పదవీకాలం పూర్తయ్యే వరకు ప్రభుత్వంలో కొనసాగుతానని రూబియో క్లారిటీ చేశారు. 2028 ఎన్నికల గురించి ఇకపై డిస్కస్ కూడా చేయనని చెప్పేశారు. మరి ఆయన నిజంగానే రేసు నుంచి తప్పుకున్నారా? లేక ప్రస్తుతానికి ఊహాగానాలకు దూరంగా ఉంటున్నారా? అనేది చూడాలి. ఇక రిపబ్లికన్ పార్టీలో మరో పేరు పీట్ హెగ్సెత్. ప్రస్తుతం రక్షణ మంత్రిగా ఉన్న ఆయన కూడా 2028 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయవచ్చనే ప్రచారం గతంలో తెరపైకి వచ్చింది. అయితే హెగ్సెత్ కూడా అలాంటిదేం లేదన్నారు.

ట్రంప్ కి ఎన్నకయ్యే అవకాశం లేదు..

అయితే ఇక మిడ్ టర్మ్‌ ఎలక్షన్స్ తర్వాత.. రూబియో, హెగ్సెత్ రీజైన్ చేస్తారనే ప్రచారం జరిగింది. కానీ వైట్‌హౌస్ దాన్ని తోసిపుచ్చిందనుకోండి. అంటే ప్రస్తుతం రిపబ్లికన్ పార్టీలో నాయకత్వ మార్పు గురించి చర్చ జరుగుతున్నప్పటికీ, వీరిలో ఎవరూ అధికారికంగా 2028 అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని ప్రకటించలేదు. అసలు ఈ డిస్కషన్ ఎందుకు వచ్చిందంటే.. రాజ్యాంగంలోని 22వ సవరణ ప్రకారం ట్రంప్ మూడోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యే అవకాశం లేదు. ఒకవేళ ఉన్నా కూడా ఈసారి ఖచ్చితంగా పోటీ ఉండేదేమో.

ఈ కథలో మరో ఇంట్రెస్టింగ్ ఇష్యూ..

ఇప్పుడు ఈ కథలో మరో ఇంట్రెస్టింగ్ ఇష్యూ ఉంది. అదే భారతీయ అమెరికన్ నేత రో ఖన్నా. కాలిఫోర్నియా నుంచి ప్రతినిధుల సభకు ఎన్నికైన రో ఖన్నా డెమోక్రటిక్ పార్టీకి చెందిన నాయకుడు. అంటే ఆయన రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థుల రేసులో లేరు. డెమొక్రటిక్ పార్టీ తరఫున 2028లో పోటీ చేసే అవకాశాలపై చర్చ జరుగుతోంది. అంటే ఇటు రిపబ్లికన్ పార్టీ నుంచి.. అటు డెమోక్రటిక్ పార్టీ నుంచి కొత్త మొఖాలు కనిపించడం ఖాయంగా కనిపిస్తోంది.

ట్రంప్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ..

మొత్తానికి 2026 మధ్యంతర ఎన్నికలు అమెరికా రాజకీయాల్లో కీలకమైన మలుపుగా నిలిచాయి. ఒకవైపు ట్రంప్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ… మరోవైపు రిపబ్లికన్ పార్టీలో వారసత్వంపై చర్చ. 2028 అధ్యక్ష ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ, అమెరికా రాజకీయాలు ఇప్పటి నుంచే ఇంట్రెస్టింగ్‌గా మారాయి. మరి ట్రంప్ తర్వాత రిపబ్లికన్ పార్టీని నడిపించేది జేడీ వాన్సా? మార్కో రూబియోనా? మరో కొత్త నాయకుడా?

Also Read: నో స్ట్రెస్… ఓన్లీ ఫ్రెష్! సైబరాబాద్‌లో ప్రారంభం కానున్న వర్క్ ఫ్రమ్ పార్కులు

Tags

Related News

ఇరాన్ ముందస్తు వ్యూహం.. యుద్ధానికీ అయోడిన్ టాబ్లెట్లకీ సంబంధమేంటి?

అమెరికా బంపరాఫర్.. ఇరాన్ అణు రహస్యాలు చెప్తే రూ.165 కోట్లు.. గిఫ్ట్‌గా యూఏస్ పౌరసత్వం!

వైట్‌హౌస్‌లో ఊహించని పరిణామం.. సుసీ వైల్స్ అవుట్.. కొత్త చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా స్టీఫెన్ మిల్లర్!

ట్రావెలర్లకు బిగ్ అలర్ట్.. కువైట్ ఎయిర్‌పోర్టులో ఫోటోలు, వీడియోల చిత్రీకరణపై నిషేధం

మధ్యంతర ఎన్నికల ఫలితాలు.. ట్రంప్ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు, వందల కోట్ల నష్టం కూడా

అగ్రరాజ్యంలో మారిన లెక్క.. ఇండియాపై ఇంపాక్ట్ ఏంటి?

ట్రంప్‌కు డెమోక్రాట్ల దెబ్బ.. రాబోయే రెండేళ్లలో జరిగేది ఇదే!

Big Stories

Advertisement
×