Trump: అమెరికాలో మధ్యంతర ఎన్నికల ఫలితాలు.. అధ్యక్షుడు ట్రంప్‌కు ఎసరు తెచ్చిందా? ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత సొంత పార్టీ నుంచి నిరసనలు తీవ్రమవుతున్నాయా? ఎన్నికల ఫలితాలతో ట్రంప్ కంపెనీ షేర్ల పతనం అయ్యాయా? ఆయన ఆస్తి గణనీయంగా క్షీణించిందా? ఆయన పరిపాలన కాలంలో అవినీతిపై దర్యాప్తు చేపట్టేందుకు రెడీ అవుతోంది డెమోక్రటిక్ పార్టీ. మొత్తానికి ట్రంప్ ఉచ్చు బిగుసుకుంటోంది.
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో అధికార రిపబ్లిక్ పార్టీ ఘోర పరాజయం చవిచూసింది. ట్రంప్ రిపబ్లికన్ పార్టీ 435 సీట్లకు గాను కేవలం 139 సీట్లు గెలుచుకుంది. డెమోక్రటిక్ పార్టీ 228 సీట్లు గెలుచుకుంది. ట్రంప్ రెండోసారి పాలన ప్రజల నుంచి నిరసనలు తీవ్రమవుతున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అది స్పష్టమైంది. ఫలితంగా ప్రతినిధుల సభలో మెజారిటీని కోల్పోయింది ట్రంప్ పార్టీ. ఎన్నికలలో ఓటమి కాకుండా మరో నష్టాన్ని చవిచూశారు.
ఎన్నికలలో అధికార పార్టీ ఓటమి కారణంగా ఆయన కంపెనీ షేర్ల పతనం కావడంతో ఆస్తి గణనీయంగా క్షీణించింది. ఒక్క దెబ్బతో 73 మిలియన్ డాలర్లు అంటే సుమారు రూ. 690 కోట్లు కోల్పోయారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్ మాతృసంస్థ అయిన ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్-TMTG షేర్లు దారుణంగా పతనమయ్యాయి. ఈ కంపెనీ షేర్లు ఫలితాలు వచ్చిన క్షణాల వ్యవధిలో 11 శాతం పడిపోయింది. ఈ ఏడాది ఇప్పటివరకు ట్రంప్ మీడియా షేర్లు 55 శాతం పతనమయ్యాయంటే పరిస్థితి ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు.
ట్రంప్ మీడియా షేర్ పతనం వల్ల ట్రంప్ కుటుంబం క్రిప్టో హోల్డింగ్స్ పై ప్రభావితం చేశాయి. ట్రంప్ కుటుంబం ప్రారంభించిన వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్-WLFIకి అనుసంధానించబడిన డిజిటల్ టోకెన్లు ఒత్తిడికి గురయ్యాయి. ట్రంప్ తోపాటు ఆయన మద్దతుదారుడు ఎలాన్ మస్క్‌కు చెందిన కంపెనీ టెస్లా, స్పేస్‌ఎక్స్ షేర్లు ట్రేడింగ్ సమయంలో భారీగా పతనమయ్యాయి.
ఇదిలా వుండగా అధ్యక్షుడు ట్రంప్ అవినీతిని ఎన్నికల్లో ఓ ప్రధానాంశంగా తీసుకుంది డెమోక్రటిక్ పార్టీ. దీనిపై దర్యాప్తు చేపట్టేందుకు పావులు కదుపుతోంది. ఐసీఈ, ఎప్‌స్టీన్ ఫైళ్ల వ్యవహారం, డోజ్‌లపై విచారణ జరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఉభయ సభల్లో మెజారిటీ సాధించిన డెమోక్రటిక్ పార్టీ.. ట్రంప్, ఆయన అనుచరులు పాల్పడిన అవినీతిపై దర్యాప్తు జరిపిస్తామని సీనియర్ సభ్యులు చెబుతున్నారు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన కుటుంబ సభ్యుల ఆస్తులు పెరిగిన తీరుపై దృష్టి సారించనున్నట్లు తెలిపారు.
ALSO READ: అగ్రరాజ్యంలో మారిన లెక్క.. ఇండియాపై ఇంపాక్ట్ ఏంటి?
ట్రంప్‌పై అభిశంసన పెట్టాలని సూచిస్తున్నట్లు సూచన ప్రాయంగా చెప్పారు. వైట్‌హౌస్‌లో ట్రంప్ నిర్మించిన బాల్ రూమ్, ఇతర కట్టడాలపై దర్యాప్తు జరపాల్సి ఉందని సభ్యుడు జేర్డ్ హఫ్‌మన్ అభిప్రాయపడ్డారు. ఖనిజాల డీల్స్‌లో ట్రంప్ కుటుంబ సభ్యుల పాత్ర, వాషింగ్టన్ చుట్టూ ట్రంప్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు, క్రిప్టో లావాదేవీలపై దృష్టి సారించనున్నట్లు సెనేటర్ మెంథల్ తెలిపారు. ఎప్‌స్టీన్ ఆర్థిక లావాదేవీలపై బ్యాంకులు నిర్లక్ష్యంగా ఉంచచం, ట్రంప్‌తో సంబంధాల కారణంగా కొన్ని ఫార్మా కంపెనీలు లబ్ధి పొందిన అంశాలపై లోతుగా దర్యాప్తు జరిపిస్తామని డెమోక్రటిక్ సెనేటర్ రాన్ వెల్లడించారు. ట్రంప్ రెండోసారి పాలనలో ఆయన చుట్టూ రకరకాల కష్టాలు చుట్టిముట్టాయనే చెప్పవచ్చు.