Women’s T20 World Cup 2026: మహిళల టీ20 ప్రపంచకప్ 2026 టోర్నమెంట్ లో ( Women’s T20 World Cup 2026 Tournament) భాగంగా నిన్న సౌత్ ఆఫ్రికా వర్సెస్ పాకిస్తాన్ ( South Africa Women vs Pakistan Women, 11th Match) మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో అద్భుతంగా ఆడిన సౌత్ ఆఫ్రికా మహిళల జట్టు, విక్టరీ సాధించింది. అటు చివరి వరకు పోరాడిన పాకిస్తాన్, ఓటమిపాలైంది. అయితే పాకిస్తాన్ ఓటమిని తొలిసారిగా ఇండియన్ ఫ్యాన్స్ జీర్ణించుకోవడం లేదు. దక్షిణాఫ్రికాపై పాకిస్తాన్ గెలిస్తే, బాగుండని సోషల్ మీడియాలో మొత్తుకుంటున్నారు. పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనా (FATIMA SANA) చివరి వరకు అద్భుతంగా ఆడినప్పటికీ, మిగిలిన ఆటగాళ్లు ఎవరూ రాణించలేదు. దీంతో రెండు వికెట్ల తేడాతో ఓడిపోయింది పాకిస్తాన్. ఈ ఓటమితో దాదాపు ఈ టోర్నమెంట్ నుంచి పాకిస్తాన్ ఎలిమినేట్ అయినట్లేనని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.
మహిళల ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా నిన్న ఎడ్జ్ బస్టన్ వేదికగా సౌత్ ఆఫ్రికా వర్సెస్ పాకిస్తాన్ మహిళల జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో పాకిస్తాన్ మొదట బ్యాటింగ్ చేయగా, తొమ్మిది వికెట్ల నష్టానికి 126 పరుగులు సాధించింది. ఫాతిమా సనా 55 పరుగులతో అదరగొట్టింది. టీమిండియాతో జరిగిన మ్యాచ్ సందర్భంగా డకౌట్ అయిన ఆమె, ఈ మ్యాచ్ లో మాత్రం అర్థ సెంచరీతో రెచ్చిపోయింది. ఇక ఈ లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా 16.5 ఓవర్లలో ఛేదించింది. దీంతో టి20 మహిళల ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నుంచి పాకిస్తాన్ దాదాపుగా ఎలిమినేట్ అయినట్లే.
మహిళల ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో గ్రూప్ ఏ లో టీమిండియా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, నెదర్లాండ్స్ ఉన్నాయి. పాయింట్ల పట్టిక ప్రకారం ఇండియా టాప్ లో ఉంది. ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉంది. అయితే నిన్న జరిగిన మ్యాచ్ సందర్భంగా పాకిస్తాన్ గెలిచి ఉంటే… దక్షిణాఫ్రికా గ్రూప్ స్టేజ్ లో ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉండేది. పాకిస్తాన్ గెలిస్తే… దక్షిణాఫ్రికా తన తర్వాతి మ్యాచ్ లలో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఉండేది. ఇక ఇండియాతో మ్యాచ్ జరిగినప్పుడు… దక్షిణాఫ్రికాను ఓడిస్తే ఇంటి దారి పట్టేది. కానీ నిన్నటి మ్యాచ్ లో పాకిస్తాన్ ఓడిపోయి… బలమైన దక్షిణాఫ్రికాకు అవకాశం ఇచ్చింది. ఒకవేళ ఫైనల్ వరకు దక్షిణాఫ్రికా వస్తే, వాళ్లు టైటిల్ గెలిచిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. టీమిండియాను ఢీకొట్టే బలం దక్షిణాఫ్రికాకు ఉంది. అలాంటి జట్టు తొందరగా ఎలిమినేట్ అయితేనే టీమిండియా కు లాభం. అలాంటి అవకాశాన్ని నిన్న పాకిస్తాన్ పోగొట్టింది. దీంతో ఇండియన్ ఫాన్స్ ఎమోషనల్ అవుతున్నారు.
Fatima Sana is a one-woman army in Pakistan camp. With the bat, with the ball and as captain she had a dream game only to lose to South Africa by two-wickets in a sensational match – because of little support from others.
BTW, had Pakistan won tonight they may have actually…— Vikrant Gupta (@vikrantgupta73) June 17, 2026